Sunday, June 5, 2016

సౌర విద్యుత్ శక్తిని ఉచితంగా ఇస్తున్న చిలి దేశం.....ఫోటోలు

సూర్యరశ్మి వేడి నుండి జనించే శక్తే సౌరశక్తి. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా సౌర శక్తిని జనింప చేయవచ్చు.ఇది ఎన్నటికి తరగని నిధి వంటిది. ఈ నిధిని వినియోగించుకోవాలంటే సాంకేతిక పరిజ్ఞానంతో పాటు పర్యావరణ తృష్ణ, సామాజిక స్పృహ కూడా కావాలి. సౌరశక్తి వినియోగం 2000 ఏళ్లకి పూర్వమే మనుషులకి తెలుసు.

సౌరశక్తి చేత నీళ్ల స్వేదనీ కరణ చేయడం సౌరశక్తి ప్రయోజనాలలో అత్యంత విలువైన ప్రయోజనం. ఇలాంటి ప్లాంట్ ని మొట్టమొదట లాస్ సలినాస్ 1872 లో చిలీ దేశంలో ఉన్న ఓ ఊరికి మంచి నీటిని సరఫరా చెయ్యడం కోసం సౌరశక్తి చేత నీళ్ల స్వేదనీ కరణ ప్లాంట్ ను నిర్మించాడు. అద్దంతో కప్పబడ్డ 60 ఆవిరి బట్టీలు రోజుకి 25,000 లీటర్ల మంచి నీటిని అందించేవి. ఇలాంటి ప్లాంట్ లు స్వేదన ప్రక్రియ మీద ఆధారపడి పని చేస్తాయి. ఎండ వేడికి నీరు ఆవిరవుతుంది. ఆవిరైన నీటిని తిరిగి చల్లార్చితే ఉప్పు తొలగింపబడ్డ శుద్ధ జలం మిగులుతుంది. ఆ విధంగా మంచి నీటిని కూడా తయారుచేసుకోవచ్చు.

సూర్య రశ్మిని సౌర శక్తిగా మార్చుకొని దాని నుండి విద్యుఛ్చక్తి ని తయారు చేసుకోవచ్చు ఇందుకు రెండు పద్ధతులు ఉన్నాయి. 1) ఫోటోవోల్టాయిక్ విధానం. 2) సన్ ట్రాకర్ విధానం. ఫోటో వోల్టాయిక్ విధానాన్ని ఉపయోగించి సూర్య రశ్మి నుండి నేరుగా విద్యుఛ్చక్తి ని తయారు చేసుకోవచ్చు. సోలార్ సెల్ ను సిలికాన్ తో తయారు చేస్తారు. దీనివల్ల ఎక్కువ సూర్య రశ్మిని విద్యుత్తు గా మార్చుకోవచ్చు.

ఇప్పుడు చిలీ దేశంలో సౌర విద్యుత్ తయారీ ఎక్కువగా ఉన్నందువలన స్సౌర విద్యుత్ ను ఉచితంగా ఇస్తున్నారట.

No comments:

Post a Comment