Sunday, July 3, 2016

మిస్టరీ:---అంతరిక్షంలో దేవుని చేయి....ఫోటోలు మరియు వివరాలు

నాసా అంతరిక్ష కేంద్రం కొత్తగా విడుదల చేసిన ఫోటోలో విశాలమైన ఒక చేయి అంతరిక్షంలో తెలుతునట్లు చిత్రీకరించబడింది. 'దేవుని చేయి'(Hand of God) అని పిలవబడుతున్న ఆ చేతి ఆకారం పేలిపోయిన ఒక నక్షత్రం యొక్క అవశేషాలు (నీహారిక) అని కొందరు వాదిస్తున్నారు.

కాదు.....అది నిజంగానే దేవుని చేయి అని మిగిలినవారు వాదిస్తున్నారు. శాస్త్రవేత్తలు మాత్రం ఎందుకనో ఇంకా నోరు మెదపలేదు. కారణం ఆ నీహారిక ఎందుకు ఆ ఆకారంలో ఉన్నదో వారికి అర్ధంకావటంలేదు. ఆ ఫోటో చూస్తే మీకేమనిపిస్తోంది!


ఎంచెప్పాలో తెలియటంలేదు కదూ?..... అందుకని మొదట ఈ ఫోటో గురించి, ఫోటోలోని చిత్రం గురించి తెలుసుకుందాం....ఆ తరువాత ఎవరి నిర్ణయానికి వారిని విడిచిపెడదాం.

నీహారికలు అనగా వాయు, ధూళి, మేఘ సముదాయాలు. ఈ విశాల మహావిశ్వంలో వీటి సంఖ్య 20 లక్షల వరకు ఉంటుంది. మన పాలపుంతలో వున్నవాటిని గెలాక్సీయ నీహారికలు అంటారు. కొన్ని నీహారికలు పాలపుంతకు బాహ్యంగా ఉంటాయి. అన్నిటికి మించి విషేషమేమిటంటే ఈ నీహారికల ఉష్ణోగ్రత ఆత్యధికంగా ఉంటుంది. ఆ వాయువులనుంచే నూతన తారలు ఏర్పడుతుంటాయి.

కొన్ని గెలాక్సీలలో ఒక పద్ధతి గోచరిస్తుంది. మధ్య ఒక ప్రకాశవంతమైన నక్షత్రం ఉండి చుట్టూ వాయువులుంటాయి. అంటే గ్రహాలు లేకపోయినా గ్రహ రూపం కనబడుతుంది. అలాంటివి సుమారు 130 వరకు గుర్తించారు. కోటానుకోట్ల కిలోమీటర్ల నిడివి కలిగి, మన సూర్య కుటుంబాన్ని మించిన స్థాయిలో ఇవి ఉంటాయి.

NuSTAR ( Nuclear Spectroscopic Telescope Array) టెలెస్కోప్.

మిగతా రకం మాత్రం ప్రత్యేకం. ఒక ఆకారంలో ఉండవు. కొన్ని సందర్భాల్లో ఇవి దట్టమైన మేఘాల రూపంలో వెనుకనున్న అనేక నక్షత్రాలను కనబడకుండా అడ్డగిస్తాయి. అందువల్ల వీటిని ''బొగ్గు బస్తాలు'' అని వ్యవహ రించడం పరిపాటి. ఇలాంటి ప్రసిద్ధమైన కోల్ సాక్ మన పాల పుంత దక్షిణ క్రాస్లో ఉంది. పాలపుంతకు బాహ్యంగా ఉన్న నీహారికల్లో కోటానుకోట్ల నక్షత్రాలుంటాయి. వాటి దూరాలు మన ఊహలకు బొత్తిగా అందవు. కనీసం 10 లక్షల కాంతి సంవత్సరాల దూరంలో ఉంటాయి. వీటి ఆకారాలు భిన్నరీతుల్లో ఉంటాయి. గుండ్రంగా, కోడిగుడ్డు ఆకారంలో లేదా సర్పిలాకారంలో ఉంటాయి. మన విశ్వం రూపం సంతరించుకునే రోజుల్లో అవి ఎలా ఉండేవో ఇప్పటికీ అదే విధంగా ఉంటున్నాయి. ఆందువల్ల వీటిని ''ద్వీప విశ్వాలు'' అని అంటారు. ఆండ్రోమిడా నక్షత్ర రాశిలోని బ్రహ్మాండమైన నీహారిక ఉత్తర దిక్కుగా కనబడుతుంది. ఇది గంటకు కోటి కిలోమీటర్ల వేగంతో ఆకాశంలోకి దూసుకొనిపోతోంది !

