Tuesday, April 5, 2016

ప‌నామా పేపర్స్: పెద్ద‌ల‌ను వ‌ణికిస్తున్న న‌ల్ల‌డ‌బ్బు....ఫోటోలు

న‌ల్ల‌డ‌బ్బు కొంత మంది పెద్ద‌ల గుండెల్లో ద‌డ పుట్టిస్తోంది. ప‌నామాలోని ప్ర‌ముఖ లా సంస్థ మొస్సాక్ ఫోన్సికా బ్లాక్ మ‌నీకి చెందిన కొన్ని ప‌త్రాలు లీక్ అయ్యాయి. స‌మాజంలో గౌర‌వ‌ప్ర‌ద‌మైన హోదా లో ఉన్న కొంత మంది పెద్ద వాళ్ళ పేర్లు కోట్ల రూపాయ‌ల ప‌న్నుఎగ‌గొడుతున్న జాబితాలో ఉన్నాయి. జాబితాలో అమితాబ‌చ్చ‌న్‌, ఐశ్వ‌ర్య‌రాయ్ ల‌తో పాటు 500 మంది భార‌తీయుల పేర్లున్నాయి. ఇప్పుడు ఆన్ లైన్లో ఈ వార్త హ‌ల్ చ‌ల్ చేస్తోంది. ర‌ష్యా అధ్య‌క్షుడు పుతిన్‌, పాక్ మాజీ ప్ర‌ధాని ష‌రీఫ్ స‌న్నిహితులు,జాకీ చాన్‌,ఈజిప్టు మాజీ ప్రెసిడెంట్ గ‌డాఫి.సిరియా ప్ర‌స్తుత అధ్య‌క్షుడు బ‌ష‌ర్ ఆల్ అస‌ద్ వంటి వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ వ్య‌క్తుల పేర్లున్నాయి. ఈ లీగ‌ల్ సంస్థ నుంచి ల‌క్ష‌కు పైగా ప‌త్రాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఈ ప‌నామా ప‌త్రాలను ఇంట‌ర్నేష‌న‌ల్ క‌న్సార్ఫియం ఆఫ్ ఇన్వెస్టిగేష‌న్ జ‌ర్న‌లిస్ట్ అనే సంస్థ యేడాది పాటు ప‌రిశీలించి బ‌య‌ట‌పెట్టింది.




ఐస్ లాండ్లో ప్రెసిడెంట్ రాజీనామా చేయాలని నిరసనకు దిగిన ప్రజలు






1 comment:


  1. ఓహో !పనామ పేపరు!
    ఆహా ! ఐశ్వర్య రాయి అయ్యెను బకరీ !
    ఈ హాహా కారములను
    ఓ హోక్సుయనెన్ ! జిలేబి ఓరగ బొమ్మా !

    ReplyDelete