Thursday, July 21, 2016

మిస్టరీ:--అంటార్టికాలో రక్త జలపాతం...ఫోటోలు మరియు వివరాలు

అంటార్కిటికా భూమికి దక్షిణాన ఉన్న ధృవ ఖండం. ఇది దక్షిణార్థగోళంలో ఉంది. దీని విస్తీర్ణం ఒక కోటి నలభై నాలుగు లక్షల చ.కి.మీ. ఆసియా, ఆఫ్రికా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికాల తరువాత ఐదవ పెద్ద ఖండం. యూరప్ మరియు ఆస్ట్రేలియా దీనికంటే చిన్నవి. ఈ ఖండం 98% మంచుతో కప్పబడి ఉంది.
ప్రపంచంలో కల్లా అతి చల్లని ప్రాంతం అవడం మూలాన ఇక్కడ శాశ్వతంగా నివసించే ప్రజలు ఉండరు. అంతే కాకుండా పూర్వకాలంలో కూడా ఇక్కడ జీవం ఉన్నట్టు ఆధారాలు లేవు. కేవలం చలికి తట్టుకొనే జంతువులు, మరియు మొక్కలు కొన్ని మాత్రమే ఇక్కడ జీవిస్తాయి. ఉదాహరణకు సీల్ చేపలు, పెంగ్విన్ పక్షులు, వివిధ రకాలైన ఆల్గే జాతికి చెందిన మొక్కలు మొదలైనవి.

దక్షిణధృవంలో వున్న అంటార్కిటికాలో ఎండాకాలంలో 24 గంటలూ సూర్యుడు జ్వాజ్వల్యమానంగా ప్రకాశిస్తూ వుంటాడు. సూర్యుడు ఉదయించటం, అస్తమించడం అనేది లేనేలేదు. కొంచెం ఏటవాలుగా ఆకాశంలో 24 గంటలూ ఏదో ఒక ప్రక్క సూర్యుడు కనబడుతూ వుంటే కలిగే మధురానుభూతి వర్ణనాతీతం.
అంటార్కిటికా భారతదేశం కంటే నాలుగున్నర రెట్లు పెద్దది. ఈనాడు ఆ భూభాగం అంతా దట్టమైన మంచుతో కప్పబడి వుంది. లక్షలాది సంవత్సరాలుగా విపరీతమైన హిమపాతంతో 4.5 కిలోమీటర్ల ఎత్తున మంచు పేరుకుపోయింది. భూమి అనేది కనబడకుండా పోయింది. 19వ శతాబ్దం చివరిలోనే మానవుడు మొట్టమొదటి సారిగా అంటార్కిటికాపై అడుగు పెట్టగలిగాడు.

అంటార్కిటికా అంతా మంచుమయం. సముద్రంలో కూడా మంచు ఒక భాగం పైకి తేలియాడుతూ కనబడితే, 9 భాగాలు మునిగి వుంటుంది. పెద్ద మంచుగడ్డలు నీటిలో తేలియాడుతూ వుంటాయి. ఏమాత్రం అజాగ్రత్తగా వున్నా చాలా పెద్ద ప్రమాదాలు జరుగుతాయి. పలుదేశాలు అక్కడ శాశ్వత పరిశోధనా కేంద్రాలు ఏర్పరచుకొని వాతావరణం, సముద్ర ప్రవాహాలు, ఖనిజాలు, లోహాలు, ప్రాణికోటి వంటి వివిధ విషయాలపై పరిశోధన చేస్తున్నారు.
1911 లో శాస్త్రవేత్త Griffith Taylor నాయకత్వంలో అంటార్టికాలో అణ్వేష యాత్ర చేస్తున్న బృందానికి అక్కడ అద్భుతమైన (అప్పుడు భయకంపితులను చేసే) దృశ్యం ఒకటి కనబడింది. గడ్డ కట్టుకుపోయున్న మంచు ఖండంలో ఒక చోట ఎర్రని రక్తం జలపాతంలా పారుతూ ఉండటం చూసేరు. ఆశ్చర్యపోయేరు. ఎటువంటి ద్రవమైనా గడ్డకట్టుకుపోయే చలి ఉన్న ప్రాంతంలో ఎర్రని ద్రవం ధారలా, జలపాతంలా కారడమంటే ఎవరికైనా భయం చోటుచేసుకుంటుంది. మొదటగా Griffith Taylor కనుగొన్న ఆ ప్రాంతానికి టైలర్ హిమానీనదం అనే పేరు స్థిరపడింది.
టైలర్ హిమానీనదం గురించే తెలుసుకోబోతున్నాం. మొదట శాస్త్రవేత్తలు ఆ ఎర్రటి ద్రవానికి/ జలపాతానికి కారణం సిల్మద్రలు (ఆల్గే) అనుకున్నారు. ఐదు అంతస్తుల మంచు గడ్డలపై నుండి పారుతున్న ఈ రక్త జలపాతం క్రింద ఉన్న ఒక చిన్న సరస్సులో కలుస్తోంది. ఆ ద్రవంపై జరిపిన తదుపరి పరిశోధనలలో అద్భుతమైన విషయాన్ని తెలుసుకున్నారు. అది ద్రవం కాదు నీరు అని తేల్చుకున్నారు. ఆ నీటికి ఎర్రరంగు ఎలా వస్తోంది, ఆ నీరు ఎందుకు గడ్డకట్టకుండా పారుతోంది అనే విషయాలపై మరికొన్ని పరిశోధనలు జరిపేరు.
టైలర్ హిమానీనదం క్రింద 2 మిల్లియన్ సంవత్సరాలకు క్రితం 1300 అడుగుల లోతులో ఒక చిన్న సరస్సు ఉండేదని పరిశోధనలలో తెలుసుకున్నారు. నమ్మడానికి కష్టమైనదిగా ఉంది కదూ?

