Friday, July 8, 2016

సన్నని గాలి నుండి మంచి నీరు....ఫోటోలు

కొన్ని సంవత్సరాల ముందు మన గ్రామాలూ/పట్టణాలు ఎలా ఉండేవి!! స్వర్గంలా ఉండేవి కాదూ… పచ్చగా కళ కళలాడే పంటలు, ఎక్కడ త్రవ్వితే అక్కడ నీళ్ళు, ఊరి చుట్టు పక్కల పెద్ద పెద్ద చెరువులు. రెండు మూడు నెలలు వర్షాలు. అధ్భుతమైన చల్లటి వాతావరణం. కొన్ని ప్రదేశాలలో నీళ్ళు కొనుక్కుంటారంటా! అని ఆశ్చర్యంగా చెప్పుకునే ప్రజలు.

ఇప్పుడో

వేలకు వేలు అప్పు తెచ్చి వందల/వేల అడుగులు త్రవ్వినా బయటపడని నీటి చుక్క...కిలోమీటర్లు నడిచి..జనాలతో పోట్లాడితే..అతి కష్టం మీద దొరికే బిందె నీళ్ళు...కంటి మీద కునుకు లేకుండా అర్థరాత్రి వరకు నీళ్ళ ట్యాంకర్ల కోసం ఎదురుచూసే కళ్ళు, కలుషితమైన ఉప్పు నీటినే వాడుతూ విధిలేక అనారోగ్యాన్ని ఆహ్వానించే అసహాయ ప్రజలు. నీటి ఎద్దడి నివారణకు సరైన ప్రణాళిక ఆలోచించని ప్రుభుత్వాలు......!?

ఇతియోపియాలో సన్నటి గాలి నుండి మంచి నీరు ఎలా తెచ్చుకుంటున్నారో చూడండి. అతి చిన్న టెక్నాలజీతో వెదురు బుట్టలతో గాలిలోనుండి మంచి నీరు తెచ్చుకుంటున్నారు. ఈ బుట్టల మూలంగా రోజుకు 100 లిటర్ల నీరు తెచ్చుకోవచ్చుట.

No comments:

Post a Comment