Monday, July 18, 2016

అంగారక గ్రహంలో మనుష్యులు?...వివరాలు మరియు ఫోటోలు

మనిషి తెలివైన జీవి అని మనం గర్వంగా చెప్పుకుంటాం. కాని మనిషి కంటే తెలివైన జీవులు అంగారక గ్రహంలో జీవించాయని కొందరు పరిశోధకులు గట్టిగా నమ్ముతున్నారు.
డజన్ల కొద్దీ అంతరిక్ష నౌకలు, ఆర్బిటార్లు, ల్యాండర్లు, మరియు రోవర్లు, కుజునిపై ప్రయోగింపబడ్డాయి. వీటిని సోవియట్ యూనియన్, నాసా, యూరప్ మరియు జపాన్ మున్నగు వారు, కుజుని ఉపరితలం పై వాతావరణ పరిశోధనల కొరకు ప్రయోగించారు.

1975 లో నాసా వారు వైకింగ్ కార్యక్రమం ప్రారంభించి, వీటిలో గల రెండు ఆర్బిటర్లను సంధించారు. ప్రతిదీ ఒక ల్యాండర్ కలిగివున్నది. ఈ కార్యక్రమం మొదటిసారిగా కుజుని రంగుచిత్రాలు భూమిపైకి పంపగలిగినది. అంగారకగ్రహంలో కనిపించే ప్రతి చిత్రం ఎప్పటికప్పుడు చర్చను రేకెత్తిస్తోంది. సరికొత్త ప్రతిపాదనలకు కారణమవుతోంది. 1976లో అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా )కు చెందిన వైకింగ్-1 స్పేస్క్రాఫ్ట్ అంగారకుడి చిత్రాలను భూమి మీదకు పంపింది. ఆ చిత్రాల్లో సైడోనియ అనే ప్రాంతంలో మానవ ముఖ రూపం బయటి పడింది. ఇది సహజ సిద్ధంగా ఏర్పడిన భౌగోళిక ఆకారం అని కొద్దిమంది అంటే అలా ఏర్పడింది కాదని కొందరన్నారు. మరికొందరు మాత్రం చాలా ఏళ్ల క్రితమే అంగారకుడిపై తెలివైన నాగరికత వర్థిల్లిందని దాని తాలూకు ఒకానొక ఆనవాలే ‘మానవ ముఖరూపం’ అని చెప్పారు. కొందరైతే రెండు మూడు అడుగులు ముందుకు వేసి ‘అంగారకుడిపై ప్రాచీన నాగరికత తాలూకు అంశాలను దాచి పెట్టే కుట్రను నాసా చేస్తోంది’ అని ఆరోపించారు. ఆశ్చర్యకరమైన ఒక విషయం ఏమిటంటే, "జాకీ" అనే పేరుగలిగిన మాజీ నాసా మహిళా ఉద్యోగి కోస్ట్ టు కోస్ట్ ఏ.ఏం అనే రేడియోకు నవంబర్ 2014 లో ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో 35 సంవత్సరాలకు మునుపే, అంటే 1979 లోనే అంగారక గ్రహంపై మనుష్యులు నడవడం చూసేనని తెలిపింది. నాసా వారి వైకింగ్ లాండర్ అంగారక గ్రహంపై దిగి ఫోటోలు పంపుతున్నప్పుడు, ఆ ఫోటోలను స్వీకరించు టెలిమెట్రీ శాఖలో పనిచేసేదానిని. అప్పుడు ఒక వీడియోలో దట్టమైన దుస్తులలో వైకింగ్ లాండర్ వైపుకు కొంతమంది మనుష్యులు పరిగెత్తుకురావడం చూసేను. ఆశ్చర్యపోయి, అదే విషయాన్ని పై అధికారులకు చెబుదామని పై అంతస్తుకు వెళ్ళేను. మూసిన తలుపులను ఎంత తట్టినా తెరవలేదు సరికదా, తలుపులకు ఉన్న గాజు అద్దాలను పేపర్లతో అటువైపు నుండి మూసేసేరు. ఎందొకో నాకు తెలియదు అని తెలిపింది. ఈ ఇంటర్వ్యూ గురించి నాసా అధికారులు ఏమీమాట్లాడలేదు.
