Tuesday, June 7, 2016

టైం ట్రావల్ రుజువు...?...ఫోటోలు మరియు వీడియో

ఐఫోన్ 350 సంవత్సరాలకు ముందే కనుగొనబడిందా!

క్రింద మీరు చూస్తున్న మొదటి చిత్రం 1670 వ సంవత్సరం పీటర్ డీ హుచోకా అనె పైంటింగ్ కళాకారుడు వేసిన పైంటింగ్. అప్పట్లో ఈ పైంటింగుకు పేరు “ఒక మొగ మనిషి ఒక ఆడ మనిషికి ఉత్తరం అందిస్తున్నాడు”...కానీ ఇప్పుడు ఈ పైంటింగును “టైం ట్రావల్ మనిషి ఐఫోన్ పట్టుకోనున్నాడు” అని పిలుస్తున్నారు.

పత్రికా విలేఖర్లోతో మాట్లాడుతూ "1600 లోనే వేసిన ఈ పైంటింగ్ చూసిన తరువాత టైం ట్రావల్ సాధ్యమే నని నమ్ముతున్నాను. పైంటింగ్ లో ఆ మనిషి చేతిలో ఉన్నది ఐఫొనే" అని ఆపిల్ సంస్థ సి.ఈ.ఓ.టిం కుక్ తెలిపేరు. "మేము ఐఫోన్ కనుకున్నప్పుడు మేమే సెల్ ఫోన్లను కనుకున్న మొదటి వ్యక్తులం అని అనుకునే వాడిని. ఈ పైంటింగ్ చూసిన తరువాత నాకు అలా అనిపించడంలేదు" అని కూడా తెలిపేరు.

నెదర్లాండ్ దేశంలో ఒక సెమినార్ కు వెళ్ళినప్పుడు ఆపిల్ సి.ఈ.ఓ. టిం కుక్ ఈ పైంటింగును విరామం తీసుకున్న ఆ దేశ రాజకీయ నాయకుడు Neelie Kroes ఇంట్లో చూడటం జరిగింది.


రెండో ఫోటో: 1950 లో విడుదలైన Time travel in 1938 అనే సినిమాలో ఒకామె సెల్ ఫోన్ మాటాలడుతున్నట్లు చూపించేరు.


ఈ క్రింది వీడియోలలో మరికొన్ని రుజువులు చూడవచ్చు.

1 comment:

 1. తాయిలం ట్రే 'వల :)


  కాల గమనమున వెనుకకు
  మేలుగ బోవన్ జిలేబి మేలు బిలేజీ !
  వీలుగ గాంచెను తనువున్
  వాలు కనుల సుందరాంగి అయిఫోనగుచున్ !


  చీర్స్
  జిలేబి

  ReplyDelete