Thursday, July 7, 2016

వింత:...గుడిని ప్రదక్షిణం చేస్తున్న కుక్క....వివరాలు మరియు వీడియో

కర్నాటకా రాష్ట్రంలోని Puttenahalli అనే ఊరిలో ఉన్న మహాలక్ష్మి ఆలయాన్ని అక్కడున్న ఒక కుక్క రోజూ 6 గంటలు ప్రదక్షిణం చేస్తున్నదట. ఉదయాన్నే(తెల్లవారు జామున) 4 గంటలకు మొదలుపెట్టి ప్రొద్దున 10 గంటల వరకు ప్రదక్షిణం చేస్తున్నదట. ఒక ప్రదక్షిణం చేసిన తరువాత ఈశాన్య దిక్కుకు చూసి మొరుగుతున్నదట. కొన్ని రోజులు సాయంత్రం దాకా తిరుగుతున్నదట.

ఈ కుక్క ఇలా ఎందుకు చేస్తున్నదో అర్ధం కాక అక్కడున్న ప్రజలు తమ బుర్రలను గోక్కుంటున్నారట.

ఈ వింతను చూడటానికి చుట్టుపక్కలున్న గ్రామ ప్రజలు తరలి వస్తున్నందువలన అక్కడ ట్రాఫిక్ జాం ఎక్కువగా ఉన్నదట.

2 comments:

  1. వీడియోలో ఈ కుక్క చేసేది అప్రదక్షిణం లాగ కనపడుతోందండి. మామూలుగా ప్రదక్షిణ ఈ కుక్క చేసేదానికి వ్యతిరేక దిశలో చేస్తారు.

    ReplyDelete
    Replies
    1. DG గారికి

      కుక్క ప్రదక్షిణం చ్యేయటమే ఒక వింత....అప్రదక్షిణం ఎందుకు చేస్తోందో?....మరో వింత!

      మీకొసం

      Delete