Thursday, August 4, 2016

మిస్టరీ: భూమి కక్ష్యలో 80 సంవత్సరాలుగా తిరుగుతున్న"బ్లాక్ నైట్" ఉపగ్రహం ఎవరిది?...ఫోటోలు మరియు వివరాలు

నలుపు రంగుతో ఉండే ఒక ఉపగ్రహం భూమి కక్ష్యలో తిరుగుతున్నట్లు 80 సంవత్సరాలకు ముందే కనిపెట్టేరు. ఈ ఉపగ్రహాన్ని మొదటగా కనిపెట్టినప్పుడు దీనికి "బ్లాక్ నైట్" అని పేరు పెట్టేరు. కానీ ఇలాంటి ఒక ఉపగ్రహం భూమి కక్ష్యలో తిరుగుతున్నదని ఏ ప్రభుత్వమూ తెలుపలేదు. ఎందుకు ఈ ఉపగ్రహం గురించిన సమాచారాన్ని రహస్యంగా ఉంచుతున్నారు?....అదే ఇక్కడ మిస్టరీ.
1930 లో ప్రపంచవ్యాప్తంగా ఖగోళవేత్తలు గుర్తు తెలియని ఒక ఉపగ్రహం నుండి విచిత్రమైన రేడియో సిగ్నల్స్ వస్తున్నాయని తెలియజేసేరు. 1940లో అమెరికాలోని ప్రముఖ వార్తా పత్రిక "St. Louis Dispatch" ఈ ఉపగ్రహం గురించి రాసింది. 1954 లో అమెరికాలొని మరో ప్రముఖ పత్రిక "Satellite" ఈ ఉపగ్రహం గురించి ప్రత్యేక వ్యాసం రాసింది. 1960 లో టైమ్ మాగజైన్ తమ పత్రికలో దీని గురించి ప్రచురించింది. ఆ తరువాత ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రముఖ పత్రికలు ఈ వార్తను ప్రచురించినై. దీనితో ఈ ఉపగ్రహం గురించి ప్రపంచ ప్రజలకు తెలిసింది. అందరూ ఆందోళన చెందేరు.

అమెరికా, రష్యా మరియు యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ లు దశాబ్దాలుగా ఈ ఉపగ్రహమును చూసేమని తమ నివేదికలలొ తెలిపేరు. కానీ ఈ ఉపగ్రహం ఎవరిది, ఎక్కడి నుండి వచ్చింది తెలియటంలేదని తెలిపేరు.

విచిత్రమైన, అర్ధంకానటువంటి సంకేతాలు ఈ ఉపగ్రహం నుండి వస్తున్నాయని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉపగ్రహ పర్యవేక్షణ కేంద్రాలు తెలియజేసేయి. ఈ సంవత్సరం అంతరిక్ష చెత్తను పర్యవేక్షించే బాధ్యతను చేపట్టిన ఆస్ట్రేలియాలోని Muchea satellite company దీన్ని ధ్రువీకరించింది.
ఈ ఉపగ్రహం గురించిన ఆవిష్కరణ బహుశ ఆధునిక మిస్టరీలలోనే అతిపెద్ద,రహస్యంగా ఉంచబడిన మిస్టరీ ......ఎందుకు?

