Tuesday, May 31, 2016

800 మీటర్ల ఎత్తైన కొండ ఎక్కి స్కూలుకు వెడుతున్న పిల్లలు....ఫోటోలు మరియు వీడియో

చైనా దేశంలోని ఒక గ్రామంలో పిల్లలు స్కూలుకు వెళ్ళటానికి 800 మీటర్ల కొండను ఎక్కాలట. ఎటువంటి బద్రత లేకుండా గ్రామ ప్రజలే అమర్చుకున్న చెక్క నిచ్చేనలను ఎక్కి వెడుతున్న పిల్లలను చూస్తుంటే ఒక పక్క ఆ పిల్లలకు చదువుమీద ఎంత శ్రద్ద ఉందో తెలుస్తున్నప్పటికీ, పిల్లలకు ఎప్పుడు ఏం జరుగుతుందో అని భయంతో గడుపుతున్న ఆ పిల్లల తల్లితండ్రుల ఆవేదనను ఎవరు అర్ధం చేసుకుంటారో తెలియటం లేదు. ప్రభుత్వం ఈ మధ్యే కళ్ళు తెరిచి ఆ పిల్లల చదువులకు వేరే ఏర్పాట్లు చేస్తామని చెబుతున్నారు.


వీడియో

No comments:

Post a Comment