Sunday, August 28, 2016

నిండు చంద్రుడు...అద్భుతమైన ఫోటోలు

చంద్రుడు భూమికి ఉన్న ఏకైక సహజ ఉపగ్రహం. భూమి నుండి చంద్రునికి రమారమి 3,84,403 కిలోమీటర్ల దూరముంటుంది. సూర్యుని కాంతి చంద్రునిపై పడి ప్రతిఫలించి భూమికి చేరుతుంది. ఇంతదూరం నుండి కాంతి ప్రతిఫలించడానికి సుమారు 1.3 క్షణాలు పడుతుంది. చంద్రుని వ్యాసం 3476 కి.మీ. (2159 మైళ్ళు), ఇది భూమి వ్యాసంలో పావువంతు కంటే కొంచెం ఎక్కువ. చంద్రుడు సౌరమండలములో ఐదో అతిపెద్ద ఉపగ్రహం. భూమిపైని సముద్రాలలో అలలు చంద్రుని గురుత్వాకర్షణ శక్తి వల్లే ఏర్పడతాయి.
చంద్ర మండలంపై వాతావరణం లేదు. అందుకే చంద్రునిపై కాలు మోపిన మొదటి మానవుని పాద ముద్రలు ఇప్పటికీ అలానే ఉన్నాయి. చంద్ర గ్రహం యొక్క సాంద్రత భూమి సాంద్రతలో 1/6 వ వంతు ఉంటుంది. అందువల్ల భూమిపై 60 కేజీల బరువు ఉండే మనిషి చంద్రునిపై 10 కేజీలు మాత్రమే ఉంటాడు. 1959 సెప్టెంబర్ 14 రష్యా పంపిన లూనా-2 చంద్రుడి మీదకు మొట్టమొదట దిగింది. చంద్రుడి పై ఇప్పటి దాకా నడిచిన వ్యోమగాములు 12 మంది. ఇప్పటి దాకా 382 కిలోల చంద్ర శిలల్ని భూమి మీదకు తీసుకువచ్చారు వ్యోమగాములు.
ప్రతిరోజు చంద్రుడు భూమికి తూర్పు వైపు నుంచి పడమర వైపుకు పయనిస్తూ ఉంటాడు. సూర్యకాంతితో పోల్చితే చంద్రకాంతి చాలా తక్కువ అందువలన మనకు ఎదురుగా ఉన్నప్పటికి ఎక్కువ సార్లు చంద్రుడు పగలు కనిపించడు. అందువలన చంద్రుడు స్పష్టంగా కనిపించే సూర్యాస్తమయం తరువాత భాగమునే చంద్రోదయముగా ఉపయోగిస్తున్నారు.

1 comment:


 1. నిండగు చంద్రుని‌ఫోటో
  మెండగు వ్యాసము పసందు మేలిమి గద! పూ
  చెండుల వేళన గుండ్రని
  గండర గండడని రమణి గబగబ బిలిచెన్ !

  జిలేబి

  ReplyDelete