Thursday, August 18, 2016

షాంఘై వివాహ బజారు...ఫోటోలు మరియు వివరాలు

సాధారణంగా వివాహాలు స్వర్గంలోనే నిర్ణయమౌతాయని ఆంగ్లంలో ఓ నానుడి ఉంది. స్వర్గంలో నిర్ణయించబడిన వివాహాలు భువిపై వాటిని పాటించాల్సి వుంటుంది. మనిషి తన జీవితంలో ఎన్నో మైలు రాళ్ళను అధిగమిస్తుంటాడు. అందులో పెళ్ళి అనేది ఓ మహత్తర కార్యక్రమం. ప్రతి ఒక్కరు తమ జీవిత భాగస్వామిని ఎంచుకునేందుకు, వారి తల్లిదండ్రులు సహాయపడుతుంటారు. ఈ విషయంలో ప్రపంచమంతా ఒకటే దారిలో వెడుతోంది. ఇందులో ఎటువంటి సందేహమూ లేదు. ప్రేమ పెళ్ళిళ్ళు, తల్లితండ్రులకు తెలియకుండా పెళ్ళిచేసుకునే వారు అన్ని దేశాలలో ఉన్నారు. ఈ విషయం వదిలేస్తే పిల్లల పెళ్ళిలకు వధూవరులను వెతుక్కోవాటానికి తల్లితండ్రులు చేసే ప్రయత్నాలు, పడే కష్టాలూ ఒకటిగానే ఉన్నాయి. మార్గాలే వేరుగా ఉన్నాయి.
చైనా దేశంలోని షాంఘై నగరంలో ప్రతి శనివారం మరియు ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు అక్కడున్న "పీపుల్స్ పార్క్" పెళ్ళీడుకు వచ్చిన పిల్లలున్న తల్లితండ్రులతో నిండిపోతుంది. ఎలాంటి వాతావరణం నెలకొన్నా, ఆ రెండురోజులూ, ఆ సమయంలో ఈ పార్కుకు పెళ్ళికాని పిల్లలున్న తల్లితండ్రులు వెళ్ళక మానరు.
ఆ పార్కులో వందలకొద్ది వధూవరుల బయో డేటాలు వేలాడుతూ ఉంటాయి. అందులో వాళ్ళ పిల్లల గురించిన ఎత్తు, వయసు, చదువు, సంపాదన, కుటుంబ హోదా, చైనా రాసి గుర్తులు మరియూ అన్ని ముఖ్యమైన విషయాలు రాసుంటాయి.
ఒకప్పుడు మనదేశంలాగానే అక్కడకూడా చిన్న వయసులోనే వివాహాలు జరిగేవి.రానురాను చిన్న వయసు వివాహాలు పోయి, మధ్య వయసు వివహాలు చోటుచేసుకున్నాయి.
కానీ ఇప్పుడు మన దేశములోలాగానే అక్కడ కూడా పెళ్ళికి పిల్లలు తొందర చూపడంలేదు. 30 ఏళ్ళ వయసున్న వధూవరుల సంఖ్య ఎక్కువగా ఉందట.

No comments:

Post a Comment