Tuesday, April 5, 2016

పట్టాలెక్కిన గటిమాన్ ఎక్స్ ప్రెస్...ఫోటోలు

భారతదేశ రైల్వే కొత్తపుంతలు తొక్కింది. రైల్వే చరిత్రలోనే అతి వేగవంతమైన రైలు “గటిమాన్ ఎక్స్ ప్రెస్” పట్టాలు ఎక్కింది. ఈ మిని బుల్లెట్ ట్రైన్ ఢిల్లీ హజరత్ నిజాముద్దీన్ నుంచి ఆగ్రాకు మధ్య 184 కిలోమీటర్లు. ఈ 184 కిలోమీటర్ల దూరాన్ని ఈ మిని బుల్లెట్ ట్రైన్ కేవలం 100 నిమిషాల్లో చేరుకోనుంది. ఈ రైలు గరిష్టంగా 160 కేఎంపీహెచ్ వేగంతో దూసుకెళ్తుంది. గటిమాన్ ఎక్స్ ప్రెస్ లో పలు ప్రత్యేకతలు ఉన్నాయి. ఇందులో ప్రయాణికులకు ఉచిత వైఫై ఉంటుంది. ఇందులో 12 కోచ్ లు, 2 ఎగ్జిక్యూటివ్ క్లాస్ లు,8 కార్ ఛైర్లు,2 ప్యాంట్రీ కోచ్ లు ఉన్నాయి. ప్రయాణికులను అప్రమత్తం చేసేందుకు ఆటోమేటిక్ అలారం సిస్టంలు ఉడటంతో పాటు అత్యవసరంగా రైలును ఆపే పద్ధతి కూడా ఉంది. ప్రతి కోచ్ కు ప్రత్యేకంగా తలుపులు అమర్చి ఉంటాయి,బయో టాయిలెట్స్, ఎల్ఈడీ లైట్స్, ట్రైన్ హోస్టెస్, ఇతర అధునాతన సౌకర్యాలు ఇందులో కలవు.











1 comment:


  1. గటిమాను రయిలు వచ్చెను
    పటిమ పెరిగె రయిలుబండి పట్టా లెక్కన్ !
    ఘటనా ఘటన సమర్థులు!
    చటచట సర్వీసు చాకచక్యము గూడన్ !

    ReplyDelete