Saturday, May 7, 2016

అంతిమ సన్మాన గౌరవం: బౌద్ద సన్యాసిని మమ్మిచేసి బంగారు రేకుతో చుట్టిపెట్టిన చైనీయులు....ఫోటోలు

Fu Hou అనే బౌద్ద మత సన్యాసి తన 102 ఏట 2012లో మరణించేరు. తన 13 వ ఏట బౌద్దమతానికి తనని అంకితం చేసుకుని, Chongfu అనే బౌద్దమత గుడిలో తన సేవలు మొదలుపెట్టేడు. నిదానంగా ప్రజల మన్నన పొందిన ఈయన తన సేవలను నిరంతరం భక్తులకు అందించేడు. ఈయనంటే అక్కడి ప్రజలకు విపరీత గౌరవం ఏర్పడింది. ఈయనను బౌద్దమత గురువులుగా అక్కడి ప్రజలు పూజించేరు. ఈయన చనిపోవటానికి ముందు తన శరీరాన్ని బద్రపర్చవలసిందిగా కోరేడు. ఈయన చనిపోయిన వెంటనే ఆయన శరీరాన్ని ఇద్దరు మమ్మిల నిపుణులను పిలిచి ఒక పెద్ద కుండలో కూర్చోబెట్టినట్లు ఉంచి బద్రపరచేరు. మూడేళ్ళ తరువాత ఆయన శరీరాన్ని బయటకు తీసేరు. చెక్కు చెదరని ఆ శరీరాన్ని బంగారు రేకుతో చుట్టి అదే బౌద్ద మత దేవాలయంలో భక్తుల దర్శనార్ధం శిలలా ఉంచేరు.

No comments:

Post a Comment