Monday, August 1, 2016

ఇసుక సముద్రంలోని సూక్ష్మ సరస్సులు....ఫోటోలు

లిబియా దేశములో విస్తారమైన, గంభీరమైన ఇసుకమేటలు ఉన్న ప్రదేశమును "ఉబరి ఇసుక సముద్రం" అని పిలుస్తారు. 2 లక్షల సంవత్సరాలకు ముందు ఈ ప్రదేశము సారవంతమైన భూమిగా, తడినేలతో ఉండేది. అతిపెద్ద నదులు, పుష్కలమైన వర్షపాతముతో ఈ ప్రదేశమంతా కళకళలాడుతూ ఉండేది. ఈ ప్రదేశములోని నదులు, సరస్సులు కలిపి ఒక లక్షా 20 వేల చదరపు కిలోమీటర్ల పరిమాణం కలిగి ఉండేవి.

వాతావరణ మార్పు వలన నదులు, సరస్సులు ఎండిపోయి సహారా ఎడారిలో భాగంగా కలిసిపోయింది ఈ ప్రదేశం. కానీ అతిపెద్ద నదులు, సరస్సులకు గుర్తుగా సూక్ష్మ సరస్సులు అక్కడక్కడ ఇప్పటికీ ఉనికిలో ఉన్నాయి. "ఉబరి ఇసుక సముద్రం" ఎడారిలో అక్కడక్కడ సుమారు 20 సూక్ష్మ సరస్సులు ఉన్నాయి. ఈ సరస్సుల చుట్టూ తాటి చెట్లు ఎడారి నియమవిరుద్ధాలుగా కనబడతాయి.

కఠినమైన ఎడారి వాతావరణానికి ఈ తాటిచెట్లు,సూక్ష్మ సరస్సులు అందాన్ని తీసుకు వచ్చేయి.

No comments:

Post a Comment