Monday, June 27, 2016

అక్షరధామ్: ప్రపంచంలోనే అతిపెద్ద హిందూదేవాలయం...ఫోటోలు


అక్షరధామ్ భారతదేశ రాజధాని నగరమైన కొత్తఢిల్లీలో, దాదాపు వంద ఎకరాల సువిశాల భూభాగంలో నిర్మితమైన హిందూ దేవాలయాల సముదాయం. ఈ భవనం నిజాముద్దీన్ వంతెనకు కొంత దూరంలో "నొయిడా క్రాసింగ్" వద్ద యమునా నది తీరాన మహొన్నంతంగా వెలసి, పర్యాటకుల్ని, ఆధ్యాత్మికవాదులను, ప్రాచీన సంస్కృతీ వారసత్వారాధకులను సమంగా అలరిస్తోంది. అక్షరధాంలో ఆలయంతో పాటుగా, ఒక స్మారక భవన సముదాయం, ఒక విద్యా ప్రభోధ కేంద్రం, జ్ఞాన ప్రకాశ నిలయం ఉన్నాయి. అక్షరధామ్ సంప్రదాయక కళ, భవన నిర్మాణ పరిజ్ఞానం, భారతీయ సంస్కృతీ నాగరికతలు, ప్రాచీన నైతిక విలువలు, విజ్ఞానాల్ని ఉత్తమ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సృజనాత్మంకంగా మేళవించిన తీరుకు ప్రతీక.

అక్షరధామ్ సముదాయం అంటే పరమాత్ముని శాశ్వత, అవినాశ నిలయం. వేదాలలో,ఉపనిషత్తులలో నిర్వచించబడిన శాశ్వత విలువలు, శాశ్వత సుగుణాలకు నెలవు. ఆ స్మారక భవన సముదాయం యొక్క పూర్తిపేరు "స్వామి నారాయణ్ అక్షరధామ్".

అక్షరధామ్ వంద ఎకరాల భూభాగం హృదయస్థానంలో భక్తిద్వార్, మయూర్ ద్వార్ అనే రెండు పెద్ద గేట్ల రక్షణతో బృహత్ సౌధంలా విరాజిల్లుతుంటుంది. అక్షరధామ్ స్మారక భవనం, పలు గుమ్మటాలతో, 141 అడుగుల ఎత్తు, 316 అడుగుల వెడల్పుతో, 370 అడుగుల నిడివితో చూపరులను దిగ్బ్రాంతికి లోనుచేస్తుంది.

ఎర్రటి ఇసుకరాళ్ళతో నిర్మించబడి, 1660 స్తంభాలతో అలరారే రెండస్తుల "పరిక్రమ" స్మారక భవనాన్ని కంఠాభరణంలా చుట్టివుంటుంది. దాని నిడివి దాదాపు రెండు కిలోమీటర్లు. 145 కిటికీలతో , 154 శిఖరాలతో అది అలరారుతుంటుంది. ఈ ఆలయం ప్రపంచంలోనే అతిపెద్ద హిందూదేవాలయంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది.

141 అడుగుల ఎత్తుతో అలరారే అక్షర్ ధామ్ ఆలయం పురాతన నిర్మాణ శైలికి అద్దం పడుతుంది. ఆలయం గర్భగుడిలో 11 అడుగుల స్వామి నారాయణ్ మూర్తి. చెప్పుకోదగింది. ఆలయం మొత్తం రాజస్థానీ సంప్రదాయాలకు అనుగుణంగా నిర్మించబడింది. ఆలయంలో నర్తకీమణులు, సంగీత విద్వాంసులు, కవులు, శిల్పకారుల చిత్తరువులు చూపరుల్ని కట్టిపడేస్తాయి.

