Tuesday, August 30, 2016

ప్రపంచవ్యాప్తంగా వృద్ధాప్య పెన్షన్లు....ఫోటోలు

సామాజిక, ఆర్థిక సమస్యలకు తోడు వృద్ధాప్యం, వైకల్యం, వైధవ్యంతో దీనస్థితిలో బతుకీడుస్తున్న అభాగ్యులకు కొద్దిపాటి ఊరట కలిగించే సాధనం వృద్ధాప్య పెన్షన్లు.

స్థూల ఆర్థిక శాస్త్రములో జాతీయ ఆదాయము ఒక ముఖ్యమైన భాగము. ఇది ఒక వ్యక్తి లేదా సంస్థను కాకుండా ఒక దేశం మొత్తానికి అన్వయించే విశ్లేషణ. స్థూల ఆర్థిక విశ్లేషణకు బాటలు వేసిన జాన్ మేనార్డ్ కీన్స్ ఆర్థికవేత్త వలన 1936 నుంచి ఈ భావన ప్రాముఖ్యంలోకి వచ్చింది. 1930 దశాబ్దంలో వచ్చిన మహా ఆర్థికమాంద్యం వల్ల దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నమయ్యాయి. అప్పటి వరకు ఆర్థిక వేత్తల దృష్టి ఒక్క సారిగా సూక్ష్మ అర్థశాస్త్రం నుంచి స్థూల ఆర్థిక విధానాల వైపు మళ్లింది. దేశాలు అభివృద్ధి చెందుటకు, దేశాల మధ్య వ్యాపారం కొనసాగుటకే కాకుండా ప్రజల శ్రేయస్సు దృష్ట్యా చూసిననూ తలసరి ఆదాయం పెంపొందించుట మొదలగు విషయాలు జాతీయ ఆదాయం (National Income) పై ఆధారపడి ఉన్నాయి.

పెన్షన్లు ఇవ్వటం జాతీయ ఆదాయం పై ఆధారపడి ఉన్నా కొన్ని దేశాలు ఔదార్యముతో వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నారు. ఏ ఏ దేశాలు ఎంత ఇస్తున్నారో ఈ టపా మూలం తెలుసుకోండి....పెన్షన్ల డబ్బు డాలర్లలో ఇవ్వబడింది...అయినా తేడాలు తెలుసుకోవచ్చు.

1 comment:


  1. మరీ ఇంత పొంతన లేకుండా ఉందే మన దేశాని కి ! సౌత్ ఆఫ్రికా వాడు ఐరోపా వల్ల ఆ పాటి పించను రీతి లో ఉన్నట్టున్నాడు !

    అమరికగ చిత్ర పించను
    నమర్చ నటుల పదహారు నంబరు దేశం
    బు,మనది, గనంగ ఔరా
    మెమొరాండము నివ్వ వలయు మేలిమి గానన్ !

    జిలేబి

    ReplyDelete