Monday, May 2, 2016

నేపాల్ దేశంలో కుక్కల పండుగ....ఫోటోలు

కుక్క మానవుడు మచ్చిక చేసుకున్న మొట్టమొదటి జంతువు. సుమారు 14,000 సంవత్సరాల కిందటే ఇది మనిషి తో కలిసి జీవించడం నేర్చుకుంది. డెన్మార్క్, జెర్మనీ, చైనా మరియు జపాన్ దేశలలో దొరికిన పురాతన అవశేషలను పరిశీలిస్తే, కుక్కకు ఆ రొజుల్లో ఉన్న ప్రాముఖ్యత అర్థమౌతుంది.కుక్కలు అత్యంత నమ్మకంగల జంతువు.

ప్రతి కుక్కకూ ఒక రోజు వస్తుందని ఇంగ్లీషు సామెత. నిజమే కానీ.. కుక్కల కోసం ఒక రోజును డెడికేట్ చేసిన దేశం ఉంది తెలుసా.. అంతే కాదు.. ఆరోజు తమ పెంపుడు కుక్కలకు పూజలు కూడా చేస్తారు. ఈ వింత ఆచారం మన పొరుగున ఉన్న నేపాల్ లో ఉంది.

ప్రతి ఏటా నేపాల్ లో జరిగే.. తిహర్ పండగ సందర్భంగా నేపాల్ వాసులు తమ పెంపుడు కుక్కలను పూజిస్తారు. నేపాలీల ముఖ్య మైన పండుగల్లో తిహర్ ఒకటి. మన దేశంలో దీపావళిని పోలి ఉండే ఈ పండుగను నాలుగు రోజుల పాటు నిర్వహిస్తారు. ఈ ఉత్సవాల్లో రెండో రోజును కుక్కల కోసం కేటాయించారు. దీన్నే 'కుకుర్ తిహర్' గా వ్యవహరిస్తారు. మనుషులకు అత్యంత విశ్వాస పాత్రమైన ఈ నాలుగు కాళ్ల జీవిని ఈ సందర్భంగా గౌరవించుకుంటారు.

1 comment:

  1. అంతా బాగానే ఉంది కానీ కుక్కులు కరిచి చిన్నా పెద్దా అవస్థలు పడుతున్నారు దానికేమంటారు

    ReplyDelete