1950 నుండి ఈ "కృత్రిమ ఉపగ్రహం" మీడియా రంగంలో ఆసక్తి కలిగించే ప్రధాన విషయమయ్యింది. అంతరిక్షంలోని వస్తువులలో ఎక్కువగా చర్చించబడింది. మొదట్లో దీనిని రష్యా గూఢచార ఉపగ్రహంగా అనుకున్నారు. అమెరికా గూఢచార సంస్థల నిఘాలో ఈ ఉపగ్రహం చిక్కుకుంది. కానీ రష్యా ఉపగ్రహాలు (భూమి సహజంగా పడమర నుండి తూర్పు వైపు తిరుగుతున్నట్లే, అవిగూడా) పడమర నుండి తూర్పు వైపు తిరుగుతున్నాయి. కానీ ఈ బ్లాక్ నైట్ ఉపగ్రహం తూర్పు నుండి పడమరగా తిరుగుతోంది. తూర్పు నుండి పడమరగా తిరిగే ఉపగ్రహాలను అప్పటివరకు ఏ దేశమూ పంపలేదు. అందువలన “బ్లాక్ నైట్” ఉపగ్రహం భూమిపై ఉండే ఏ దేశానికీ చెందింది కాదనే నిర్ణయానికి వచ్చేరు.
తూర్పు నుండి పడమరకు తిరిగే ఉపగ్రహాన్ని 1960లో అమెరికా దేశమే మొదట పంపింది. దీనిని "పోలార్ ఆర్బిటింగ్ సెటిలైట్" అంటారు. ఇవి భూమి -మ్యాపింగ్, భూమి పరిశీలన, భూమి తిరిగే సమయం నిర్ధారణ, ఇతర ఉపగ్రహాలను పర్యవేక్షణ చేయటం కోసం ఉపయోగిస్తారు. "బ్లాక్ నైట్" ఉపగ్రహం ఈ కోవకు చెందినదే. ఎందుకంటే అది గూడా తూర్పు నుండి పడమరకు తిరుగుతోంది. ఇక్కడ ప్రశ్న ఏమిటంటే మనకంటే ముందు ఎవరు పోలార్ ఆర్బిట్లో ఆ ఉపగ్రహాన్ని ఉంచింది, ఎందుకోసం ఉంచేరు? 1957 లో వెనుజూలా దేశ కమ్యూనికేషన్ మినిస్టరీ విభాగంలో పనిచేస్తున్న Dr. Luis Corralos రష్యాకు చెందిన స్పుట్నిక్-1, స్పుట్నిక్-2 ఉపగ్రహలాను చిత్రీకరిస్తున్నప్పుడు "బ్లాక్ నైట్" ఉపగ్రహాన్ని కూడా చిత్రీకరించేరు. అయితే ఈ బ్లాక్ నైట్ ఉపగ్రహం పోలార్ ఆర్బిట్లో ఉన్నది. 1957లో అమెరికా దేశానికి గానీ, రష్యా దేశానికి గానీ ఉపగ్రహాలను పోలార్ ఆర్బిట్లో ఉంచగలిగే టెక్నాలజీ లేదు. అందువలన Dr. Luis Corralos గుర్తు తెలియని ఒక ఉపగ్రహం స్పుట్నిక్-1 నీడలొ కనబడిందని వెనుజూలా కమ్యూనికేషన్ మినిస్టరీకి సమాచారం అందించేరు.
అమెరికా దేశానికి యుద్ద విమానాలనూ, పౌర విమానాలను తాయరుచేసే Grumman Aircraft Corporation ఈ గుర్తు తెలియని ఉపగ్రహం గురించి మరికొంత తెలుసుకోవలనే ఆశతో వారి దగ్గరున్న ట్రాకింగ్ కెమెరాతో ఆ ఉపగ్రహాన్ని ఫోటో తీసేరు. వెంటనే వారు ఒక నిపుణుల బృందంను ఏర్పాటుచేసి, ఆ ఉపగ్రహం నుండి వెలువడుతున్న అర్ధంకాని సంకేతాలను అడ్డుకొని, వాటిని పరిశోధించేరు. కానీ పరిశోధనా వివరాలను బయటపెట్టలేదు.
1963 లో అమెరికా దేశం అంతరిక్షంలోకి పంపిన మొదటి మనుష్యులు కూడిన అంతరిక్ష నౌక "మెర్క్యూరీ" నాయకుడు Gordon Cooper తన తిరుగు ప్రయాణంలో "నా ముందు నేనొక గుర్తు తెలియని ఉపగ్రహాన్ని చూస్తున్నాను... దూరం నుండి దాని రంగు ఆకుపచ్చ రంగులో ఉన్నది" అని ఆస్ట్రేలియాలో ఉపగ్రహల పర్యవేక్షణ కేంద్రమైన Muchea satellite company కి ఒక సందేశం పంపేడు. వెంటనే తమ రాడార్లో ఆ ఉపగ్రహాన్ని గుర్తించిన ఆ సంస్థ, ఆ ఉపగ్రహం తూర్పు నుండి పడమరకు తిరుగుతున్నదని గ్రహించేరు. Gordon Cooper భూమికి తిరిగి వచ్చిన వెంటనే అతని దగ్గర ఆ ఉపగ్రహం గురించి మరికొన్ని విషయాలు తెలుసుకోవాలని వచ్చిన పత్రికా విలేఖరులను కలవడానికి Gordon Cooper నిరాకరించేరు.
1899 లో శాస్త్రవేత్త నికోలా టెస్లా హై వోల్టేజ్ రేడియో పరికరం Colorado Springs మూలం ఈ ఉపగ్రహం నుండి వచ్చిన సంకేతాన్ని అడ్డుకొన్నారని వదంతులు వచ్చేయి. గత 50 సంవత్సరాల నుండి ఈ ఉపగ్రహం నుండి అర్ధంకాని సంకేతాలు వస్తున్నట్టు ఉపగ్రహ పర్యవేక్షణ కేంద్రాలు తెలుపుతున్నాయి. 1957 లోనే ఈ ఉపగ్రహాన్ని ఫోటో తీసేరు. వ్యోమగామి Gordon Cooper ఈ ఉపగ్రహాన్ని చూసేనని తెలిపేరు.

గుర్తు తెలియని ఒక ఉపగ్రహం భూమిపైనున్న అంతరిక్షంలో తిరుగుతోందని అగ్ర రాజ్య ప్రభుత్వాలకు, శాస్త్రవేత్తలకు, ప్రజలకు తెలుసు. నాసా తమ వెబ్ సైట్లో ఈ ఉపగ్రహం ఫోటోను ఉంచేరు....కానీ ఆ ఉపగ్రహం గురించి ఈ రోజుకీ అగ్ర రాజ్యాలు పూర్తి వివరాలు ఎందుకు బయట పెట్టడంలేదనేదే మిస్టరీగా ఉన్నదని అందరూ భావిస్తున్నారు.

1 comment:


  1. ఒక వేళ యిది భారత దేశానిది అయి ఉండ వచ్చా ?

    జిలేబి

    ReplyDelete