Tuesday, August 16, 2016

భూమి విశ్వంలో ఒక గ్రామమా?..వింత జీవులకూ ఒక నివాసమా?...ఫోటోలు మరియు వివరాలు

విశ్వంలో భూ ప్రపంచాన్ని పోలినటువంటి మరో 715 ప్రపంచాలు ఉన్నాయని అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కనుగొన్నది. కొత్తగా కనుగొన్న గ్రహాలు సౌర వ్యవస్థకు బయట ఉన్నాయని నాసా ధృవీకరించింది. ఈ విషయాన్ని ఎక్సో ప్లానెట్ ఎక్స్ ప్లొరేషన్ ప్రోగ్రామ్ శాస్త్రవేత్త డగ్లస్ హడ్గిన్స్ ప్రకటించారు. వీటిని కనుగొనేందుకు కెప్లర్ టెలిస్కోప్ను ఉపయోగించామని తెలిపారు. దాంతో ఇప్పటివరకు కనుగొన్న గ్రహాల సంఖ్య 1700కు చేరింది. కొత్తగా కనుగొన్న గ్రహాలన్నీ దాదాపు భూమి సైజులో ఉన్నాయనీ, ఒక్కో నక్షత్రం చుట్టూ కొన్ని గ్రహాల చొప్పున తిరుగుతున్నాయనీ వారు పేర్కొన్నారు.

కెప్లర్ టెలిస్కోపు తీసిన గ్రహాల ఫోటో

కొత్త గ్రహాలను కనుగొనడంతో మరో గ్రహంపై కూడా జీవరాశికి అవకాశాలు ఉన్నాయన్న శాస్త్రవేత్తల వాదనకు బలం చేకూరింది. కొత్తగా కనుగొన్న గ్రహాల్లో నాలుగింటిపై ఎక్కువ ఉష్ణోగ్రత, ఎక్కువ చలి లేదు. అంటే దాదాపు భూమిపై వాతావరణాన్ని పోలి ఉందన్నమాట. దీంతో అక్కడ నీళ్లు, జీవరాశి మనుగడకు ఆస్కారం ఉంటుందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు.

కెప్లర్ టెలిస్కోపు
ప్రకృతి చాలా విచిత్రమైంది. అందులో ప్రతిజీవి ఒక్కో ప్రత్యేకతతో వుంటుంది. దేనిలోకం దానిది.

చూసేమని చెబుతున్న యతి వింత జంతువు
ఈ సమాజం ఎలా ఉద్బవిoచిందో ఇప్పటికి ,ఎప్పటికి అంతు చిక్కని ప్రశ్న. ఐనా కానీ ఈ సమాజంలో ఎన్నో మార్పులు, ఎన్నో వింతలు , వింత పోకడలు సంబవించాయి ,సంబవిస్తూనే వున్నాయి.

వాసుకి లాంటి సర్పం, జటాయువు, సంపాతి లాంటి పక్షులు ఉండే అవకాశమే లేదు అంటారు కొందరు. కానీ ఆమధ్య ఆఫ్రికా అడవుల్లో అతి పొడవైన పాము కనిపించింది. వాషింగ్టన్ భౌగోళిక సంఘం వాళ్ళు అర్జంటినాలో అతి పెద్ద పక్షి అస్తిపంజరం దొరికిందని ప్రకటించారు. దాని బరువు 77 కిలోలు కాగా, అది రెక్కలు చాచినప్పుడు 25 అడుగులు ఉంటుందని అంచనా వేసి రాశారు. మరి, ఈ జంతువులు ఇప్పుడు లేవు కనుక, వీటిని స్వయంగా చూడలేదు కనుక ఇవి ఒకప్పుడు ఉన్నాయంటే నమ్మలేము అంటే ఎలా? అలా గనుక ఖండిస్తే, ఒకరకంగా అది హాస్యాస్పదం అవుతుంది.

అర్జంటినాలో దొరికిందని చెప్పబడుతున్న అతి పెద్ద పక్షి అస్తిపంజరం ఊహా చిత్రం
సృష్టికర్త అయిన దేవుడు ఎన్నో సృష్టిరాశులను తయారు చేసాడు. ప్రపంచంలోని పలుచోట్ల వింత జీవులు సంచరిస్తున్నాయని చాలా మంది చెబుతూ ఉంటారు. అయితే ఇది నిజమా లేక వట్టి పుకారేనా అన్నది నిర్ధారణ కాలేదు...సరే...ఈ విషయాలు పక్కనపెడదాం. ఈ మధ్య భూమి మీద దొరికిన/పట్టుబడిన వింత జీవులు ఏ లోకానికి చెందినవి...? ఈ ప్రశ్నకు కారణం జంతు శాస్త్ర నిపుణులు కూడా ఈ వింత జంతువులు ఏకోవకు/జాతికి చెందినవో చెప్పలేకపోవడమే!