వీటిని క్షుణ్ణంగా పరిశీలించటానికి 2012 జూన్ నెలలో అత్యంత శక్తివంతమైన అంతరిక్ష టెలస్కోప్ NuSTAR ను అంతరిక్షంలోకి ప్రయోగించింది నాసా. ఆ టెలస్కోప్ NuSTAR తీసిన ఫోటోనే ఇప్పుడు మిస్టరీగా మారింది.


మొదటిసారిగా 2009లో నాసా అంతరిక్ష కేంద్ర చంద్రా నక్షత్ర X-RAY వేదశాల (Chandra X-ray Observatory) టెలెస్కోప్ ఈ చేతి ఆకారాన్ని చిత్రీకరించింది. అతి తక్కువ X-ray శక్తి కలిగిన టెలెస్కోప్ తో చిత్రించిన అ చేతి ఆకారం అప్పుడు ఎరుపు మరియు ఆకుపచ్చ రంగులలో కనబడింది. కానీ 18 నెలల నుండి భూమిని చుడుతున్న నాసా వారి అతి నవీన, న్యూక్లియర్ ఎనెర్జీ కలిగిన, శక్తివంతమైన టెలెస్కోప్ NuSTAR ( Nuclear Spectroscopic Telescope Array) తో తీసిన X-ray ఫోటోలలో చేతి రూపంలో నీలి రంగు కూడా కలిగి ఉండంటం చూసేరు.

“భూమికి 17,000 కాంతి సంవత్సరాల దూరంలో, పేలిపోయిన నక్షత్ర కణాలు, 12 మైళ్ల వ్యాసం వరకు వ్యాప్తించి, క్షణానికి 7 సార్లు గిరగిర తిరుగుతోంది” అని డైలీ మైల్ వార్తా పత్రిక వారు సమాచారం అందించేరు.

Sistine చెర్చ్(Sistine Church) పైకప్పు పై 1512లో గీసిన బొమ్మ

"పేలిపోయిన ఆ నక్షత్ర కణాలు, పేలిపోయిన నక్షత్రానికి బయటున్న అయస్కాంత (రాళ్లతో) ఖాళీలతో సంకర్షణ చెందటం వలన ఆ X-Ray వెలుగును ఉత్పత్తి చేస్తోంది. కాబట్టి ఆ చిత్రం ఒక దృష్టిభ్రాంతి అయ్యుండచ్చు" అని ఒక పరిశోధనా అధికారి తెలియజేసేరు.

"ఎలా చూసినా " NuSTAR ' యొక్క ఏకైక దృక్కోణం అతి ఎక్కువ ఎనర్జీతో తాను చూసిన వాటిని X-RAY లు తీసి ఆ ప్రదేశాన్ని పూర్తిగా కొత్త కోణంలో చూపించటమే దాని పని " అని NuSTAR ప్రధాన పరిశోధనా అధికారి Fiona Harrison తెలిపేరు.


"మొట్టమొదటి మనిషికి (Adam) దేవుడు ప్రాణం ఇస్తున్నట్లు Sistine చెర్చ్(Sistine Church) పై కప్పు పై Michelangelo 1512లో గీసిన బొమ్మకు……. మనం ఇక్కడ చూస్తున్న NuSTAR టెలెస్కోప్ తీసిన "దేవుని చేయి" X-RAY లోని చిత్రానికి పోలిక ఉన్నట్లు అందరూ నమ్ముతున్నారు" ఎవరు చెప్పేరో తెలియకుండా ఉండటానికి మారుపేరు తెలుపుతూ, స్కై న్యూస్(Sky News) వారు దేవుని చేయి ఆకారం గురించి ప్రచురించేరు.

నక్షత్ర శాస్త్రం మరియు మతవిశ్వాసము పదేపదే ఒకేమాటమీద ఉండవు. కానీ ఇప్పుడు ఆ రెండూ సైన్స్ (నాసా టెలెస్కోప్) తీసిన శక్తివంతమైన ఫోటోను చూసి ఆశ్చర్యపోతోంది.


"2009లో చంద్రా నక్షత్ర X-RAY వేదశాల అతి తక్కువ శక్తితో తీసిన ఫోటో, 2014 లో నాసా వారి అత్యంత శక్తివంతమైన టెలెస్కొప్ తీసిన ఫోటో ఒకే మాదిరిగా ఉన్నాయి. 2014 లో తీసిన ఫోటో డాక్టర్లు చేతి X-RAY తీస్తే(మామూలుగా చేతి ఎముక,పిడికిలి మరియు చేతి వేళ్లు X-RAY లో ఎలా ఉంటాయో) ఈ ఫోటో కూడా అలాగే ఉన్నది. 6 సంవత్సరాలు అయినా నీహారికలో కొంచం కూడా మార్పు లేకపోవడం, చేతిని పిడికిలి రూపంలో చూపడం విశ్వం మనకి ఏదో చెబుతున్నది" అంటున్నారు కొందరు ఖగోళశాస్త్రజ్ఞులు.

"దేవుని చేయి"(Hand of God) అని ఈ ఫోటోకి ఎవరు పేరు పెట్టేరు?....సైన్స్ శాస్త్రవేత్తలే! ఎందుకు ఆ పేరు పెట్టాలి? సైన్స్ స్థాపనలో చాలామంది శాస్త్రవేత్తలు నాస్తికులైనా, లౌకికవాదులే. ఈ ఫోటోకి అరుదైన, విచిత్రమైన పేరు పెట్టేరంటే దేవుడున్నాడని అంగీకరించటమే. ఎందుకంటే ఆ ఫోటోలోని రూపం అసాధారణమైన విశ్వరూప చేయి లాగా స్పష్టంగా కనబడుతోంది.

ప్రఖ్యాత శాస్త్రవేత్త Arthur Robinson ఈ ఫోటో గురించి ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో "ప్రస్తుత చారిత్రిక యుగం వరకు శాస్త్రవేత్తలు ప్రకృతిలోని ప్రతిదీ భగవంతునికి సాక్ష్యం" అని ఒప్పుకున్నారు. "అలాగే ఇప్పటి చరిత్రలో కూడా చాలామంది శాస్త్రవేత్తలు ప్రకృతిలో కనిపించేదంతా దేవుని సృష్టి అని నమ్ముతున్నారు" అని చెప్పేరు.

ఈ ఫోటో గురించిన మీ అభిప్రాయలను తెలుపండి.

3 comments:

 1. అయ్యా, దేముడు అని కొందరు ఎందుకు వ్రాస్తున్నారో అర్థం కాదు. సరైన పదం దేవుడు. దయచేసి మీ టపాను సవరించగలరు.

  ReplyDelete
  Replies
  1. శ్యామలీయం గారికి,

   మీరు చెప్పినట్లుగానే అన్నిచోట్ల దేవుడు అని మార్చేను. తప్పును గుర్తించి వివరించినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.

   మీకొసం.

   Delete
 2. దేముడు అనరా దోయ్ ! మా
  రాముడు మేష్టారు గొనును రయ్యన ఝాటీ !
  గోమగు పలుకుల కేదోయ్
  గ్రామరు, దేముడు జిలేబి గాదోయ్ శ్యామా !

  ReplyDelete