Friday, July 15, 2016

పిల్లికి గుడి.....వివరాలు మరియు ఫోటోలు

మనం ఏదైనా గుడికి వెళ్తే ఇంటికి ప్రసాదం పట్టుకుపోయినట్లే ఈ ఆలయానికి వచ్చిన వారందరూ అక్కడుండే పిల్లి బొమ్మను కొనుక్కుపోతారు. ఎందుకంటే అదో అద్రుష్ట గుర్తుగా భావిస్తారు. దేవతగా నమ్ముతారు. ఇవన్నీ టోక్యోలోని " గొటుకూ-జి" గుడి విశేషాలు. ఇక్కడుండే పిల్లి బొమ్మను "లక్కీ క్యాట్" గా భావిస్తారు. కారణం తెలుసుకోవాలంటే దీని కధ తెలుసుకోవల్సిందే.
శకునం (Omen) అనగా జరగబోవు పని గురించిన సంజ్ఞ. కొన్నిటిని కొందరు వ్యక్తులు శుభ శకునాలు గాను, కొన్నిటిని అశుభ శకునాలు గానూ భావిస్తారు. శకునాల శాస్త్రీయత ప్రశ్నార్ధకమైనందువల్ల హేతువాదులు శకునాలను పట్టించుకోవటాన్ని మూఢ నమ్మకంగా కొట్టిపారేస్తారు. అయితే మానవ చరిత్రలో మరియు జానపద వాజ్ఞ్మయంలో శకునాలకు చాలా ప్రధానపాత్ర ఉన్నది.
జానపదులు అనేక రకాల శకునాలు చూసుకుంటారు. అందులో ముఖ్యంగా కాకి శకునం వివరంగా చూసుకుంటారు. కాకి కూస్తూవుంటే చుట్టాలొస్తారని యెదురు చూస్తూవుంటారు.
శకునాలు తెచ్చే ఫలితాలను బట్టి వాటిని శుభ శకునాలు మరియు అశుభ శకునాలుగా వర్గీకరిస్తారు. శకునాలు ఆయా దేశాల సంస్కృతిని బట్టి మారుతూ ఉంటాయి. ఒక సంస్కృతిలో శుభశకునంగా పరిగణించిన దాన్ని వేరొక సంస్కృతిలో అశుభ శకునంగా పరిగణించే అవకాశం ఉంది. ఉదాహరణకు అమెరికాలో నల్లపిల్లిని అశుభసూచకముగా భావిస్తే, ఇంగ్లాండులో అదే నల్లపిల్లిని శుభసూచకముగా భావిస్తారు.
శకునాలను ... వాటి ఫలితాలను భారతీయులు ఎంతగానో విశ్వసిస్తుంటారు. శుభకార్యాల నిమిత్తం బయలుదేరుతున్నప్పుడు ... శుభకార్యాలకి సంబంధించిన పనులను ప్రారంభిస్తూ వున్నప్పుడు సహజంగానే శకునం చూసుకుంటూ వుంటారు. శకునం మంచిగా అనిపించకపోతే శుభకార్యాలను వాయిదా వేయడమే కాదు, రద్దు చేయడం కూడా జరుగుతూ వుంటుంది. అంతగా శకునాలను నమ్ముతూ వుండటం జరుగుతూ వుంటుంది.
ఈ శకునాల్లో పిల్లి శకునం మరింత ప్రభావం చూపుతుందని భావిస్తూ వుంటారు. పెంపుడు పిల్లికి తప్పులేదనే విశ్వాసం వుండటం వలన, తమ పిల్లి కాకుండా మరో పిల్లి ఎదురుపడితే దానిని శకునంగానే భావిస్తుంటారు. అంతేకాదు పెంపుడు పిల్లి ఇల్లు వదలిపోతే ఇంటిలోని అదృష్టం కూడా దానితోనే పోతుందంటారు పెద్దలు. శుభకార్యాల నిమిత్తం బయలుదేరుతున్నప్పుడు పిల్లి ఒకానొక విధంగా మాత్రమే ఎదురు రావడం మంచిదని చెబుతారు. ఎలుకను చంపి .. చచ్చిన ఎలుకను నోటకరచుకుని పిల్లి ఎదురుపడితే అది శుభ సూచకంగా భావించవచ్చు ... కార్యసిద్ధి జరుగుతుందని చెబుతారు.
శకునాలలోనే ప్రపంచవ్యాప్తంగా పిల్లి శకునాన్నే ఎక్కువమంది పట్టించుకుంటున్నారు.

