Monday, April 18, 2016

పెన్నుతో రాసిన అక్షరాలు కావు....ఈ పులి నుదుటి మీద సహజంగా ఏర్పడిన అక్షరాలు...ఫోటోలు

భారతదేశంలో పులి ఫోటోలను మీరు ఎక్కడ చూసినా అవి చాలావరకు బెంగాల్ పులులవే అయ్యుంటాయి. ఎందుకంటే అవి ఫోటోలలో అద్భుతంగా కనిపిస్తాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న Kanha National Park లో ప్రతి సంవత్సరం వందాలాది ఫోటోగ్రాఫర్లు ఈ బెంగాల్ పులులను ఫోటోలు తీయడానికి ఈ పార్కుకు వస్తూ ఉంటారు. భారత దేశానికి చెందిన ఫోటోగ్రాఫర్ Sarosh Lodhi ఫోటోలు తీస్తుండగా అనుకోకుండా ఒక పులి నుదిటి మీద CAT అనే అక్షరాలు కనబడటం అతన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. అలా నుదుటి మీద CAT అని అక్షరాలు రాసున్న ఒక పులి ఉన్నదని చాలామంది చెప్పేరు. నేను ఫోటోలు తీయడానికి ఈ పార్కుకు వచ్చినప్పుడు, ఎప్పుడూ ఈ పులి కనబడలేదు. కధలు చెబుతున్నారని అనుకునే వాన్ని. కానీ ఆ పులి నిజంగా కనబడేసరికి నాకు నోటమాట రాలేదు. వెంటనే జాగ్రత్తగా, ఆ అక్షరాలు కనబడేలా ఫోటోలు తీసేను. ఆ ఫోటోలను అందరూ చూడాలని పత్రికలకు అందించేను" అని Sarosh Lodhi తెలిపేరు.

No comments:

Post a Comment