Tuesday, April 26, 2016

గండికోట: భారతదేశపు గ్రాండ్ కేనియన్....ఫోటోలు

గండికోట ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు తాలూకాలో పెన్నా నది ఒడ్డున గల ఒక చిన్న గ్రామం. ఇక్కడి ఎర్రమల పర్వత శ్రేణినే గండికోట కొండలని కూడా అంటారు. ఎర్రమల పర్వత శ్రేణికి, పర్వత పాదంలో ప్రవహించే పెన్నా నదికి మధ్య ఏర్పడిన గండి మూలంగా ఈ కోటకు గండికోట అనే పేరు వచ్చినట్లు స్పష్టమవుతున్నది. ఈ ఇరుకు లోయల్లో నది వెడల్పు 300 అడుగులకు మించదు. ఇక్కడి లోయ యొక్క సుందర దృశ్యం వర్ణనాతీతం. దట్టమైన అడవులు, మనోహరంగా కనిపించే భూతలం మధ్య ఎంతటి బలమైన శతృవుదాడినైనా ఎదుర్కొనడానికి ఈ కోట అనువుగా ఉంది. చుట్టూ లోతైన లోయలతో, ఎర్రటి గ్రానైట్ శిలలతో ఏర్పడిన దుర్బేధ్యమైన కొండలతో, 300 అడుగుల దిగువన పడమటి, ఉత్తర దిశలలో ప్రవహించే పెన్నా నదితో, కోట లోపలి వారికి బలమైన, సహజసిద్ధమైన రక్షణ కవచమేర్పడింది.

గండికోట వద్ద పెన్నానది

మాధవరాయ గుడి ప్రవేశద్వారము

మాధవరాయ గుడి లోపల

మాధవరాయ గుడి లోపల

మాధవరాయ గుడి

గండికోట జమా మసీదు

గండికోట చార్మినార్

గండికోట చరిత్ర

2 comments:

  1. గండికోట రహస్యం సినిమా కూడా వచ్చింది కదా... మనసుకు హాయి కలిగించే ఫోటోలు పంచుతున్నారు ధన్యవాదాలు.

    ReplyDelete