Sunday, April 17, 2016

ఎడారి జలాశయము చుట్టు నిర్మించబడిన గ్రామం...ఫోటోలు

దక్షిణ ఆమెరికా దేశమైన పెరు దేశంలోని ఒక ఎడారి జలాశయము చుట్టు హుక్కాచీనా అనే గ్రామం ఉన్నది. ఇది ఒక నిర్మించబడిన గ్రామంగా చెబుతారు. ఈ గ్రామాన్ని చూడటానికి పర్యాటకులు చాలామంది అక్కడికి వస్తారు. పెరు దేశ పురాణాలు పూర్వం ఒక రాకుమారి తనను వెంటాడుతున్న బంధిపోటు దొంగల నుండి రక్షించుకోవడానికి ఈ ఎడారి జలాశయములో దాకున్నదని, ఆ తరువత ఆమె ఆ జలాశయములో చనిపోయిందని, ఆమె ఆత్మను శాంత పరిచేందుకు ఆ జలాశయం చుట్టూ పచ్చని మొక్కలు వెలిసేయని, ఆ రాకుమారి ఆత్మ ఇంకా ఆ జలాశయంలో తిరుగుతున్నదని తెలియజేస్తున్నాయి.

రాకుమారి ఆత్మ సంగతి విషయం ఎంతవరకు నిజమో తెలియదు. కానీ ఎడారి జలాశయము చుట్టు నిర్మించబడిన ఆ అందమైన గ్రామాన్ని చూసి తీరాల్సిందే.

No comments:

Post a Comment