Friday, April 1, 2016

అంతర్జాలమును ఆహారం అడిగిన పిల్లి ద్వీపం....ఫోటోలు

జపాన్ దేశములోని పిల్లి ద్వీపం(Aoshima)లో మనుష్యుల కంటే పిల్లులే ఎక్కువ నివసిస్తున్నాయి. అందుకనే ఈ ద్వీపానికి పిల్లి ద్వీపం(Cat Island) అనే పేరు వచ్చింది. ఈ మధ్య ఏర్పడిన చెడు వాతావరణ పరిస్థితుల కారణంగా ఆ ద్వీపంలో ఆహార కొరత ఏర్పడ్డది. ఆహార కొరత ఏర్పడినందువలన అక్కడి ప్రజలు ఎంత దిగులు పడుంటారో మనం ఊహించుకోవచ్చు. ఏమి చెయ్యాలో తోచని అక్కడి ప్రజలు క్యాట్ ఐలాండ్ పేరుతో "ఆహారం" విరాళంగా పపించవలసిందిగా అంతర్జాలంలో కోరిక పెట్టేరు. అంతే, వెంటనే స్పంధించిన అంతర్జాల వాడుకదారులు అక్కడికి ఆహారం పంపించేరు. ఎంత పంపించేరు అని చూస్తే.....క్యాట్ ఐలాండ్ వారు అడిగినదానికన్నా మూడింతలు పంపేరు. ఎక్కువగా పంపబడ్డ ఆహారాన్ని బద్రపరుచుకున్నారు.

No comments:

Post a Comment