Sunday, July 10, 2016

దెయ్యం చేప....వివరాలు మరియు వీడియో


ఆశ్చర్యపరిచే దెయ్యం చేపను NOAA అనే సముద్ర సంబంధిత జీవుల గురించి పరిశోధనలు చేసే పరిశోధనా సంస్థ పసిఫిక్ మహాసముద్రంలోని అత్యంతలోతైన భాగంలో కనుగొన్నది. ఈ చేప చూడటానికి దెయ్యంలాగా ఉన్నందువలన ఈ చేపకు దెయ్యం చేప అనే పేరు వచ్చింది.


మామూలుగా సముద్ర పైభాగాన నీటి వేగం 14.7 psi(Pounds per square inch) మాత్రమే ఉంటుంది. పసిఫిక్ మహాసముద్రంలోని అత్యంతలోతైన భాగంలో నీటి వేగం 16,000 psi ఉంటుంది(సముద్రంలో నీటి వేగాన్నీ కొలిచే పద్దతిని psi అంటారు). సముద్ర జీవులలోనే ఈ దెయ్యం చేప మాత్రమే అంత నీటి వేగాన్ని తట్టుకుంటుంది.


సముద్ర సంబంధిత జీవుల గురించి పరిశోధనలు చేసే సముద్ర జీవశాస్త్రజ్ఞులు పసిఫిక్ మహాసముద్రంలోని అత్యంతలోతైన భాగంలో ఈ దెయ్యం చేప ఉన్నదని తెలుసు. కానీ ఈ దెయ్యం చేపను ఇంతవరకు వారెప్పుడూ చూడలేదు. ఈ మధ్యే మొదటిసారిగా ఈ దెయ్యం చేపను చూడగలిన శాస్త్రవేత్తలు ఈ చేపను వీడియో తీసేరు. ప్రపంచం ముందు ఉంచేరు. ఈ దెయ్యం చేపను చూసి అందరూ ఆశ్చర్యపోయేరు. బహుశ ఈ చేప యొక్క శరీర ఆకారమే ఈ చేపను అంత నీటి వేగాన్ని తట్టుకునేలా చేయగలుగుతోందని తమ అభిప్రాయాన్ని వెలిబుచ్చేరు.

వీడియో

1 comment: