Wednesday, August 31, 2016

ఓజోన్ పొర క్షీణత (స్ట్రాటో ఆవరణ) ప్రాంతంలో కనబడే మేఘాలు....ఫోటోలు

భూగోళపు దక్షిణ ద్రువం(అంటార్కిటిక)లో శీతాకలం కనబడే మేఘాలు.ఇదొక స్ట్రాటో ఆవరణ ప్రాంతం.

వాటర్ డ్రాగన్స్(చైనా)....ఫోటోలు


మిస్టరీ: అంతరిక్షం లో బెర్ముడా ట్రయాంగిల్ (స్పేస్ బెర్ముడా ట్రయాంగిల్)....ఫోటోలు మరియు వివరాలు

బెర్ముడా ట్రయాంగిల్ వాయువ్య అట్లాంటిక్ మహాసముద్రం లోని ఒక ప్రాంతం. చాలా సంవత్సరాల నుంచీ ఈ ప్రదేశం మీదుగా ఎగిరే విమానాలు, ఆ భాగంలో ప్రయాణించే నౌకలు అనుమానాస్పద రీతిలో అదృశ్యం అవుతుండడం వలన ఇది ఒక ప్రమాదకరమైన ప్రదేశంగా పరిగణించబడింది. బెర్ముడా ట్రయాంగిల్ – ఈ ప్రదేశం ఎక్కడుందో తెలీక పోయినా దానికి సంబంధించిన వింతలు, విశేషాలు వినని వారుండరు.

ఇలాంటి ఒక ప్రమాదకరమైన చోటు (ప్రాంతం) అంతరిక్షంలో కూడా ఉండొచ్చని మీరెప్పుడైన అనుకున్నారా? అనుకోనుండరు. బహుశ ఇప్పుడు మీలో దాని గురించి తెలుసుకోవలనే ఆసక్తి కలిగుంటుంది. మీరు అదృష్టవంతులు. ఎందుకంటే అలాంటి (బెర్ముడా ట్రయాంగిల్) ఒక ప్రాంతం అంతరిక్షంలో ఉన్నది. దాని గురించి తెలుసుకోబోతున్నారు.
అంతరిక్షములోని ఈ ప్రాంతమును దక్షిణ అట్లాంటిక్ క్రమ విరుద్ధత ప్రాంతం (South Atlantic Anomaly)అంటారు. ఇక్కడ అత్యంత శక్తివంత అయస్కాంత అణువులు కలిగిన పొర క్షేత్రం ఉంటుంది.

1958 లో James Van Allen అనే శాస్త్రవేత్త అంతరిక్షంలో శక్తివంత అయస్కాంత అణువులు కలిగిన 2(భూమికి ఇరువైపులా ఒకటోకటి) పొర క్షేత్రాలు ఉన్నట్లు కునుగొన్నారు. ఈ క్షేత్రమును రేడియేషన్ బెల్ట్ అంటారు. ఈ బెల్టుల ఎత్తు 1000 కిలోమీటర్ల నుండి 60,000 కిలోమీటర్ల దాకా ఉంటుంది. అప్పుడప్పుడు ఎత్తు మారుతూ ఉంటుంది. అయస్కాంత శక్తి కలిగిన భూమికి పైన ఇలాంటి బెల్టులు రెండు ఉండటమే శాస్త్రవేత్తలకు ఆశ్చర్యం కలిగించింది. ఆయన కనుగొన్నందువలన ఆ ప్రాంతాలకు వాన్ అలెన్ రేడియెషన్ బెల్టులు అని పేరు పెట్టబడింది.
ఈ విషయం తెలుసుకున్న వెంటనే అమెరికాలోని అంతరిక్ష పరిశోధనా కేంద్రమైన నాసా, ఈ బెల్టుల గురించి మరింత తెలుసుకోవాలని పరిశోధనా కార్యక్రమాలను మొదలు పెట్టింది. ఈ రేడియేషన్ బెల్టులలో నుండి రేడియేషన్ వెలువడుతోందని, అది ఉపగ్రహాలకు హాని కలిగించవచ్చని తెలుసు కున్నారు. అందువలన ఉపగ్రహాలను ఆ బెల్టుల దగ్గరకు వెళ్ళకుండా చూసుకుంటూ వచ్చేరు. అయితే ఈ ప్రాంతంలో ఏమి జరుగుతుందనే విషయంలో ఎవరూ ఒక నిర్ణయానికి రాలేకపోయేరు.

