Wednesday, July 27, 2016

ఆధునిక వైద్య శాస్త్ర ఆవిష్కరణలకు వేదాలు పునాదులా?....వివరాలు

ఈ రోజుల్లో మనం విని ఆశ్చర్యపోతున్న సైన్స్ పరిశోధనలైన టెస్ట్ ట్యూబ్ బేబీ, క్లోనింగ్, రోబో, కంప్యూటర్, రాకెట్, ఇంటర్ నెట్ లాంటి మరెన్నో ఆవిష్కరణలు పురాతన కాలంలో పురాణాలలో విన్నవే. అంటే అప్పటికే అవి నిజ స్వరూపంలో ఉండేవా? లేక ఊహించిన కధలా?...ఊహించిన కధలేననుకున్నా....ఊహలే అన్ని ఆవిష్కరణలకు కారణం అని మనందరికీ తెలుసు.

ఇప్పుడు ప్రపంచ పరిశోధనలు చేస్తూ సాధించాం అని ఆనందిస్తున్న ఆవిష్కరణలు మన భారత దేశంలో ఎప్పుడో వాడుకలో ఉన్నాయని భారతీయులు వేదాల్లో ఎప్పుడో చెప్పేశారు. మనం దేవతలు పుష్పక విమానాలు వాడే వారు అంటే కొట్టి పాడెస్తాం. మరి రైట్ సోదరులు రెక్కలు కట్టుకుని ఎగరడానికి ప్రయత్నిస్తూ విమానాన్ని కనిపెట్టారు అంటే ఆహా..అంటాం..మహా భారతంలో లేని అంశం లేదని దాని ఆధారంగానే ప్రతీ ఆవిష్కరణ తయారవుతున్నదని మనం ఒప్పుకున్నా..ఒప్పుకోకపోయినా..నిజం.

గాంధారీ తన పిల్లలని కుండలో ఉంచి కన్నది అంటే పుక్కిట పురాణం అంటాం.. అదే టెస్ట్ ట్యూబ్ బేబీ అంటే ఆహా ఏమి విదేశీ బుర్ర అంటాం.
సంతానం లేనివారికి టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రక్రియ ద్వారా సంతానం కల్పించే ప్రక్రియను ప్రఖ్యాత శాస్త్రవేత్త రాబర్ట్ ఎడ్వర్డ్స్. రాబర్ట్ 1950 వ దశకంలో టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రక్రియపై విశేష కృషి చేశారు. ఒకే ఒక్కడుగా ఆయన చేసిన కృషి వల్ల 1978 జూలైలో తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ జన్మించింది. ఆయన ఇన్ విట్రో ఫర్టిలైజేషన్ (ఐ.వి.ఎఫ్.) ప్రక్రియను కనిపెట్టడంతో సంతానం లేని తల్లిదండ్రులలో ఎక్కువ మందికి ఊరట లభించింది. కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో ఆరు దశాబ్దాల క్రితం పరిశోధనలు ప్రారంభించిన రాబర్ట్ ఎడ్వర్డ్స్ 1970 వ దశకంలో ప్యాట్రిక్ స్టెప్టో అనే గైనకాలజిస్టు సాయంతో తమ కృషి కొనసాగించారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా లక్షలాదిమంది నిస్సంతులు సంతానం పొందగలిగారు.

వైద్య శాస్త్రం ఆయుర్వేద పుస్తకాలలో ఒక ప్రత్యేక శాస్త్రంగా సమర్పించబడింది. కానీ మహాభారతం, వేదాలు మరియు పురాణాలు అసలైన(Original) వైద్య శాస్త్రం ఆయుర్వేదం కంటే శ్రేష్టమైనదని సమర్పించబడింది. అన్ని భారతీయ పవిత్ర గ్రంథాలకు మూలం వేదాలు. వేదాలన్నీ రచించినది వేద యుగం కాలంలోనే. అంటే 23960 బి.సి నుండి 5560 బి.సి వరకు. మహాభారతమును రచించింది 5560 బి.సి లో. పురాణాలు రంచించబడినది ఆ తరువాతే.
జంతు మరియు మానవ క్లోనింగ్ వేదాలలో బాగా వివరించారు. అంతర్జాతీయ పుస్తక భాండాగారములో మొట్టమొదటి గ్రంధం ఋగ్వేదం అని ప్రపంచములోని మేధావులందరూ ఏకగ్రీవముగా అంగీకరిస్తారు. విదేశీయులే వేదాలు విశ్వ విజ్ఞాన భాండాగార నిధులని మన వేద విజ్ఞానాన్ని ఎంతగానో ప్రశంసించేరు. వేదాలలో జంతు మరియు మనుష్యుల క్లోనింగ్ గురించి బాగా వివరించబడి ఉంది. అలాగే పారాథెనోజెనెసిస్(parthenogenesis means development of an embryo from an unfertilized egg cell) మరియు టెస్ట్ ట్యూబ్ బేబీల గురించి కూడా పురాతన సాహిత్యంలో నివేదించబడింది.

