Tuesday, July 12, 2016

చైనాలో బీభత్సం సృష్టిస్తున్న వరదలు....ఫోటోలు

ఇటీవల సంభవించిన వరదల నుంచి కోలుకోకమునుపే చైనాను మరోసారి వరదలు ముంచెత్తుతున్నాయి. తాజాగా సంభవించిన భారీ వరదల వల్ల 1,30,000 మందికి పైగా ప్రజలు నిరాశ్రయులయ్యారని ప్రాంతీయ అధికారులు ప్రకటించారు.

ఈ వరద వల్ల దక్షిణాది చైనీయుల ఐల్యాండ్ ప్రాంతం హైనాన్ లో దాదాపు 550 గ్రామాలు తుడిచిపెట్టుకుపోగా...ఇప్పటికీ సహాయం కోసం ఎదురుచూస్తున్న ఆరు వేలకు పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలు చేర్చేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు.

హైనాన్ ప్రాంతంలో 1961 నుంచి ఇప్పటి వరకూ ఇలాంటి భారీ వరదలు సంభవించలేదని, కుంభవృష్టిగా కరిసిన వర్షాల వల్ల గత 40 ఏళ్లుగా సంభవించనటువంటి వరదలు ఆ ప్రాంతాన్ని ముంచెత్తడంతో రెండు హైవేలు, చాలా జాతీయ రహదారులు, ఎనిమిది ప్రాంతీయ రహదారులతో పాటు మరికొన్ని రహదారులు ద్వంసమైనట్లు అధికారులు తెలిపారు.

వాన్క్వాన్ నదిపై ఉన్న అతిపెద్ద రిజర్వాయర్లో నీటి మట్టం ఊహించని విధంగా ప్రమాద స్థాయికి చేరుకోవడంతో అధిక నీటిని మంగళవారం రాత్రి నుంచి విడుదల చేసినట్లు క్వియాంగి నగరంలో ఉన్న వరద నియంత్రణ ప్రధాన కార్యాలయం తెలిపింది.

No comments:

Post a Comment