రేడియేషన్ బెల్టులకు లోపల మరింత ఎక్కువ అయస్కాంత శక్తి కలిగిన అణువుల పొర క్షేత్రం ఉన్నట్లు కునుగొన్నారు. దానికి “దక్షిణ అట్లాంటిక్ క్రమ విరుద్ధత ప్రాంతం” అని పేరు పెట్టేరు. అయితే దాని గురించి ఎక్కువగా తెలుసుకోలేకపోయేరు. ఎందుకంటే దాని గురించి తెలుసుకోవాలంటే పొరలోపలకు వెళ్ళి పరిశోధనలు జరపాలి. అది కుదిరే పని కాదు. ఉపగ్రహాలు రేడియేషన్ బెల్టులకు దగ్గరగా కూడా వెళ్ళవు కాబట్టి పరిశోధనలను అంతవరకే నియంత్రించుకున్నారు.....కానీ బెల్టులకు లోపల ఉన్న అత్యంత శక్తి కలిగిన పొర అప్పుడప్పుడు బయటకు వస్తున్నట్లు తెలుసుకోలేకపోయేరు.
బ్రెజిల్ దేశ సముద్ర తీరానికి కొద్ది దూరంలో భూమికి పైన 200 కిలోమీటర్ల ఎత్తులో ఉన్నది ఈ దక్షిణ అట్లాంటిక్ క్రమ విరుద్ధత ప్రాంతం (స్పేస్ బెర్ముడా ట్రయాంగిల్). అంటే భూమి తిరుగుతున్నప్పుడు రేడియేషన్ బెల్టులలో దాగి ఉన్న దక్షిణ అట్లాంటిక్ క్రమ విరుద్ధత ప్రాంతం ఈ చోట భూమి ఉపరితలానికి దగ్గరగా వస్తోంది. మానవుడు ఎదుర్కొన్న అత్యంత ప్రమాదకరమైన ప్రాంతం ఇదే. శాస్త్రవేత్తల పరిశోధనలో భూమి ఉపరితలంపై బలహీనమైన అయస్కాంత శక్తి కలిగిన ప్రదేశాలపైన స్పేస్ బెర్ముడా ట్రయాంగిల్ ఉంటోంది.

కమ్యూనికేషన్ ఉపగ్రహాలు భూమిపైన కొన్ని వందల కిలోమీటర్ల ఎత్తులో మాత్రమే ఉంచబడతాయి. 1991-1994 మధ్యలో కమ్యూనికేషన్స్ కోసం గ్లోబల్ స్టార్ ఉపగ్రహాలు పంపబడ్డాయి.ఇవన్నీ వైఫల్యాలు చెందేయి. గ్లోబల్ స్టార్ ఉపగ్రహాలు వైఫల్యం కావడానికి దక్షిణ అట్లాంటిక్ క్రమ విరుద్ధత ప్రాంతమే కారణమని అప్పుడు తెలుసుకున్నారు.
అంతరిక్ష నౌకలలో ప్రయాణం చేస్తున్న వ్యోమగాములు, తమ నౌకలలోని కమ్యూనికేషన్ పరికరాలు దక్షిణ అట్లాంటిక్ క్రమ విరుద్ధత ప్రాంతమును దాటు తున్నప్పుడు పనిచేయడంలేదని తెలిపేరు. దక్షిణ అట్లాంటిక్ క్రమ విరుద్ధత ప్రాంతము లోపలి నుండి వింతగా మెరిసే లైట్లు బయటకు వస్తున్నాయని వ్యోమగాములు తెలుపడంతో నాసా, మరియు ఇతర దేశాల అంతరిక్ష కేంద్రాలు ఉపగ్రహాలను తయారుచేస్తున్నప్పుడు మరింత బలమైన లోహ కవచాలను వాడటం మొదలుపెట్టేరు.

2009 లో బ్రెజిల్ దేశం నుండి ఫ్రాన్స్ దేశంలోని ప్యారీస్ నగరానికి బయలు దేరిన ఫ్రాన్స్ దేశ విమానం 447 మాయమవటానికి/పడిపోవటానికి (విమానంలోని యంత్రాలన్నీ ఒకే సమయంలో పనిచేయకపోవడంతో) స్పేస్ బెర్ముడా ట్రయాంగిల్ కారణమై ఉంటుందని భావిస్తున్నారు.

హబుల్ అంతరిక్ష నౌకలో కమ్యూనికేషన్ పరికారాలకు ఆటొమేటిక్ షట్ డౌన్ (మూసుకునే) పద్దతి ఏర్పరిచేరు. అంతర్జాతీయ అంతరిక్ష పరిశొధనా కేంద్రం (International Space Station) కు అదనపు కవచాలు అమర్చేరు. దక్షిణ అట్లాంటిక్ క్రమ విరుద్ధత ప్రాంతమునకు దగ్గరగా వచ్చినప్పుడు అంతరిక్ష నడక నివారిస్తారు. అంతర్జాతీయ అంతరిక్ష పరిశొధనా కేంద్రం (International Space Station) రోజుకు 5 సార్లు స్పేస్ బెర్ముడా ట్రయాంగిల్ ప్రాంతాన్ని తిరిగి వెడుతుంది.
స్పేస్ బెర్ముడా ట్రయాంగిల్ పై చేస్తున్న పరిశోధనలలో ఈ మధ్య తెలిసిన మిస్టరీ విషయమేమిటంటే ఈ స్పేస్ బెర్ముడా ట్రయాంగిల్ పశ్చిమ దిశగా జరుగుతున్నట్లు తెలుసుకున్నారు.

ఎందుకు అలా జరుగుతోందో, లోపలి నుండి వింతగా మెరిసే లైట్లు ఎందుకు బయటకు వస్తున్నాయో పూర్తిగా అర్ధం చేసుకోలేకపోతున్నారు. ఈ దక్షిణ అట్లాంటిక్ క్రమ విరుద్ధత ప్రాంతం (స్పేస్ బెర్ముడా ట్రయాంగిల్) లో నుండి శక్తివంతమైన రేడియేషన్ వెలువడుతోందని మాత్రమే తెలుసుకున్న శాస్త్రవేత్తలు, అలా ఎందుకు జరుగుతోందో, అసలు రేడియేషన్ బెల్టులు ఎందుకు ఉన్నాయో తెలుసుకోలేకపోవడంతో ఈ స్పేస్ బెర్ముడా ట్రయాంగిల్ ఒక మిస్టరీగా మిగిలిపోయింది.
ఉపగ్రహాలను స్పేస్ బెర్ముడా ట్రయాంగిల్ దగ్గరగా వెళ్ళకుండా చూసుకోవటం మాత్రమే చేస్తున్నారు. దగ్గరగా వెడితే ఉపగ్రహాలు రేడియేషన్ తాకిడికి కరిగిపోయి మాయమైపోతాయని హెచ్చరించేరు.

Tuesday, August 30, 2016

ప్రపంచవ్యాప్తంగా వృద్ధాప్య పెన్షన్లు....ఫోటోలు

సామాజిక, ఆర్థిక సమస్యలకు తోడు వృద్ధాప్యం, వైకల్యం, వైధవ్యంతో దీనస్థితిలో బతుకీడుస్తున్న అభాగ్యులకు కొద్దిపాటి ఊరట కలిగించే సాధనం వృద్ధాప్య పెన్షన్లు.

స్థూల ఆర్థిక శాస్త్రములో జాతీయ ఆదాయము ఒక ముఖ్యమైన భాగము. ఇది ఒక వ్యక్తి లేదా సంస్థను కాకుండా ఒక దేశం మొత్తానికి అన్వయించే విశ్లేషణ. స్థూల ఆర్థిక విశ్లేషణకు బాటలు వేసిన జాన్ మేనార్డ్ కీన్స్ ఆర్థికవేత్త వలన 1936 నుంచి ఈ భావన ప్రాముఖ్యంలోకి వచ్చింది. 1930 దశాబ్దంలో వచ్చిన మహా ఆర్థికమాంద్యం వల్ల దాదాపు ప్రపంచంలోని అన్ని దేశాల ఆర్థిక వ్యవస్థలు ఛిన్నాభిన్నమయ్యాయి. అప్పటి వరకు ఆర్థిక వేత్తల దృష్టి ఒక్క సారిగా సూక్ష్మ అర్థశాస్త్రం నుంచి స్థూల ఆర్థిక విధానాల వైపు మళ్లింది. దేశాలు అభివృద్ధి చెందుటకు, దేశాల మధ్య వ్యాపారం కొనసాగుటకే కాకుండా ప్రజల శ్రేయస్సు దృష్ట్యా చూసిననూ తలసరి ఆదాయం పెంపొందించుట మొదలగు విషయాలు జాతీయ ఆదాయం (National Income) పై ఆధారపడి ఉన్నాయి.