మార్స్ ఆర్బిటర్ కెమెరా (ఎంఒసి) చిత్రించిన చిత్రాల ద్వారా అంగారకుడిపై మరి కొన్ని ఆకారాలను గుర్తించారు. ఒక చోట సీతాకోక చిలుక ఆకారం కనిపించింది. మరోచోట ఒక కొండ నత్త ఆకారం, దాన్నే మరో వైపు నుంచి చూస్తే కుక్క ఆకారం కనిపించింది. నవ్వుతున్న ముఖంతో కూడిన ఆకారం, ప్రేమగుర్తు కూడా ఎంఒసి చిత్రాల్లో కనిపించాయి. కొన్ని చిత్రాలలోని ఆకారాలు అంగారకుడిపై చెట్లు ఉన్నాయనే వాదనను లేవనెత్తాయి. అయితే శాస్త్రవేత్తలు ఈ వాదనను కొట్టిపారేశారు. ‘‘అంగారకుడిపై ఏర్పడిన ధూళిమేఘాలు వివిధరూపాలు ధరించి చెట్ల రూపాన్ని గుర్తుకు తెస్తున్నాయి తప్ప అక్కడ ఎలాంటి చెట్లు లేవు’” అన్నారు వాళ్లు.2007లో తీసిన ఒక ఫోటోలో ఒక వ్యక్తి మోకాళ్ల మీద కూర్చొని ప్రార్థన చేస్తున్న ఆకారం కనిపించింది. దీని ఆధారంగా ‘అంగారుకుడిపై జీవులు ఉన్నాయనే దానికి ఇదొక నిదర్శం అని వాదించిన వాళ్లు ఉన్నారు.
కొన్ని సంవత్సరాల క్రితం అంగారుకుడిపై మిథేన్ వాయువు ఆనవాళ్లు కనుగొనడంతో అంగారకుడిపై జీవుల గురించి ఆసక్తి మళ్లీ తాజాగా మొదలైంది. అంగారకుడికి సంబంధించిన సమాచారంలో నిష్ణాతుడిగా పేరుగాంచిన ప్రొఫెసర్ కోలిన్ (బ్రిటన్) ‘అంగారకుడిపై జీవుల ఉనికిని నిర్ధారించడానికి మీథేన్ వాయువు బలమైన నిదర్శనం’ అని చెప్పారు. అంగారకుడిపై వాతావరణం లేని కారణంగా పగటి ఊష్ణోగ్రతకు, రాత్రి ఊష్ణోగ్రతకు మధ్య చాలా తేడా ఉంటుంది. ఫలితంగా అక్కడ జీవులు మనుగడకు అవకాశాలు తక్కువ అని కొందరు శాస్త్రవేత్తలు కోలిన్ నమ్మకాన్ని తోసిపుచ్చారు.
‘‘అంగారక గ్రహానికి ప్రత్యేకత ఉంది. అది ఎప్పటికప్పుడు మన భూమిని గుర్తుకు తెస్తుంది. ఏదో ఒక రోజు మనం అక్కడికి వెళ్లే వాళ్లమే” అన్నారు నాసా శాస్త్రవేత్త జిమ్ గార్విన్. మన భూమికి పొరుగు గ్రహమైన అంగారకుడితో ఒకప్పుడు మనకు దగ్గర బంధుత్వం ఉండేది. ఆ తరువాత అది దూరపు బంధుత్వంగా మారింది. ఇప్పుడు మాత్రం అంగారకుడితో మనకు దగ్గరి చుట్టరికం. చుట్టపు చూపుగా రేపో మాపో మనం అక్కడికి వెళ్లొచ్చు. సీతకోక చిలకతో చెలిమి చేయవచ్చు. అక్కడ సుసంపన్నమైన నాగరిత వెలిగి ఉంటే ఆ వెలుగు జాడలు వెదికి చూడవచ్చు. వేచి చూద్దాం!

No comments:

Post a Comment