నిజమే! అసలైన కారణం అది కాదు. ఆశ్చర్యకరమయిన విషయమేమిటంటే ఆ హిమానీనదం, దాని క్రింద ఉన్న సరస్సులో ఉండే సూక్ష్మజీవులకు సహజ కాల వాహక భాగం (Natural Time Capsule)లాగా పనిచేసేది. ఆ సరస్సులో జీవించే అదృశ్య(కళ్లకు కనబడనటువంటి) సూక్ష్మజీవులు ప్రాణ వాయువు(ఆక్సిజన్), వెలుతురు(సూర్య రస్మి) మరియు వేడి (ఉష్ణోగ్రత) లేకుండా మనుగడ సాగించేవట.
ఈ సూక్ష్మజీవులను ఆదిమ స్రవించు(Primordial ooze....ఆదికాలపు)సూక్ష్మజీవ ప్రాణులు అంటారు.ఈ సూక్ష్మజీవుల నుండే భూమి మీద ప్రాణులు ఉద్భవించాయట.

జీవరాసులు తీవ్రమైన వాతావరణాల్లోనూ, బహుశ ఇతర గ్రహాలలోనూ (ఉదాహరణకు: అంగారక గ్రహం) ఉంటాయనడానికి ఈ రక్తస్రావ జలపాతం ఒక రుజువు అంటున్నారు కొంతమంది శాస్త్రవేత్తలు. ఇవే అన్య గ్రహ ప్రాణులున్నాయనడానికి రుజువు అంటున్నారు కొందరు శాస్త్రవేత్తలు.
మనం ఈ శ్రుష్టి కి ఎంతో ఋణ పడి ఉన్నాం. గాలి (ప్రాణ వాయువు లేక ఆక్సిజన్) లేకుండా మనం ఎంతోసేపు బ్రతకలేము. వాతావరణంలో 21 శాతం ఆక్సిజన్ ఉన్నదని మీ అందరికీ తెలుసు. శ్రుష్టిచే ఉచితంగా ఇవ్వబడుతున్న ఈ గాలిని స్వేచ్చగా పీల్చుకుని మనం హాయిగా బ్రతుకుతున్నాం. మరి శాస్త్రవేత్తలు చెబుతున్న Primordial ooze ను శ్రుష్టించిందేవరు? ఎందుకు శ్రుష్టించేరు? ప్రాణ వాయువు(ఆక్సిజన్), వెలుతురు(సూర్య రస్మి) మరియు వేడి (ఉష్ణోగ్రత) లేకుండా అవి మనుగడ ఎలా సాగిస్తున్నాయి? దీనికి సైన్స్ దగ్గర సమాధానం లేదు. అదొక మిస్టరీ అని మాత్రమే చెబుతున్నారు.

ఏది ఏమైనప్పటికీ అంటార్టికాలోని రక్త జలపాతం దృశ్యపరంగానూ, సైన్స్ పరంగానూ ఒక ఆశ్చర్యకరమైన, మర్మమైన విషయంగా మిగిలిపోయింది.

No comments:

Post a Comment