Saturday, July 2, 2016

మిస్టరీ:---ఉత్తరధ్రువం వద్ద భూమికి భారీ రంధ్రాలు....ఫోటోలు మరియు వివరాలు

ఉత్తరధ్రువం సమీపంలోని రష్యా భూభాగంలో పోయిన సంవత్సరం ఏర్పడిన భారీ బిలం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బొవనెన్కోవో గ్యాస్ ఉత్పత్తి కేంద్రానికి 30 కిలోమీటర్ల దూరంలో 60 మీటర్ల విస్తీర్ణంతో ఏర్పడిన ఈ బిలం గ్రహాంతరవాసుల నౌక దిగటంవల్ల ఏర్పడిందని భారీఎత్తున వదంతులు వ్యాపించాయి. భారీ పరిమాణంలో ఉన్న ఉల్క ఢీకొనటం వల్ల రంధ్రం ఏర్పడిందని కొందరు వాదిస్తున్నారు. అయితే, ఈ బిలం ఏర్పడటానికి అవేవీ కారణాలు కాదని రష్యా శాస్త్రవేత్తలు కొట్టిపారేశారు. ఆ ప్రాంతంలో ఉష్ణోగ్రతల్లో వచ్చిన అనూహ్య మార్పులతో భూ పటలంలో తీవ్రమైన వత్తిడి ఏర్పడిందని, అది భారీ రంధ్రం ద్వారా బయటకు వచ్చిందని ఆర్కిటిక్ సైంటిఫిక్ రీసెర్చ్ సెంటర్ సీనియర్ శాస్త్రవేత్త ఆండ్రీ ప్లెకనోవ్ తెలిపారు. ఆ బిలాన్ని పరిశీలించిన ఆండ్రీ, ఆ ప్రదేశంలో 80శాతం మంచే ఉందని, ఉల్క ఢీకొన్నట్లు ఎక్కడా ఆధారాలు లేవని స్పష్టం చేశారు.


కానీ ఈలోపు ఈ మధ్య శాటిలైట్ చిత్రాలు అదే ప్రాంతంలో మరో 12 రంద్రాలు ఉన్నట్టు చూపినై.

ఈ చిత్రాలను చూసిన రష్యా శాస్త్రవేత్త Vasily Bogoyavlensky భద్రత ఆందోళనతో ఈ రంధ్రాల గురించి అంతర్జాతీయ పరిశోధన చాలా అవసరమని, ఈ రంద్రాలు ఏర్పడటానికి వెనుక ఉన్న మర్మమేమిటో తెలుసుకోవలసిన అవసరం ఎంతైనా ఉన్నదని, లేకపోతే భూమండలంలో పలుచోట్ల ఇలాంటి రంద్రాలు ఏర్పడి భూమిని లోపలికి లాక్కుపోతుందని, అలా గనుక జరిగితే ఎంతోమంది ప్రాణాలు కోల్పోతారని ఆతురత వ్యక్తంచేసేరు.

ఆర్కిటిక్ భూ ప్రదేశంలో గడ్డకట్టుకుపోయిన మంచు క్రింద మితేన్ హైడ్రేట్ (methane hydrate)అనే రసాయణం ఉంటుందని, గ్లోబల్ వార్మింగ్ వలన గడ్డకట్టుకుపోయిన మంచు కనీసంగా కరగడంవలన క్రింద ఉన్న మితేన్ హైడ్రేట్ ఒక్కసారిగా పేలుడు విడుదలతో బయటకు రావడం వలన అలా జరిగిందని కొంతమంది భూగర్భ శాస్త్రవేత్తలు చెబుతున్నారు.


“ఒక చోట జరిగుంటే మనం అలా అనుకోవచ్చు...కానీ శాటిలైట్ చిత్రాలు ఆర్కిటిక్ ప్రాంతంలో పలుచోట్ల ఈ రంద్రాలు ఏర్పడినట్లు చూపిస్తున్నాయి” రష్యా శాస్త్రవేత్త Vasily Bogoyavlensky మరోసారి ఆందోళన వ్యక్తం చేసేరు.

