Friday, May 20, 2016

ప్రపంచంలోనే అతి పెద్ద ఓడ...ఫోటోలు మరియు దాని విశేషాలు

ఓడ పేరు 'హార్మొనీ ఆఫ్‌ ది సీస్‌' ప్రపంచంలోనే అతి పెద్ద క్రూజ్‌ షిప్‌. అంటే ప్రయాణికుల ఓడన్నమాట. 6,780 మంది ప్రయాణించగలరు. 2100 మంది సిబ్బంది ఉంటారు! నౌకలో 12000 మొక్కలతో పెద్ద తోటను పెంచారు! 18 అంతస్తుల ఎత్తున్న ఈ ఓడలో పెద్దపెద్ద రాజసౌధాలనే తలదన్నే విలాసాలు ఉన్నాయి. ఇందులో 2,747 గదులున్నాయి!సముద్రంపై అత్యంత వేగవంతమైన ఇంటర్నెట్‌ ఈ ఓడలో ఏర్పాటుచేశారు!బోట్‌లు సర్వ్‌ చేసే రెస్టారెంట్లు, అతిథులు విందారగించడానికి 20 డైనింగ్‌ ప్రాంతాలు ఉన్నాయి. పిల్లలకు, పెద్దలకు వినోద కేంద్రాలు ప్రత్యేకంగా ఉన్నాయి. 2,27,700 టన్నుల బరువున్న ఈ ఓడకు వేయడానికి 5,00,000 లీటర్ల పెయింట్‌ అవసరమయ్యింది. 9,70,000 చదరపు అడుగుల కార్పెట్‌ కావాల్సి వచ్చింది. ఈ మధ్యే నీటిపై ప్రవేశించింది. త్వరలో పరీక్షించనున్నారు. తర్వాత దేశదేశాలకు రాకపోకలు సాగిస్తుంది. ఓడ 1187 అడుగుల పొడవుంది. అంటే దీన్ని నిలబెడితే ఈఫిల్‌ టవర్‌కన్నా 150 అడుగులు ఎక్కువుంటుంది. ఈ ఓడలో పేద్ద ఈతకొలనే కాదు, జర్రున జారిపోవడానికి వాటర్‌ స్త్లెడ్‌లు కూడా ఉన్నాయి.ఇందులో రెండు రాక్‌ క్త్లెంబింగ్‌ వాల్స్‌, జిప్‌ లైన్‌ రైడ్‌, ఐస్‌ స్కేటింగ్‌ రింక్‌, బాస్కెట్‌ బాల్‌ కోర్టు, మినియేచర్‌ గోల్ఫ్‌ కోర్స్‌ ఉన్నాయి!

No comments:

Post a Comment