Tuesday, August 2, 2016

మిస్టరీ: క్లోనింగ్ నిషేదానికి నిజమైన కారకులెవరు?...ఫోటోలు మరియు వివరాలు

సైన్స్:...తెల్ల కోట్లు వేసుకుని ప్రయూగశాలలలో/పరిశోధనాశాలలలో పనిచేసే వ్యక్తులకంటే పెద్దదైనది. సైన్స్ పరిశోధనలు నెమ్మదిగానే సాగుతాయి మరియు ఖరీదైనవి. సైన్స్ శాస్త్రవేత్తలు ఎప్పుడూ తమ పరిశోధనల నిమిత్తం డబ్బుకోసం ఎవరిమీదైనా ఆధారపడాల్సిందే. ఎక్కువగా ప్రభుత్వాలే సైన్స్ పరిశోధనలకు డబ్బు కేటాయిస్తుంది. ప్రభుత్వాలను నడిపేది రాజకీయ నాయకులే. వారికి ఏదనిపిస్తే దానిని పాటిస్తారు. సైన్స్ రంగంలో ఎన్నో పురోగమనాలను అడ్డుకున్నది రాజకీయ పరిస్థితులే. అలా అడ్డుకున్న వాటిలో క్లోనింగ్ ఒకటి. సైన్స్ నిపుణులు క్లొనింగ్......వైద్య రంగానికి చాలా ఉపయోగపడుతుందని, దీని వలన ఎన్నో వ్యాధులకు చికిత్స అందించవచ్చని చెబుతున్నా ప్రభుత్వాలు క్లోనింగ్ ను నిషేదించేరు....దీనికి కారకులెవ్వరు? అదే మిస్టరీ.

క్లొనింగ్ అనేది ప్రధానంగా సైన్స్ కల్పిత కధ. కానీ అవయవాల పునరావృత్తం కోసం సైన్స్ శాస్త్రవేత్తలు ఎన్నో ఏళ్ల నుండి పరిశోధనలు జరుపుతూనే ఉన్నారు. మానవ అవయవాల పునరావృత్తం క్లోనింగ్ అనే ప్రక్రియతో సాధ్యమవుతుందని, ఆ ప్రక్రియ విధానంలో పరిశోధనలు మొదలుపెట్టేరు. అవయవాల పునరావృత్తంలో క్లోనింగ్ పద్దతి సంభావ్యంగా ఉంటుందని వైద్య చికిత్స రంగానికి చెందిన శాస్త్రవేత్తలు ఉత్తేజ పడుతుంటే, క్లోనింగ్ పద్దతి ఆలొచన రాజకీయ నాయకులలో భయం పుట్టించింది . ఆ భయం వివాదాలకూ మరియు చర్చలకు దారితీసింది. ఫలితం: క్లోనింగ్ ప్రక్రియ పూర్తిగా నిషేదించబడింది.

రాజకీయ నాయకులలో క్లొనింగ్ గురించిన భయం ఎందుకు ఏర్పడింది? ఎవరు ఏర్పరిచేరు? వైద్యరంగ శాస్త్రవేత్తలు క్లోనింగ్ గురించి భయపడనవసరంలేదని చెబుతున్నా రాజకీయ నాయకులు ఎందుకు వినడంలేదు?

1970లో డేవిడ్ రార్ విక్ అనే అతను తాను రాసిన "ఇన్ హిస్ ఇమేజ్" పుస్తకంలో ఒక రహస్య శాస్త్రవేత్తల బృందం ఒక సంపన్న వ్యాపారవేత్తను విజయవంతముగా క్లోనింగ్ చేసేరని రాసేడు. ఆ పుస్తకంలో రాసిందంతా మోసపూరిత, నకిలీ సమాచారం అని రుజువైనా, “క్లోనింగ్ యొక్క నిజమైన ఉద్దేశం ఏమిటి?” అనేదాని మీద పత్రికలలో చర్చకు కారణమయ్యింది ఆ పుస్తకం.
డేవిడ్ రార్ విక్ ఎవరు? అతను రాసినదేమిటి? అది మోసపూరిత సమాచారం అని ఎలా తెలుసుకున్నారు?
డేవిడ్ రార్ విక్ సాధారణ రచయత కాదు. ఇతను పేరు ప్రక్యాతలు కలిగిన పత్రికలకు క్రమం తప్పక వ్యాసాలు రాసే రచయిత. టైమ్స్ మరియు న్యూయార్క్ టైమ్స్ పత్రికలకు వైద్య విలేఖరిగా పనిచేస్తూ ఆ పత్రికలలో వైద్య రంగ విషయాల గురించి వ్యాసాలు రాసే రచయిత. అందుకని అతను రాసిన మానవ క్లొనింగ్ సమాచారం విశ్వసనీయమైనదని భావించేరు.