పెన్షన్లు ఇవ్వటం జాతీయ ఆదాయం పై ఆధారపడి ఉన్నా కొన్ని దేశాలు ఔదార్యముతో వృద్ధాప్య పెన్షన్లు ఇస్తున్నారు. ఏ ఏ దేశాలు ఎంత ఇస్తున్నారో ఈ టపా మూలం తెలుసుకోండి....పెన్షన్ల డబ్బు డాలర్లలో ఇవ్వబడింది...అయినా తేడాలు తెలుసుకోవచ్చు.

సహస్ర లింగ ప్రదేశాన్ని సందర్శించండి....ఫోటోలు

కర్నాటక రాష్ట్రంలో ఉత్తరకన్నడ జిల్లాలో గల సిరిసి ప్రాంతానికి 17కిలోమీటర్ల దూరంలో, పశ్చిమఘాట్ లో, అడవి మధ్యలో సహస్రలింగ అనే ప్రాంతం ఉన్నది.

అక్కడ శల్మలా అనే నదిలో రాళ్లలో శిలలలో చెక్కబడిన వందలాది శివలింగాలను మనం తిలకించవచ్చు.

అయితే, అవి ఎవరు చెక్కినవి అనేది ఇప్పటివరకూ ఎవరికీ తెలియదు, అయితే, కొందరు మాత్రం ఈ లింగాలు 1678 - 1718 నాటి సిరిసి రాజు సదాశివరాయుడు నిర్మింపచేశాడు అని చెపుతుంటారు.

శివలింగాల ఎదురుగా బసవన్న విగ్రహాలు కూడా చెక్కి వుండడం విశేషం. ఇందులో కొన్ని విగ్రహాలు విరిగిపొయి ఉన్నాయి, కొన్ని కనిపించటంలేదు.

శివరాత్రి పర్వదినాన ఇక్కడికి వేలాది మంది భక్తులు తరలివచ్చి, పూజలు చేసుకుంటారు. ఆ సమయంలో ఇక్కడ ప్రవాహం తక్కువగా ఉండడం విశేషం. అందువలన ఎక్కువ శివలింగాలను దర్శించుకునే అవకాశం కలుగుతుంది. ఈ శివలింగాలు, ఆ నదీ ప్రవాహంతో నిత్యం అభిషేకించబడుతూ ఉంటాయి.

ఒబామా దంపతుల ప్రేమ కధ....ఫోటోలు

బరాక్ ఒబామా, ఆయన సతీమణి మిచెల్లీ మొదటిసారిగా 1989లో కలుసుకున్నారు. 27 సంవత్సరాల తరువాత వారి ప్రేమ కధను సినిమాగా తీయబోతున్నారు. ప్రపంచ ప్రఖ్యాత దంపతులైన వీరిరువరి మర్యాద నిమిత్తం ఈ పోస్ట్ అందిస్తున్నాను.

Barack Obama and Fiancée, Michelle, in Kenya, 1992
Barack Obama and Michelle Obama in a family snapshot from their wedding day, Oct. 18, 1992
Barack and Michelle Obama, May 26, 1996
Barack and Michelle Obama, with daughters Malia and Sasha, waiting for the results of his senate bid on election night, 2004
Barack and Michelle Obama on stage at the Democratic National Convention, 2004
Barack Obama and Michelle Obama get ready to give the keynote address at the Chicago Economic Club at their home in Chicago on Dec. 8, 2004
Barack Obama, holding his daughter Malia, 6, and his wife Michelle, holding their daughter Sasha, 3, are covered in confetti after Obama delivered his acceptance speech in Chicago, Nov. 2, 2004
Barack Obama and his wife Michelle Obama bump fists at an election night rally at the Xcel Energy Center June 3, 2008
Michelle and Barack Obama ride on his campaign bus in New Hampshire after a late night of campaigning in 2008
Barack Obama and Michelle Obama share a private moment in a freight elevator at an Inaugural Ball in Washington, D.C., Jan. 20, 2009
President Obama and First Lady Michelle Obama ride in a golf cart at an Inaugural Ball in Washington, D.C, Jan. 20, 2009
Barack Obama and Michelle Obama’s hands rest on the railing of a boat during their tour of St. Andrews Bay in Panama City Beach, Fla., Aug. 15, 2010