1)...ఈ మధ్య(ఏప్రిల్-2015లో) చైనా నగరమైన Shenzhen లో ఒక వికారమైన, విచిత్రమైన జీవిని కనుగొన్నారు. ఈ జీవి ఆ నగర రిజర్వాయర్ లో ఈదుతూ కనబడటంతో, వెంటనే దానిని నగర డ్రైనేజ్ పనివారు వల వేసి పట్టుకున్నారు. ఆ జీవి చాలా శక్తిమంతమైనదిగనూ, దూకుడుగా మనుష్యులపై దాడిచేసే ప్రయత్నాలు చేస్తున్నందువలన ఆ జీవిని నిర్బంధంలో ఉంచేరు. అంటే ఒక ఇనుప బోనులో ఉంచేరు.

చైనాలో దొరికిన వింత జీవి
ఈ వింత జంతువును కనుగున్న రిజర్వాయర్ లోని నీరు విష పూరిత మైనవట. అందులోని నీరు ఏటువంటి ఉపయోగానికీ పనికిరాదట. అటువంటి నీటిలో ఆ వింత జంతువు దొరకడమే ఒక ఆశ్చర్యమైన విషయంగా పరిగనిస్తున్నారు. ఈ వింత జంతువు ఆకారం చూసి ఈ జంతువు భూలోకానికి చెందింది కాదు అంటూ అక్కడి ప్రజలు ప్రచారం చేసేరు. జంతు శాస్త్ర నిపుణులు వచ్చి చూసి ఆ వింత జంతువు ఏ జంతు జాతికి చెందిదో చెప్పలేకపోయేరు. ఆ జంతువు ఆ ఇనుప బోనులోని ఇనుప చువ్వలను సైతం కొరికి ముక్కలు చేసి బయటకు పారిపోవడానికి ప్రయత్నించడంతో దానిని వేరే ప్రదేశానికి పరిశోధనా నిమిత్తం తరలించేరట.

2)...రెండేళ్ళ క్రితం తాయ్లాండ్లోని ఒక గ్రామంలో ఒక వింత జంతువు కనబడింది. అక్కడి ప్రజలు ఈ వింత జంతువును చూసేటప్పటికే ఆ వింత జంతువు ప్రాణాలతో లేదు. అంతకు ముందు అలాంటి వింత జంతువును వారు చూడకపోవటం, ఆ వింత జంతువు యొక్క రంగు, ఆకారం అక్కడివారిని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఈ వింత ఆకార జంతువు గురించి అతిపెద్ద చర్చ జరిగింది. చివరికి అందరూ ఒక నిర్ణయానికి వచ్చేరు. ఇది ఒక పౌరాణిక జంతువు. టెక్నాలజీతో పాత విషయాలను మర్చిపోతున్న ప్రజలకు దేముడు తన ఉనికిని గుర్తుచేయాలనే ఈ వింత ప్రాణిని ఇక్కడకు పంపించేడు. ఆ వింత జీవికి నివాళులు అర్పిస్తే, భగవంతుడు తమకి మేలుచేస్తాడని గట్టిగా నమ్మేరు .

తాయ్లాండ్లో దొరికిన వింత జీవి
వెంటనే ఆ గ్రామ ప్రజలందరూ కలిసి ఈ వింత ఆకార జంతువును తీసుకు వచ్చి దానికి ప్రత్యేక మర్యాదలు చేసేరు. అగరవత్తులు వెలిగించి దండాలు పెట్టుకున్నారు. కొవ్వొత్తులు వెలిగించి ప్రార్ధనలు చేసేరు. ఆహారంగా జ్యూసులు తెచ్చేరు. అలంకరణకు బేబీ పౌడర్ తెచ్చేరు. వాసన రాకుండా ఉండటానికి అత్తర్లు జల్లేరు. ఈ విషయం బయట ప్రపంచానికి తెలియాలని ఫోటోలు తీసి ప్రభుత్వానికి పంపించేరు. శాస్త్రవేత్తలు వచ్చి ఈ వింత ఆకార జంతువు ను చూసి, పరిశొధించాలని ఆ వింత జంతువు కుళ్ళిపోకుండా ఉండటానికి, ఈగలు ముసరకుండా ఉండటానికి ఒక ఫ్యాను పెట్టేరు. తాయ్లాండ్లో దొరికిన వింత జీవి

శాస్త్రవేత్తలు వచ్చేరు. ఆ వింత జంతువును పరిశోధించేరు. శాస్త్రవేత్తలు ఆ జంతువును ఏ జంతు జాతికి సంభందంచిందో చెప్పలేకపోయేరు. కానీ అది మాములు జంతువే, దేముడు పంపిన జంతువు కాదని, ఏదో వ్యాధి వలన ఆ జంతువు వింత ఆకారాన్ని పొందిందని తెలిపేరు. కానీ అక్కడి ప్రజలు శాస్త్రవేత్తలు చెప్పింది నమ్మలేదు. ఈ ఆకారంతో ఉన్న ఈ జీవి ఉనికిని కనుగొనేందుకు చాలా ప్రయత్నాలు రహస్యంగా ఇంకా జరుగుతూనే ఉన్నాయని చెబుతున్నారు.

No comments:

Post a Comment