ఇతను రాసిన "ఇన్ హిస్ ఇమేజ్" పుస్తకాన్ని J.B. Lippincott Company వారు ప్రచురించేరు. 1973 లో అమెరికాలోని ఐశ్వర్యవంతుడైన ఒక వ్యాపారవేత్త తనను కలిసి తనలాంటి ఒక మనిషిని క్లోన్ చేయమని అడిగేడు. ఆ వ్యాపారవేత్త యొక్క నిజమైన పేరును కప్పి పుచ్చడానికి అతని పేరు "మాక్స్" అని రాస్తున్నట్లు తెలిపేడు. ఆ వ్యాపారవేత్త సవాలును స్వీకరిస్తూ తన పలుకుబడినంతా ఉపయోగించి ఒక శాస్త్రవేత్తల బృందం అమర్చుకుని పరిశోధనల నిమిత్తం హవాయి ద్వీపాల సమూహానికి మరికొంత దూరంలో ఉన్న ఒక రహస్య ద్వీపములో పరిశొధనాశాల ఏర్పరిచేడట. 5 సంవత్సరాల క్రుషి తరువాత విజయం సాధించి మాక్స్ డి.ఎన్.ఏ తో ఒక గుడ్డు తయారుచేసి, ఆ గుడ్డును ఆ ద్వీపములో నివసిస్తున్న "స్పారో"(పేరు మార్చి) అనే మహిళ (సర్రోగేట్ తల్లి)గర్భాశయంలో పొందు పరిచేరు. తొమ్మిది నెలల తరువాత మొదటి క్లోనింగ్ బిడ్డ పుట్టిందని రాసేడు.

డేవిడ్ రార్ విక్ రాసిన పుస్తకం ప్రచురణకు రాకముందే అమెరికా జాతీయ దృష్టిని ఆకర్షించింది. కారణం, న్యూయార్క్ పోస్ట్ వార్తా పత్రిక మార్చ్-3, 1978 న తమ మొదటి పేజీలో “క్లోన్ చేయబడ్డ మొదటి మానవ బిడ్డ పుట్టిందని” ముఖ్యాంశాలులొ ప్రచురించేరు. అంతే. ఆ మరుసటిరోజు అన్ని వార్తా పత్రికలూ మరియూ న్యూస్ చానెల్లు ఈ వార్తను ప్రకటించినై. కానీ సైన్స్ శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేసేరు. వారందరూ డేవిడ్ రార్ విక్ చెబుతున్నది నిజం కాదని వాదించారు. ఎందుకంటే క్లోనింగ్ టెక్నాలజీ మానవ క్లోనింగుకు ఎంతమాత్రం దగ్గరగా రాలేదని గట్టిగా చెప్పేరు. అతని పుస్తకం విడుదలైన తరువాత, అతను పుస్తకంలో రాసిన మానవ క్లోనింగ్ టెక్నాలజీ పద్దతి చదివిన తరువాత వారి అనుమానం రెండింతలయ్యింది. అతను పుస్తకంలో వివరించిన మానవ క్లోనింగ్ టెక్నాలజీ వివరాలు 1960 లో సైన్స్ శాస్త్రవేత్తలు ఒక కప్పను క్లొనింగ్ చేయడానికి ఉపయోగించిన క్లోనింగ్ పద్దతి. ఈ పద్దతి క్షీరద జంతువులకు మాత్రమే వర్తిస్తుంది. ఎందుకంటే క్షీరద మరియు ఉభయచర జీవశాస్త్రంలో చాలా తేడా ఉన్నందువలన.

