Friday, July 22, 2016

ఫేస్ బుక్ సౌర విమానం మూలం అందరికీ అంతర్జాలం....ఫోటోలు, వివరాలు మరియూ వీడియో

"ప్రజలందరికీ అంతర్జాలం" అన్న ఒకే ఒక నినాదంతో భూమి మీదున్న ప్రతి మనిషికీ అంతర్జాల సేవలు అందించాలని, ముఖ్యంగా మారుమూల ప్రాంతాల ప్రజలకు అంతర్జాల సదుపాయం కల్పించేందుకు ఫేస్ బుక్ సౌర విమానాన్ని తయారుచేసి అందుమూలముగా ప్రజలకు అంతర్జాల సదుపాయం కల్పించేందుకు ప్రణాళిక వేసింది. ఆ ప్రణాళిక విజయవంతమయిందనే చెప్పాలి.
జూన్-28, 2016 న అంతర్జాల సదుపాయం కల్పించే విమానాన్ని ఫేస్ బుక్ ప్రయోగం చేసింది. ఆ విమానాన్ని అంతర్జాల సదుపాయం లేని దక్షిణ ఆఫ్రికాలోని కొన్ని మారుమూల ప్రాంతాలకు పంపేరు. వైయర్లెస్ మూలం అంతర్జాల వసతులను ఆ విమానం ఆ ప్రాంత ప్రజలకు అందించింది.
ఇక పూర్తి సేవలను అందించటానికి ఎంతో సమయం పట్టదని ఫేస్ బుక్ అధినేత మార్క్‌ జుకెర్‌బర్గ్‌ వెల్లడించారు.

An infographic shows the areas not covered by mobile network coverage

వీడియో

సంతోషపడుతున్న Mr.Jay Parikh, Facebook's Global Head of Engineering and Infrastructure

గూగుల్ కంపెనీ కూడా బెలూన్ల మూలం మారుమూల ప్రాంతాల ప్రజలకు అంతర్జాల సదుపాయం కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది.అంతర్జాల సదుపాయాలు చాలామందికి అందుబాటులో ఉన్నదనే మనమందరం అనుకుంటున్నాం. కానీ ప్రపంచవ్యాప్తంగా ఇంకా 4 బిల్లియన్ ప్రజలు అంతర్జాల సదుపాయమే లేకుండా జీవిస్తున్నారు.

No comments:

Post a Comment