Thursday, July 14, 2016

"పోకెమాన్ గో" గేమ్‌ పిచ్చి....ఫోటోలు మరియు వీడియోలు

"పోకెమాన్ గో" ఆగ్‌మెంటెడ్‌ రియాలిటీ గేమ్‌ గురించి ఈ పాటికి మీరందరూ వినే ఉంటారు. మీలో కొందరికి ఈ గేమ్‌ గురించిన వివరాలు పూర్తిగా తెలిసుంటుంది......ప్రస్తుతం ఈ గేమ్‌ ప్రపంచాన్ని కుదిపేస్తోంది. చాలామంది ఈ గేమ్‌ పిచ్చిలో పడిపోయేరు.

"పోకెమాన్ గో" గేమంటే?: కుదించిన భూతం రూపాన్ని వెదకటానికి వెళ్ళు అని అర్ధం.....దీన్ని రియాలిటీ గేమ్‌ గా వర్ణిస్తున్నారు. ఈ గేమును స్మార్ట్ ఫోన్లలో ఒక అప్లికేషన్ గా అందిస్తున్నారు. అంతర్జాలానికి స్మార్ట్ ఫోన్ కనెక్ట్ అయినప్పుడు ఈ అప్లికేషన్ స్మార్ట్ ఫోన్ దారులకు "కుదించిన భూతం ఫలాన చోట ఉన్నది...వెళ్ళు" అనే సందేశం ఇస్తుంది. అప్పుడు ఆ గేమ్‌ అప్లికేషన్ తో పాటు కుదించిన భూతం ఎక్కడ ఉన్నది GPS మూలం తెలుపుతుంది. దాన్ని వెతుక్కుంటూ గేమ్‌ ఆడే వాళ్ళు వెడతారు. కానీ ఆ కుదించిన భూతం అక్కడ ఉండదు. వేరే చోటు చూపిస్తుంది....ఇలా ఆ ఆటను ఆడాలి...ఆడుతూనే ఉండాలి.

ఈ ఆట, ఆడుతున్న వారిని పిచ్చిలో పడేస్తుంది. వారిని ఆ ఆటకు బానిస చేస్తుంది. అలా ఆ ఆటకు బానిసైన వాళ్ళు ఆ ఆట పిచ్చిలో పడి రోడ్ల వెంట వెడతారు/వెడుతున్నారు. కుదించిన భూతం దొరకదని, ఇది ఉత్త ఆటేనని, తమని ఈ ఆట వినియోగదారులు మభ్య పెడుతున్నారని తెలిసినా ఈ ఆట ఆడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందట.

ఈ ఆట ఆడుతూ...ఈ ఆట పిచ్చిలో పడి ఎటు వెడుతున్నమో తెలియకుండా, ఎటు పడితే అటు వెడుతున్న కొంతమందిని ఇక్కడ చూడండి.


వీడియోలు

ఈ ఆట మాయలో పడకుండా మీరు జాగ్రత్త పడండి...మీ పిల్లలను ఈ గేమ్‌ పిచ్చిలో పడకుండా చర్యలు తీసుకోండి.

No comments:

Post a Comment