పిల్లి ప్రవర్తన ఆధారంగా భవిష్యత్తు గురించి పలు జోస్యాలు చెబుతుంటారు. పిల్లి కదలికల్లో ఏదో ఒక సూచనను చూసేవారు కోకొల్లలుగా ఉన్నారు. వెన్నెలలో నల్ల పిల్లిని చూడడం ఆ ప్రాంతం లో ఏదో ఒక అంటు వ్యాధి ప్రబలనున్నదనడానికి సూచన (ఇది ఐరిష్ ప్రజల భయం). ఉద్దేశపూర్వకంగా పిల్లిని చంపితే మీరు మీ ఆత్మను దెయ్యానికి కోల్పోయినట్టే (బ్రిటన్ వివేకమిది). ఒక పిల్లి తన తోకను మంటవైపు ఉంచి, తన చెవుల పై భాగాన్ని నాకుతూ ఉంటే వాతావరణ పరిస్థితులు విషమిస్తాయి. వివాహ వేదిక వద్ద పిల్లి ఉండడం మంచి అదృష్టం. ఒక మృతుడి శవపేటిక పై నుంచి పిల్లి దూకితే శాశ్వత నిద్ర పోతున్న ఆ మహానుభావుడు స్వర్గానికి చేరే ప్రసక్తే లేదు (ఆస్ట్రేలియన్ల మాట ఇది). ఒక పిల్లి కిటికీలోంచి అదే పనిగా బయటికి చూస్తుంటే వర్షం ఖాయంగా రాబోతుందనడానికి సూచన. కలలో పిల్లి దర్శనమిస్తే ధన లాభం; వ్యాపారంలో కలిసివస్తుంది. నల్ల, తెల్ల పిల్లులు స్వప్నంలో కన్పిస్తే మీ సంతానం విషయంలో మీరు చాలా అదృష్టవంతులు. చారల పిల్లి కలలో కన్పిస్తే మీ ఇంటిలో అదృష్టం వర్షిస్తుంది. నల్ల పిల్లులు గుప్త నిధులను కనిపెట్టగలుగుతాయి. ఐదు రోడ్ల కూడలి వద్దకు పిల్లిని తీసుకువెళ్ళి వదిలివేయండి. ఆ తరువాత దానిని అనుసరించండి, మీకు గుప్త నిధులు దొరుకుతాయి (ఇది ఫ్రెంచ్ వారి ఆశాభావం).
జపాన్ దేశములో సైగ చేయు పిల్లి అద్రుష్టం మరియూ ఐశ్వర్యం తీసుకు వస్తుందని గట్టి నమ్మకం. పిల్లులు సైగలు చేస్తాయా? వాటి ప్రవర్తనలను బట్టి వాటికి శకునాలు నిర్ణయించుకున్నారు. అలాగే జపాన్ దేశములో కూడా ఒక పిల్లి చేసిన ప్రవర్తనే అద్రుష్టం మరియూ ఐశ్వర్యంగా భావిస్తున్నారు. అదే సైగ చేసిన పిల్లి.

పూర్వం ఒకరోజు ఒక రాజు సెటగయా నగరంలో నుండి వెడుతూ, అలసి పోయి ఉండటంతో సేద తీర్చుకోవడానికి విశ్రాంతి తీసుకునేందుకు ఒక చెట్టు దగ్గర ఆగేడు. ఇది గమనించిన ఒక పిల్లి ఆ రాజుకు సైగ చేసి వేరే చోటుకు తీసుకు వెళ్లింది. కొద్ది క్షణాలలో గాలీ వానతో కూడిన వర్షం పడటం, అప్పుడు ఒక పిడుగు రాజు అంతకు ముందు నిలబడ్డ చోట పడటం జరిగింది. అది చూసిన రాజు పిల్లిని తన అద్రుష్ట దేవతగా భావించి కోట్లకొలది డబ్బును పెట్టి అక్కడ ఆ పిల్లికి ఒక గుడి కట్టించి, తమ కుటుంభ గుడిగా మార్చుకున్నాడట. అప్పటి నుండి ఆ గుడి, సైగ చేసే ఆ పిల్లి జపాన్ ప్రజలకు ప్రియమైనదిగా మారింది.
“మనేకి నెకో" లేక "సైగ చేయు పిల్లి" ....ఇది జపాన్ దేశంలో అత్యంత పేరుపొందిన బొమ్మ(విగ్రహం). అద్రుష్టం మరియూ ఐశ్వర్యం తీసుకు వస్తుందని గట్టి నమ్మకంతో జపాన్ దేశ ప్రజలు తమ ఇళ్లల్లో, షాపులలో, వ్యాపార కేంద్రాలలో మరియూ ఆఫీసులలో ఈ పిల్లి బొమ్మను తప్పక ఉంచుకుంటారు.సెటగయా నగర సరిహద్దులలో " గొటుకూ-జి" అనే పేరుతో ఈ పిల్లి విగ్రహంతో ఒక గుడి ఉన్నది.
బ్యాటరీలతో సైగ చేయు పిల్లుల బొమ్మలను తయారు చేసి అమ్ముతున్నారు. ఈ బొమ్మ బ్యాటరీ పవర్తో చేతితో సైగ చేస్తుంది. ఈ బొమ్మను అందరూ కొనుక్కుని తెచ్చుకుంటున్నారు. ఈ బొమ్మ శక్తి ఇప్పుడు ఆసియా దేశాలలో కూడా వ్యాపించింది.

4 comments:



  1. పిల్లికి గుడిగట్టిరి తా
    నెల్లరి శకునము జిలేబి నెమ్మది జేయన్
    అల్లన సైగల పిల్లిని
    చల్లగ జూడమని కొలిచె జాపాను జనుల్

    జిలేబి

    ReplyDelete
  2. చాలా బాగుంది.

    ReplyDelete
  3. చాలా బాగుంది.

    ReplyDelete