Wednesday, August 3, 2016

పాలరాయి నగరం....ఫోటోలు

తుర్కమేనిస్తాన్ రాజధాని అష్గబత్ నగరాన్ని పాలరాయి నగరంగా పిలుస్తారు. ఎందుకంటే ఈ నగరంలోని వందలాది ప్రభుత్వ భవనాలు మరియు ప్రైవేట్ అపార్ట్ మెంట్లు ఇటాలీ దేశం నుండి దిగుమతి చేసుకున్న పాలరాయితో నిర్మించబడ్డాయి. రాజధాని మధ్య ప్రాంతంలోని కొన్ని పాలరాయి భవనాలు బంగారు ఆభరణాలతో అలంకరించబడ్డాయి. తుర్కమేనిస్తాన్ సహజవాయువు ఎగుమతుల వలన ఎంతగా సంపాదిస్తోందో ఇది తెలియపరుస్తోంది.

తుర్కమేనిస్తాన్ ప్రపంచములోనే 10వ పత్తి ఉత్పత్తిదారు. సాగుభూమిలో సగభాగము పత్తి పండిస్తారు. పెద్ద సహజ వాయువు నిల్వలు, చమురు నిల్వలో తుర్కమేనిస్తాన్ ప్రపంచములోనే 5వ స్థానంలో ఉన్నది.

No comments:

Post a Comment