Friday, July 22, 2016

కబాలి రజినీకాంత్ కు అంకితమైన వారు....ఫోటోలు

కబాలి సినిమా బాగుందా, లేదా అనే ప్రశ్నను పక్కనపెట్టండి. ఏరోజైతే రజినీకాంత్ కు వీరాభిమానులు ఉన్నారని పెద్ద ప్రొడ్యూసర్లు(చిన్న ప్రొడ్యూసర్లు రజినీకాంత్ ను పెట్టి సినిమా తీయలేరు) తెలుసుకున్నారో ఆ రోజు నుండి రజినీకాంత్ స్టైలును క్యాష్ చేసుకుంటున్నారు. పెద్ద మొత్తం పెట్టి సినిమాను కొనుక్కునే డిస్ట్రిబ్యూటర్లు నష్టానికి గురౌతున్నా, ఎప్పటికప్పుడు కొత్త డిస్ట్రిబ్యూటర్లు ముందుకురావడంతో పెద్ద ప్రొడ్యూసర్లు రజినీకాంత్ ను పెట్టి సినిమాలు తీసి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు....కబాలి సినిమా బాగుండలేదని టాక్ వచ్చినా వారు(పెద్ద ప్రొడ్యూసర్లకు)పెద్దగా ఆందోళన చెందరు. కారణం వారు క్యాష్ చేసుకునేది సినిమాతో కాదు, రజినీకాంత్ వీరాభిమానుల ప్రేమను. అలాంటి కొంతమంది వీరాభిమానులను ఇక్కడ చూడండి.

9 comments:

 1. >కబాలి సినిమా బాగుండలేదని టాక్ వచ్చినా వారు(పెద్ద ప్రొడ్యూసర్లకు)పెద్దగా ఆందోళన చెందరు.

  ఆందోళన దేనికండీ. పెట్టుబడి వేగంగా తిరిగి రాబట్టుకొనటం కోసమే కదా వేలాది స్క్రీన్లమీద ఒక్కసారిగా సినిమాను విడుదల చేయటం‌ జరుగుతున్నది? బాగోలేదు అన్నమాట స్థిరపడే సరికే బోలెడు షోలకు టిక్కట్లు చెల్లిపోయినప్పుడు, వెఱ్ఱిమొఱ్ఱి ఫాలోయింగు వీరులు ఆ సినిమాను ఎలా ఉన్నా చూసెయ్యాలని మరిన్ని షోలను పోషించినప్పుడు డబ్బులు తప్పకుండా తిరిగి వచ్చేస్తాయి. నిజంగా బాగుంటే అప్పుదు బోలెడు లాభాలూ వస్తాయి. మరింకేం‌ కావాలీ?

  ReplyDelete
  Replies
  1. బాగా లేని సినేమ చూడకుడదు అనే రూల్ ఎమైనా ఉందా? నా డబ్బులు నా ఇష్టం బాగాలేకున్నా సినేమా చూస్తాను. ఇట్స్ మై ఛాయిస్.

   కబాలి చూడమని బలవంతం గా ఎవ్వరు సినేమా హాలు వద్దకు తోలుకుపోవటంలేదు కదా?

   సౌత్ వర్సెస్ నార్త్ పోటిలో రజనీకాంత్ సౌత్ ఇండియన్ ఐకాన్ గా ప్రొజెక్ట్ చేయబడ్డాడు. ఆయన సినేమా చూడటం సౌత్ ఇండియన్ అస్థిత్వం లో ఒక భాగం.

   తమిళ ప్రజలు తెలివిగా రజనీకాంత్ ను మనపై (తెలుగు వారి)పై రుద్దారు. సంఖ్యా పరంగా ఎక్కువమంది ఉండి కూడా తెలుగు వారు అలా మన హీరోలను వారిపై రుద్దలేకపోయారు. పైగా ఆంధ్రా తెలంగాణ గా కొట్టుకొని విడిపోయారు. ఉన్న అడ్వాంటేజ్ కూడా పోగొట్టుకొన్నారు.

   Delete

 2. యూ జీ శ్రీ రాం గారి మాట వంద నయాపైసల మూట !

  యిక కబాలి సీనిమా చాలా బాగుంది
  ఖచ్చితం గా యిది మరో సూపర్ డూపర్ హిట్ చిత్రం

  త్రీ చీర్స్ టు కబాలి :)

  జిలేబి

  ReplyDelete
 3. జిలేబీగారు వీలైన చోటల్లా వందేసి నయాపైసలు చల్లుకుంటూ పోతున్నారు. బాగుంది. రజనీకాంత్ ఒకప్పుడు Telugu discard అని పిలవబడ్డాడు. కాని ఆయన తెలుగువారిపై రుద్దబడ్డ తమిళహీరో అని భావించటంలో‌ కొంత సామంజస్యం‌ ఉన్నా అంతమాత్రం చేత రజనీ సినిమా చూడటం ఒక దాక్షిణాత్యపౌరుషంలో భాగం అనుకోవటం‌ కష్టం. సినిమా బాగుందంటే చూస్తాం - లేదంటే లేదు. అదీకాక సినిమాలు చూడటం‌ అనే అభిరుచీ, ఫలాని భాషలో సినిమాలు చూడటం అనే అభిరుచీ, ఫలాని హీరో(యిన్) సినిమాలు చూడటం అనే అభిరుచీ‌ కూడా సమాజంలో ఉన్నది. అందులో ఆక్షేపణీయమూ లేదు అనుసరణీయమూ‌ లేదు. లోకో భిన్నరుచిః అంతేను. సినిమా చూడటం అంతముఖ్యం అనుకోని నా బోటివారి దృక్పథం కొందరికి నచ్చకపోవచ్చు. అదీ ఒప్పుకుంటాను. ఇబ్బంది ఏమీ లేదు.

  ReplyDelete
  Replies
  1. * ఒక దాక్షిణాత్యపౌరుషంలో భాగం అనుకోవటం‌ కష్టం *

   శ్యామలీయం గారు, సినిమా బాగుందంటే చూస్తాం - లేదంటే లేదు అని అనటానికి ఆయన హీరో కాదు. ఆ పరిధిని ఎప్పుడో దాటి పోయాడు. నేడు రజని కాంత్ ఒక బ్రాండ్.
   ఆ బ్రంద్ లో కొన్ని ప్రాడక్ట్స్ ఫైల్ అయినా, బ్రండ్ వాల్యు పడిపోకుండా ఎప్పటికప్పుడు రి ఇన్వెంట్ చేసుకొంట్టున్నాడు. ప్రజలకి ఆ బ్రండ్ పై ఉన్న ఇష్టం,క్రేజ్,నమ్మకం ఇంకా చెక్కుచెదరలేదని కబాలి ద్వారా నిరూపించుకొమ్న్నాడు.

   ఖచ్చితం గా రజనీకాంత్ ఉత్తరాదికి పోటి ఇచ్చిన దక్షినాది ఐకాన్.

   Delete
  2. అదేంటండోయ్ శ్రీరామ్‌ గారూ సినిమా బాగుందంటే చూస్తాం - లేదంటే లేదు అని అనటానికి ఆయన హీరో కాదూ ఆ పరిధిని ఎప్పుడో దాటి పోయాడూ అంటూన్నారు. రజనీకాంత్ సినిమా చూడవలెను అని ఏమన్నా రూలుందాండీ? నాకు చూడాలనిపిస్తే చూస్తానే‌ కాని చూడమని శాసనం చేస్తామంటే ఎలాగండీ‌ బాబూ.

   Delete
  3. రజనీకాంత్ ఒక బ్రాండ్ అన్నాను దానర్థం మిమ్మల్ని బలవంతం సినేమా చూడమని కాదు. మీకు బ్రాండ్ అంటే ఎమి తెలియదని అర్థమైంది. ఉదా|| మర్కెట్ లో యాపిల్ ప్రాడక్ట్స్ ఉంటాయి, శాంసంగ్ వి ఉంటాయి వాటితో పాటు లోకల్ ప్రాడక్ట్స్ ఉంటాయి. అయితే యాపిల్ బ్రండ్ కి ఉన్న క్రేజ్ మిగతావాటికి ఉండదు. పనిగట్టుకొని యాపిల్ ప్రాడక్ట్స్ కొనాలని ఫోర్స్ చేయరు. ప్రజలు కొనేలా యాపిల్ వాళ్ళు ప్రచారం చేస్తారు. ఆ బ్రాండ్ పేరు ప్రఖ్యాతుల వెనుక చరిత్ర ఉంట్టుంది. ప్రజలు దాని తో కనెక్ట్ అవుతారు.

   Delete
  4. Rajni-fying north India: When it comes to Rajnikanth, south India has conquered north India


   The staggeringly mega release of Kabali has shown that if anyone has the right to be called the face of Indian cinema, it’s not Salman but Rajni who is the “boss”. Next to Rajnikanth, even Amitabh Bachchan looks like a plate of mini idlis.


   http://blogs.timesofindia.indiatimes.com/bloody-mary/rajni-fying-north-india-when-it-comes-to-rajnikanth-south-india-has-conquered-north-india/

   Delete

 4. రజనీ ఫిల్మ్ చూడని లైఫూ ఒక లైఫేనా !

  జిలేబి

  ReplyDelete