Saturday, July 16, 2016

అగ్నిపర్వతంపై రెస్టారెంట్.....ఫోటోలు

అగ్ని పర్వతంపై రెస్టారెంట్ పెట్టటం మాత్రమే గొప్ప కాదండి. ఆ రెస్టారెంట్ లో వండే వంటకాలు అగ్నిపర్వతం నుండి పైకి వచ్చే వేడి/ఉష్ణోగ్రత, ఆవిరితో వండుతారు. ఆశ్చర్యంగా ఉంది కదు! కానీ ఇది నిజం.
స్పెయిన్ దేశానికి చెందిన ద్వీప సమూహాలలో ఒకటైన లాంజరోట్(Lanzarote) అనే ద్వీపంలోని అగ్నిపర్వతంపై నిర్మించబడింది ఈ రెస్టారంట్. ఈ రెస్టారెంటుకు ఎల్ డియాబ్లో రెస్టారెంట్ అని పేరుపెట్టేరు. దీనికి అర్ధం దుష్టశక్తి రెస్టారెంట్. తగిన పేరే పెట్టేరు అంటారు అందరూ. ఎందుకంటే ఎప్పుడు పేలుతుందో తెలియని ఒక అగ్నిపర్వతంపైన రెస్టారెంట్ పెడితే అలాకాక ఇంకెలా పేరు పెడతారు. అయితే ఈ అగ్నిపర్వతం పేలే అవకాశం ఇప్పట్లో లేదని ఖచ్చితంగా గణించిన తరువాతే 1970 లో ఈ రెస్టారెంట్ పెట్టేరు.
చివరి సారిగా 1824లో ఈ అగ్నిపర్వతం పేలింది. ఆ తరువాత ఇప్పటిదాకా ఎటువంటి చిన్న పేలుడు కూడా ఏర్పడలేదు. ఈ పర్వతంలో అక్కడక్కడా చిల్లులు ఉండటం, ఆ చిల్లులలో నుండి ఆవిరి, వేడి ( ఎంత వేడంటే 450 డిగ్రీల సెల్సియస్ వేడి) బయటకు వస్తూ ఉండటంతో జూలియో పాడ్రన్ అనే అతనికి ఇక్కడ రెస్టారెంట్ పెట్టి భూగర్భ ఉష్ణముతో వంటలు వండి పర్యాటకులకు అందించాలని కోరిక పుట్టింది.
ఆ కోరికే అతన్ని ప్రేరేపించి ప్రభుత్వంతో అభ్యర్థన పెట్టేటట్లు చేసింది. శాస్త్రవేత్తలు, భూకంప పర్యవేక్ష నిపుణులు అంగీకారం తెలుపడంతో రెస్టారంట్ మొదలయ్యింది. అగ్నిపర్వత రాళ్ళను ఉపయోగించే రెస్టారెంట్ మరియూ వంట పొయ్యి నిర్మించబడింది. ఆ వంట పొయ్యిలపై చేసిన వంటను పరీక్ష చేసిన శాస్త్రవేత్తలు ఓ.కే. చెప్పేరు.
అంతే. రెస్టారెంట్ పర్యాటకులకు ప్రత్యేక ఆకర్షణ అయ్యింది. సహజ వేడితో తయారుచేయబడే వంటకాలాను తినడానికి ఆసక్తి చూపించేరు. అగ్నిపర్వతాన్ని ఎక్కినట్లు ఉంటుంది, అక్కడి విషేశాలు తెలుసుకున్నట్లూ ఉంటుంది, ఆ రెస్టారెంట్లో తిన్నట్లు ఉంటుంది అనే అభిప్రాయాలతో పర్యాటకులు రావడం మొదలయ్యింది. రెస్టారెంట్ ప్రసిద్ది చెందింది. మధ్యాహ్నం 12 నుండి 3 వరకు మాత్రమే రెస్టారెంట్ తెరిచి వుంటుంది.

1 comment:

  1. సత్యనారాయణ గారు

    ఫోటోలు మీ వివరణా బాగుందండీ



    అగ్ని పర్వతము లటంచు అదురు బెదురు
    అసలు లేకయు అద్భుత యల్డి యాబ్లొ
    రెస్టొరాంటును అగ్నిమీళె పుర హితము
    జేసె జూలియో పాడ్రను స్పెయిను నందు


    జిలేబి

    ReplyDelete