7 comments:

 1. అక్షర్ ధాం పురాతన శైలిలో ఉండదు.ఆధునిక శైలిలో శిల్పాలన్నీ పోతపోసినవి తెచ్చి అతికించారు. ఇది హిందూ దేవాలయం కూడా కాదు. దేవుళ్ళందరినీ తలో మూలకీ విసిరేసి సెంటర్లో స్వామి నారాయణ్ కూర్చున్న విగ్రహం ఉంటుంది. హిందువులకు ఆలోచనా శక్తి లేదు కనుక ఇటువంటి ఆలయాలను కట్టగలుగుతున్నారు. అది గిన్నిస్ కి ఎక్కినా సామాన్యుడికి ఒరిగేదేమీలేదు.

  ReplyDelete
 2. తాజ్ మహల్ కన్నా అక్షరధాం బాగుంట్టుంది. ఎంతో ఊహించుకొని పోయిన తాజ్ మహల్ తీరా చూసేటప్పటికి ఓస్ ఇంతేనా అనిపిస్తుంది. అక్కడ ఐ-మాక్స్ థియేటర్ లో స్వామి నారాయణ్ జీవితం పై తీసిన సినేమా చూడవచ్చు. డిస్నిలాండ్ లో కొన్ని షోలకి థీం ఉంట్టుంది. జురాసిక్ పార్క్ సినేమాలో అడవిలో పోతున్నట్లు సెట్టింగ్ వేసి మనలను వాటర్ బోట్ లో తీసుకుపోతు చూపిస్తారు. అటువంటిదే అక్షరధాం లో హిందూ సంస్కృతి ఎలా మొదలైందో మొదలుపెట్టి ప్రస్తుత సమాజం వరకు ఒక వాటర్ బోట్ లో తీసుకుపోతూ చూపిస్తారు. వీటితో పాటుగా కేంటిన్ లో మంచి తిండి దొరుకుతుంది. కొంచెం డబ్బు ఖర్చు అయినా డిల్లిచుట్టుపక్కల రాష్ట్రాల మధ్యతరగతి వారికి మంచి అనుభూతినిచ్చే ప్రదేశం అక్షరధాం.


  అలాగే గుర్గావ్ లో ఉండే కింగ్ డం ఆఫ్ డ్రీంస్ కూడా చాలా బాగుంట్టుంది.

  Kingdom of Dreams is India's first live entertainment, theatre and leisure destination.

  http://www.kingdomofdreams.in/culturegully.html

  ReplyDelete

 3. కింగ్ డం ఆఫ్ డ్రీంస్ లో జంగూరా అనే చాలా ఫేమస్ షో అందులో కొన్ని ఏళ్లుగా కంటిన్యుస్ గా ప్రదర్సిస్తూన్నారు.

  Zangoora – The Gypsy Prince.

  India's answer to Broadway, Zangoora The Gypsy Prince - The biggest bollywood musical ever. Introducing a brand new genre of entertainment where storytelling & Bollywood style song & Dance meet stagecraft and technical wizardry like never seen before.

  https://tickets.kingdomofdreams.in/zangoora

  ReplyDelete
 4. తాజ్ మహల్ కీ అక్షర్ ధాం కీ పోలిక ఎందుకండీ ? అక్షర్ ధాం సమాధి కూడా కాదు.మీరు చెప్పినట్లు బోట్ రైడ్ బాగుంటుంది.మాలాంటివాళ్ళకి స్వామి నారాయణ్ చరిత్ర తెలియదు. కొబ్బరి చిప్పా,లడ్డూ,పులిహోర లేకపోతే (గుజరాతీ ఖమన్ తినాల్సి వచ్చింది) హిందూ దేవాలయం అని అనాలంటే మనసొప్పడం లేదు.

  ReplyDelete
  Replies
  1. తాజ్ మహల్ ను చిన్నపుడు పుస్తకాల్లో, పెరిగి పెద్దయ్యాక ఏ దేశాధ్యక్షుడు వచ్చినా అక్కడికి వెళ్ళి అహో ఓహో అనే వారు. దానిని మీడీయాలో చాలా హైప్ చేస్తూ రాస్తారు. ఆ విషయాలు చదివి మనం ఎక్కువగా ఊహించుకొంటాం కదా! నేను ముందుగా అక్షరధాం చూశాను, ఆ కళ్లతో తాజ్ మహల్ చూస్తే తేలిపోయిందండి. అసలికి తాజ్ మహల్ కి అంత హైప్ ఎందుకు క్రియేట్ చేశారో అర్థంకాలేదు. దేశం లో దానికి మించిన కట్టడాలు ఎన్నో ఉన్నాయి.

   తాజ్ మహల్ సమాధి అయినా సమాధి కోసం ఎవరు పోయిచూడటంలేదు. అద్భుత కట్టడం అని వెళ్ళిచూస్తున్నారు కదా! ఆ దృష్టి తో చూసినపుడు నాకు అక్షర ధామే నచ్చింది.


   ఈసారి మీకు వీలుచిక్కితే కింగ్ డం ఆఫ్ డ్రీం కు వెళ్లండి. చాలా బాగుంట్టుంది. జావేద్ అక్తర్ రాసిన ఝంగూర నాటకం 2.30 గంటలు పాటలతో,ఫైటింగ్ లతో చాలా బాగుంట్టుంది.

   ఇక అక్షరధాం సౌత్ లో దేవాలయాల వలే పూజలు ఉండవు. మాములు దేవాలయలకు భిన్నంగా గుజరాత్ సంస్కృతి ప్రతిభింబిస్తూంట్టుంది. అక్కడి శిల్పాలు, వాటి డిజైన్ ఎంతో బాగుంది. అదొక వెరైటి.

   Delete
 5. ఐశ్వర్యా రాయ్ ని ముందు చూసాను కాబట్టి కత్రినా కైఫ్ నచ్చదు అని మీరు అంటుంటే నేను ఏమి చెప్పేది ? కత్రినా కత్తిలా ఉంటుంది. ఎవరిని ఎలాగ చూడాలో అలాగే చూడాలి.(ఒకరితో ఒకరిని కంపేర్ చేస్తే పెళ్ళే కాదు) Just kidding

  మీరు ఒక విషయం తెలుసుకోవాలి. ఆలయాలు పనీ పాటా లేనివాళ్ళు కట్టిన కట్టడాలు కాదు. మన సంస్కృతిని తరతరాలు గుర్తుంచుకునేలా ఎంతో శ్రద్ధతో, ఎంతో శ్రమతో, ఎంతో ఖర్చుతో తీర్చిదిద్దుకున్న అపురూప తీర్ధ స్థలాలు.

  ఇక్కడ నేను చెప్పిన పాయింట్ ఏమిటంటే స్వామి నారాయణ్ టెంపుల్ పురాతన శైలిలో లేదు అని. ఆలయం బాగులేదని నేను అనలేదు. ఎంతో మంది చేతితో చెక్కిన శిల్పాలకూ మెషిన్ కటింగ్ తో చేసిన శిల్పాలకూ తేడా ఏమీ లేదు అని మీరు వాదించదలుచుకుంటే నేను ఏమీ చెయ్యలేను.

  తాజ్ మహల్ ని గైడ్ సహాయంతో చూసి ఉంటే మీకు ఆ కట్టడం విలువ తెలిసేది.ఒక్కొక్క అక్షరం ఒక్కొక్కరకం జాతి రాళ్ళతో చేతితో చెక్కారు.
  అసలు స్థల సేకరణే ఒక అద్భుతం,ఒక హిందువు ఉచితంగా స్థలమార్పిడికి అంగీకరించారు.హిందువుల కలశం గుర్తు తాజ్ పై ఉంటుంది.ఓం గుర్తు ఉంటుంది.జోధాబాయి వల్ల తరువాతి తరాలకు హిందువులపై శతృత్వం లేదు గానీ ఔరంగజేబ్ తర్వాత శతృత్వం పెరిగింది.ఎందుకన్నది నాకు తెలియవలసి ఉంది.

  ReplyDelete
 6. అక్షరధాం అద్భుతంగా ఉంటుంది.
  కాని అక్షరధాం, ఇస్కాన్ లాంటి వాటిని దేవాలయాలు అనేకంటే పర్యాటక ప్రదేశాలు అంటే బాగుంటుందేమో!

  ReplyDelete