Wednesday, August 31, 2016

మిస్టరీ: అంతరిక్షం లో బెర్ముడా ట్రయాంగిల్ (స్పేస్ బెర్ముడా ట్రయాంగిల్)....ఫోటోలు మరియు వివరాలు

బెర్ముడా ట్రయాంగిల్ వాయువ్య అట్లాంటిక్ మహాసముద్రం లోని ఒక ప్రాంతం. చాలా సంవత్సరాల నుంచీ ఈ ప్రదేశం మీదుగా ఎగిరే విమానాలు, ఆ భాగంలో ప్రయాణించే నౌకలు అనుమానాస్పద రీతిలో అదృశ్యం అవుతుండడం వలన ఇది ఒక ప్రమాదకరమైన ప్రదేశంగా పరిగణించబడింది. బెర్ముడా ట్రయాంగిల్ – ఈ ప్రదేశం ఎక్కడుందో తెలీక పోయినా దానికి సంబంధించిన వింతలు, విశేషాలు వినని వారుండరు.

ఇలాంటి ఒక ప్రమాదకరమైన చోటు (ప్రాంతం) అంతరిక్షంలో కూడా ఉండొచ్చని మీరెప్పుడైన అనుకున్నారా? అనుకోనుండరు. బహుశ ఇప్పుడు మీలో దాని గురించి తెలుసుకోవలనే ఆసక్తి కలిగుంటుంది. మీరు అదృష్టవంతులు. ఎందుకంటే అలాంటి (బెర్ముడా ట్రయాంగిల్) ఒక ప్రాంతం అంతరిక్షంలో ఉన్నది. దాని గురించి తెలుసుకోబోతున్నారు.
అంతరిక్షములోని ఈ ప్రాంతమును దక్షిణ అట్లాంటిక్ క్రమ విరుద్ధత ప్రాంతం (South Atlantic Anomaly)అంటారు. ఇక్కడ అత్యంత శక్తివంత అయస్కాంత అణువులు కలిగిన పొర క్షేత్రం ఉంటుంది.

1958 లో James Van Allen అనే శాస్త్రవేత్త అంతరిక్షంలో శక్తివంత అయస్కాంత అణువులు కలిగిన 2(భూమికి ఇరువైపులా ఒకటోకటి) పొర క్షేత్రాలు ఉన్నట్లు కునుగొన్నారు. ఈ క్షేత్రమును రేడియేషన్ బెల్ట్ అంటారు. ఈ బెల్టుల ఎత్తు 1000 కిలోమీటర్ల నుండి 60,000 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అప్పుడప్పుడు ఎత్తు మారుతూ ఉంటుంది. అయస్కాంత శక్తి కలిగిన భూమికి పైన ఇలాంటి బెల్టులు రెండు ఉండటమే శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం కలిగించింది. ఆయన కనుగొన్నందువలన ఆ ప్రాంతాలకు వాన్ అలెన్ రేడియెషన్ బెల్టులు అని పేరు పెట్టబడింది.
ఈ విషయం తెలుసుకున్న వెంటనే అమెరికాలోని అంతరిక్ష పరిశోధనా కేంద్రమైన నాసా, ఈ బెల్టుల గురించి మరింత తెలుసుకోవాలని పరిశోధనా కార్యక్రమాలను మొదలు పెట్టింది. ఈ రేడియేషన్ బెల్టులలో నుండి రేడియేషన్ వెలువడుతోందని, అది ఉపగ్రహాలకు హాని కలిగించవచ్చని తెలుసు కున్నారు. అందువలన ఉపగ్రహాలను ఆ బెల్టుల దగ్గరకు వెళ్ళకుండా చూసుకుంటూ వచ్చేరు. అయితే ఈ ప్రాంతంలో ఏమి జరుగుతుందనే విషయంలో ఎవరూ ఒక నిర్ణయానికి రాలేకపోయేరు.

రేడియేషన్ బెల్టులకు లోపల మరింత ఎక్కువ అయస్కాంత శక్తి కలిగిన అణువుల పొర క్షేత్రం ఉన్నట్లు కునుగొన్నారు. దానికి “దక్షిణ అట్లాంటిక్ క్రమ విరుద్ధత ప్రాంతం” అని పేరు పెట్టేరు. అయితే దాని గురించి ఎక్కువగా తెలుసుకోలేకపోయేరు. ఎందుకంటే దాని గురించి తెలుసుకోవాలంటే పొరలోపలకు వెళ్ళి పరిశోధనలు జరపాలి. అది కుదిరే పని కాదు. ఉపగ్రహాలు రేడియేషన్ బెల్టులకు దగ్గరగా కూడా వెళ్ళవు కాబట్టి పరిశోధనలను అంతవరకే నియంత్రించుకున్నారు.....కానీ బెల్టులకు లోపల ఉన్న అత్యంత శక్తి కలిగిన పొర అప్పుడప్పుడు బయటకు వస్తున్నట్లు తెలుసుకోలేకపోయేరు.
బ్రెజిల్ దేశ సముద్ర తీరానికి కొద్ది దూరంలో భూమికి పైన 200 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నది ఈ దక్షిణ అట్లాంటిక్ క్రమ విరుద్ధత ప్రాంతం (స్పేస్ బెర్ముడా ట్రయాంగిల్). అంటే భూమి తిరుగుతున్నప్పుడు రేడియేషన్ బెల్టులలో దాగి ఉన్న దక్షిణ అట్లాంటిక్ క్రమ విరుద్ధత ప్రాంతం ఈ చోట భూమి ఉపరితలానికి దగ్గరగా వస్తోంది. మానవుడు ఎదుర్కొన్న అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం ఇదే. శాస్త్రవేత్తల పరిశోధనలో భూమి ఉపరితలంపై బలహీనమైన అయస్కాంత శక్తి కలిగిన ప్రదేశాలపైన స్పేస్ బెర్ముడా ట్రయాంగిల్ ఉంటోంది.

కమ్యూనికేషన్ ఉపగ్రహాలు భూమిపైన కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో మాత్రమే ఉంచబడతాయి. 1991-1994 మధ్యలో కమ్యూనికేషన్స్ కోసం గ్లోబల్ స్టార్ ఉపగ్రహాలు పంపబడ్డాయి.ఇవన్నీ వైఫల్యాలు చెందేయి. గ్లోబల్ స్టార్ ఉపగ్రహాలు వైఫల్యం కావడానికి దక్షిణ అట్లాంటిక్ క్రమ విరుద్ధత ప్రాంతమే కారణమని అప్పుడు తెలుసుకున్నారు.
అంతరిక్ష నౌకలలో ప్రయాణం చేస్తున్న వ్యోమగాములు, తమ నౌకలలోని కమ్యూనికేషన్ పరికరాలు దక్షిణ అట్లాంటిక్ క్రమ విరుద్ధత ప్రాంతమును దాటు తున్నప్పుడు పనిచేయడంలేదని తెలిపేరు. దక్షిణ అట్లాంటిక్ క్రమ విరుద్ధత ప్రాంతము లోపలి నుండి వింతగా మెరిసే లైట్లు బయటకు వస్తున్నాయని వ్యోమగాములు తెలుపడంతో నాసా, మరియు ఇతర దేశాల అంతరిక్ష కేంద్రాలు ఉపగ్రహాలను తయారుచేస్తున్నప్పుడు మరింత బలమైన లోహ కవచాలను వాడటం మొదలుపెట్టేరు.

2009 లో బ్రెజిల్ దేశం నుండి ఫ్రాన్స్ దేశంలోని ప్యారీస్ నగరానికి బయలు దేరిన ఫ్రాన్స్ దేశ విమానం 447 మాయమవటానికి/పడిపోవటానికి (విమానంలోని యంత్రాలన్నీ ఒకే సమయంలో పనిచేయకపోవడంతో) స్పేస్ బెర్ముడా ట్రయాంగిల్ కారణమై ఉంటుందని భావిస్తున్నారు.

హబుల్ అంతరిక్ష నౌకలో కమ్యూనికేషన్ పరికారాలకు ఆటొమేటిక్ షట్ డౌన్ (మూసుకునే) పద్దతి ఏర్పరిచేరు. అంతర్జాతీయ అంతరిక్ష పరిశొధనా కేంద్రం (International Space Station) కు అదనపు కవచాలు అమర్చేరు. దక్షిణ అట్లాంటిక్ క్రమ విరుద్ధత ప్రాంతమునకు దగ్గరగా వచ్చినప్పుడు అంతరిక్ష నడక నివారిస్తారు. అంతర్జాతీయ అంతరిక్ష పరిశొధనా కేంద్రం (International Space Station) రోజుకు 5 సార్లు స్పేస్ బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతాన్ని తిరిగి వెడుతుంది.
స్పేస్ బెర్ముడా ట్రయాంగిల్ పై చేస్తున్న పరిశోధనలలో ఈ మధ్య తెలిసిన మిస్టరీ విషయమేమిటంటే ఈ స్పేస్ బెర్ముడా ట్రయాంగిల్ పశ్చిమ దిశగా జరుగుతున్నట్లు తెలుసుకున్నారు.

ఎందుకు అలా జరుగుతోందో, లోపలి నుండి వింతగా మెరిసే లైట్లు ఎందుకు బయటకు వస్తున్నాయో పూర్తిగా అర్ధం చేసుకోలేకపోతున్నారు. ఈ దక్షిణ అట్లాంటిక్ క్రమ విరుద్ధత ప్రాంతం (స్పేస్ బెర్ముడా ట్రయాంగిల్) లో నుండి శక్తివంతమైన రేడియేషన్ వెలువడుతోందని మాత్రమే తెలుసుకున్న శాస్త్రవేత్తలు, అలా ఎందుకు జరుగుతోందో, అసలు రేడియేషన్ బెల్టులు ఎందుకు ఉన్నాయో తెలుసుకోలేకపోవడంతో ఈ స్పేస్ బెర్ముడా ట్రయాంగిల్ ఒక మిస్టరీగా మిగిలిపోయింది.
ఉపగ్రహాలను స్పేస్ బెర్ముడా ట్రయాంగిల్ దగ్గరగా వెళ్ళకుండా చూసుకోవటం మాత్రమే చేస్తున్నారు. దగ్గరగా వెడితే ఉపగ్రహాలు రేడియేషన్ తాకిడికి కరిగిపోయి మాయమైపోతాయని హెచ్చరించేరు.

No comments:

Post a Comment