క్లోనింగ్ చేయబడ్డ గొర్రె...డాలీ
డేవిడ్ రార్ విక్ రాసిన పుస్తకం బాగా అమ్ముడవటమే కాకుండా జాతీయ స్థాయిలో క్లోనింగ్ నీతి గురించిన చర్చను ప్రేరేపించింది.

ఈలోపు బ్రిటీష్ శాస్త్రవేత్త J. Derek Bromhall, డేవిడ్ రార్ విక్ మీద మరియు J.B. Lippincott Company మీద కోర్టులో దావా వేసేరు. తన పరిశోధనా ఫార్ములాను తన అనుమతిలేకుండా డేవిడ్ రార్ విక్ తన పుస్తకంలో ప్రచురించేరని మరియు ఆ ఫార్ములాతో మానవ క్లోనింగ్ జరుపలేరని, తప్పుడు సమాచారంతో ప్రజలను మోసం చేస్తూ శాస్త్రవేత్తలను కించ పరిచేడని దావాలో పేర్కొన్నారు. కోర్టు డేవిడ్ రార్ విక్ ను తాను క్లోనింగ్ మూలం పుట్టించిన అబ్బాయిని చూపించమని ఆజ్ఞ జారీ చేసింది. క్లోనింగ్ చేయబడ్డ బిడ్డను చూపించలేకపోయేసరికి డేవిడ్ రార్ విక్ ను మోసగాడుగా ప్రకటిస్తూ అతను రాసిన పుస్తకాన్ని నిషేదించింది. 1982 లో J.B. Lippincott Company బ్రిటీష్ శాస్త్రవేత్తకు అపరాధం చెల్లించింది.

మనిషిని క్లోనింగ్ చేసేమని డేవిడ్ రార్ విక్ ప్రకటించటానికి ప్రేరణ చేసింది ఎవరు? అతను చెప్పిన వెంటనే అతని సమాచారాన్ని సమర్ధించి పేపర్లలో రాయమన్నది ఎవరు? డేవిడ్ రార్ విక్ డబ్బుకు ఆశపడి ఈ పని చేసేడా?....ఈ పుస్తకం అమ్మకాలతో సంపాదించిన డబ్బంతా కోర్టు కేసుకోసరం ఖర్చుపెట్టేడు. మరి పేరు ప్రక్యాతల కోసమా? .... కానీ కోర్టు అతన్ని మోసగాడు అని ముద్రవేసిందే.
క్లోనింగ్ విషయములో 1980లో జీవసాంకేతిక విజ్ఞానం పురోగతి సాధించింది. 1997 లో నిజంగానే క్లోనింగ్ ప్రక్రియతో క్షీరద జంతువు డాలీ అని పేరుపెట్టబడ్డ గొర్రె పుట్టింది. దీనితో వైద్య రంగ శాస్త్రవేత్తలలో మళ్ళీ ఉత్తేజం పెరిగింది. వైద్య రంగంలో అవయవ మార్పిడులకు మరియు వ్యాధుల గురించి బాగా తెలుసుకోవటనికి క్లొనింగ్ ప్రక్రియ ఉపయోగపడుతుందని సంతోషించేరు. కానీ మరికొందరు ఈ క్లోనింగ్ ప్రక్రియనే అనుమానించేరు. ఒక వేల శాస్త్రవేత్తలు క్లోనింగ్ పద్దతి ఉపయోగించి మానవులను క్లోన్ చేస్తే? ఒకరి ఆమొదం లేకుండానే/వారికి తెలియకుండానే వారిని క్లోన్ చేస్తే? ఎవరు క్లోనింగుకు ఉపయోగపడతారు....బాగా ఆరొగ్యంగా ఉండేవారు, ఆకర్షణీయమైనవారు మరియు తెలివితేటలు గల వారికి మాత్రమే క్లొనింగ్ రిజర్వ్ చేయబడుతుందా?...ఇలా ఎన్నో అనుమానాలు చర్చలుగా మారినై.

దీనితో క్లోనింగ్ ను పలు దేశాలు నిషేదించినై. యూనైటడ్ నేషన్స్ కూడా క్లోనింగ్ నిషేధనకు సమ్మతి తెలిపింది. క్లోనింగ్ నిషేదనకు ఎవరు పాటుపడ్డరో ఒక మిస్టరీగా ఉండిపోయింది.

No comments:

Post a Comment