ఈ బ్లాగ్ మూలముగా మీరు ప్రపంచములో జరుగుతున్న/జరిగిన ముఖ్య విషయములను తెలుసుకొన వచ్చును NEWS/POLITICS/CURRENT AFFAIRS/ENTERTAINMENT/SCIENCE/HEALTH/EVENTS/SPORTS
Saturday, April 30, 2016
తీవ్ర నీటి కటకటతో తల్లడిల్లిపోతున్న లాథూర్....ఫోటోలు
మొత్త భారతదేశం తీవ్ర నీటి కటకటతో తల్లడిల్లిపోతోంది. కొన్నిదశాబ్దాలుగా ఎన్నడూ ఎదుర్కొనని దుర్భిక్ష పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఎండలు మండిపోతున్నాయి. అసలే దాహార్తితో ఇక్కట్ల పాలవుతున్న జనం మండే ఎండలతో మరింత కష్టపడుతున్నారు.
మహారాష్ట్ర తీవ్ర నీటి సంక్షోభంతో కటకటలాడుతోంది. రైళ్లలో మంచినీరు సరఫరాచేయాల్సిన దుస్థితి ఏర్పడింది. లాథూర్ తదితర ప్రాంతాల్లో చుక్క నీరు దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు. కరవు విలయతాండవం చేస్తున్నది. మహారాష్ట్ర సర్కారు ప్రత్యేక రైళ్లలో నీటిని తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణం వరుసగా రెండేళ్ల పాటు వర్షాభావం, రుతుపవనాల వైఫల్యం. అంతే కాకుండా నీరు ఎక్కువగా ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా నీటిని వినియోగించుకోవడంతో భూగర్భ జలాలు అడుగంటి, ప్రస్తుతం కనీసం మంచినీళ్లకూ కరువు ఎదురైందని నిపుణులు చెబుతున్నారు.
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment