Thursday, July 14, 2016

ప్రపంచాన్ని చుట్టిన సౌర విమానం....ఫోటోలు

సౌర శక్తితో ప్రపంచాన్ని చుట్టాలని మొదలుపెట్టిన ప్రయత్నం చివరి అంకానికి చేరుకుంది. ప్రయోగాత్మకంగా ప్రారంభించిన సోలార్‌ ఇంపల్స్‌-2 సౌర విమాన ప్రపంచ యాత్ర బుధవారం ఈజిప్టుకు చేరింది. దీంతో దాని చివరి గమ్యస్థానాన్ని విజయవంతంగా చేరినట్లయింది......కేవలం సౌరవిద్యుత్‌తో నడిచే ‘సోలార్ ఇంపల్స్2’ విమానం చరిత్ర సృష్టించింది.

సొలార్ ఇంపల్స్2 ప్రత్యేకత ఏమిటంటే... ఇది ఒక్కచుక్క ఇంధనాన్ని కూడా వినియోగించదు. పూర్తిగా సౌరశక్తి పైనే ఆధారపడి నడుస్తుంది. ఈ విమానం బరువు 2,300 కిలోలు మాత్రమే. అయితే దీని రెక్కలు బోయింగ్ విమానం కన్నా వెడల్పు. వీటిపై అమర్చిన 17,000 పైచిలుకు ఫలకాల ద్వారా ఇది సౌరశక్తిని గ్రహించి 4 లిథియం పాలిమర్ బ్యాటరీల్లో నిల్వచేస్తుంది.

No comments:

Post a Comment