మహాభారతం ప్రారంభంలో కౌరవులు ఎలా జన్మించేరో వివరించబడి యున్నది. గాంధారి గర్భం దాల్చిన తరువాత రెండు సంవత్సరాలు నిండినా బిడ్డను ప్రసవించలేదు. అందువలన కోపం తెచ్చుకున్న గాంధారి గర్భంలోని పిండమును నిష్ఫలంచేసుకుంది. నిజానికి గాంధారి గర్భంలో ఉన్నది పిండం కాదు. ఒక గడ్డ. మామూలు గడ్డ కాదు. మూల కణాల ద్రవ్యరాశి సమూహం. ఇది తెలుసుకున్న వ్యాస మహర్షి గాంధారి నిష్ఫలంచేసిన మూల కణాల ద్రవ్యరాశి సమూహం గడ్డని జాగ్రత్తగా తీసి అందులో నుండి జీవ కణాలను వేరు చేసి పూర్ణ కలస కుంభంలో బద్రపరిచేడు. ఆ కలసం మామూలు కలసం కాదు. జీవన శక్తి పోషణకు సంబంధించిన పోషణను సరఫరా చేసే కలసం. అందులో 101 జీవ మూల కణాలు ఉన్నాయి. కొన్ని నెలల తరువాత ఆ 101 జీవ మూల కణాలు బిడ్డలుగా తాయరైనై. వారే కౌరవులు. 100 మంది కౌరవులు, వారి సోదరి దుస్సల.
ఋగ్వేదంలో వివరించిన విధంగానే వ్యాస మహర్షి చామస భాగ ప్రక్రియతో (Nuceli of small atoms (Chamasa) get formed from this ion plasma) కౌరవులను పుట్టించగలిగేడు. ఇలాంటి వైద్య ఉదాహరణలు మహాభారతంలో చాలా ఉన్నాయి.

ఈ ఉదాహరణలలో ముఖ్యమైనది కర్ణుని జననం. కుంతీదేవి సూర్య శక్తితో పారాథెనోజెనెసిస్ విధాన ప్రక్రియతో కర్ణుడికి జన్మనిచ్చింది. ఇక్కడే అందరూ గమనించవలసిన విషయం ఉన్నది.

పారాథెనోజెనెసిస్(Parthenogenesis..... The term Parthenogenesis contains a word ‘Partha’ which means ‘of Prutha’. Prutha is Kunti’s second name) అనే ఆంగ్ల వైద్య పదంలో పార్త అనే దానికి “ప్రుతలో” అనే అర్ధం వస్తుంది. కుంతీదేవికి మరో పేరు ప్రుత. అంగ్ల వైద్య శాస్త్ర నిపుణులు పారాథెనోజెనెసిస్ ప్రక్రియకు అనుకోకుండా ఆ పేరు పెట్టేరా లేక ఋగ్వేదంలో వివరించిన విధంగానే టెస్ట్ ట్యూబ్ ప్రక్రియ అభివ్రుద్ది చేసేరు కాబట్టి కుంతీదేవి యొక్క రెండవ పేరు పెట్టేరా?...అనేదే మిస్టరీ.

వేదమనగా మతం కాదని, అది ఒక అద్భుతవిజ్ఞాన భాండాగారమని, విశ్వమానవ జీవనశైలి అని గుర్తించిన ప్రపంచ దేశాలన్నీ వేద విజ్ఞాన పరిశోధనా ఫలములను అందిపుచ్చుకోవడంలో చాలా ముందుకు వెళుతుండగా, వేదాలకు పుట్టినిల్లయిన భారతదేశంలో ఈ పరిస్థితులు ఉండడాన్ని 'ఫ్రాంటెయర్ గాటెయర్' అనే అమెరికన్ 'ఓ భారతదేశమా రోదించు!' అనే వ్యాసంలో పేర్కొన్నారు. భారతీయ విజ్ఞాన వాఙ్మయ సంపదంతా జర్మనీలో ఉంది. అలాగే బ్రిటీషువారు వెళుతూ వారి భావాల్ని వారి విద్యావిధానాన్ని (మెకాలే), వారి జీవనశైలిని, భారతీయులకిచ్చి, భారతీయ వైజ్ఞానిక గ్రంథ సంపదని వారు తీసుకొని పోయి బ్రిటీషు లైబ్రరీలో భద్రపరిచారు. జర్మనీ తరువాత గ్రంథాల చిరునామా బ్రిటీష్ లైబ్రరీనే.

No comments:

Post a Comment