“దీనిమీద అనవసరమైన చర్చ, భయం, ఆందోళన అవసరంలేదు. సహజంగా మంచు గడ్డకట్టే ప్రాంతమైన ఆర్కిటిక్ లో గడ్డకట్టిన మంచు పలుచోట్ల గోపురంలా పైకి ఉబికి వస్తుంది. పైకి ఉబికి వచ్చి గోపురంలా కనబడేదానిని పింగో(pingo)అంటారని శాస్త్రవేత్తలందరికీ తెలుసు. ఆ పింగోలు కరిగినప్పుడు అక్కడ కొంత భూమి రంద్రంలా ఏర్పడుతుంది” అని తెలిపేరు Carolyn Ruppel, chief of the U.S. Geological Survey's Gas Hydrates Project.


"రంద్రాలు మాత్రం ఏర్పడి ఉంటే నేనూ అర్ధం చేసుకోగలను....కానీ రంధ్రాలు ఏర్పడినచోట్లో రాళ్ళు పైకి ఎలా వచ్చినై. పేలుడు లాంటిది జరిగి ఉంటేనే భూమి క్రింద ఉన్న రాళ్ళు అలా పైకి విసిరి వేయబడతాయి" అమెకు సమాధానం ఇచ్చేరు రష్యా శాస్త్రవేత్త Vasily Bogoyavlensky.


2014 నవంబర్ వరకు ఆ ప్రదేశంలో 3 రంద్రాలనే చూసేరు. ఆ తరువాత శాటిలైట్లు చూపిన పఠాలలో సుమారు 7 పెద్ద రంద్రాలు. వాటి చుట్టూ మరో 20 రంద్రాలదాకా కనబడుతున్నాయి. ఇందులోని రెండు రంధ్రలాలో నీరు పైకి వచ్చి కోలనులా తయారయ్యింది. కొన్ని రంద్రాలు 200 అడుగుల వైశాల్యం కలిగి లోతు తెలియని అగాధంతో ఉన్నాయి.


Russian Centre of Arctic Exploration నుండి కొంతమంది శాస్త్రవేత్తలు మొదటి మూడు రంద్రాలలొ ఒక దానిని పరిశోధించి వచ్చేరు. రంధ్రాలు ఏర్పడటానికి సరైన కారణం వారికి దొరకలేదు. రంధ్రం లోతు 54 అడుగులు ఉన్నదని మాత్రం తెలియజేసేరు.

"మితేన్ హైడ్రేట్ భూమికి క్రింద 740 అడుగుల లోతులోనే ఉంటుంది. కానీ మనం చూస్తున్న ఈ రంద్రాలు 54 అడుగులే ఉన్నాయి. కాబట్టి వాతావరణ ఉష్ణోగ్రత(గ్లోబల్ వార్మింగ్)వలన ఏర్పడిన రంద్రాలు కావు ఇవి. గ్లోబల్ వార్మింగ్ వలన ఏర్పడిన రంధ్రాలు అనుకుంటే మరి ఈ రంధ్రాల పక్కన పింగోలు కనబడుతున్నాయి. మరి అవి ఎందుకు పేలిపోలేదు. అంతేకాకుండా మంచు ప్రదేశమైన ఆర్కిటెక్ భూప్రదేశంలోనే కాక, రష్యా, చైనా భూ ప్రదేశాలలో కూడా రంధ్రాలు ఏర్పడుతున్నాయి. అందుకనే ఈ రంద్రాల గురించి ప్రపంచ శాస్త్రవేత్తలు తీవ్ర పరిశోధన జరపాలి. ఖచ్చితమైన నిజం తెలుసుకోవాలి. అప్పుడే ఇలాంటి రంద్రాలు మరెక్కడా(ప్రజలు నివసిస్తున్న ప్రాంతాలలో) ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు " అంటూ రష్యా శాస్త్రవేత్త Vasily Bogoyavlensky తన ఆవేదన వ్యక్తం చేసేరు.


"ఇది పరిశోధించవలసిన విషయమే. ఇవి సహజంగా ఏర్పడుతున్న రంధ్రాలా? లేక మానవులు( దేశాలు తమ ఆయుధాలను పరిశోధించటానికి)ఈ ప్రదేశాన్ని వాడుకుంటున్నారా? అనేది తెలుసుకోవాలి. వీటిలో ఏది నిజమైనా 'మన గోతులు మనమే తవ్వుకుంటున్నాం' ఎందుకంటే రెండిటికీ మానవులే కారణం" అంటున్నారు మిగిలిన శాస్త్రవేత్తలు.

పరిశోధనలు జరపటానికి ఎందుకు జంకుతున్నారో అనేదే మిస్టరీగా ఉన్నది.

1 comment: