Monday, April 25, 2016

ఎర్త్ అవర్: భూమిని కాపాడుకుందాం...నేపాల్ దేశంలో 2015 ఏర్పడిన భూకంపంలో మరణించినవారికి నివాళులు....ఫోటోలు

భూ గోళం మండిపోతోంది. భానుడి భగభగలతో ధరణి దద్దరిల్లిపోతోంది. భూ దేవి అగ్గి బరాట అవుతోంది. ఆధునికత కొంప ముంచుతోంది. ఏసీలు, ఫ్రిడ్జ్ లు, కార్లు ఇతర ఎలక్ట్రానిక్ గూడ్స్ నుంచి వెలువడే క్లోరో , ఫ్లోరో, కార్బన్స్ ఓజోన్ పొరను క్రమంగా నాశనం చేస్తున్నాయి. ఫలితం సూర్య కిరణాలు నేరుగా నేలపై పడటంతో.. భూ తాపం అంతకంతకు పెరుగుతోంది. కారణమేదైనా పర్యావరణమే ప్రమాదంలో పడింది. గ్లోబల్ వార్మింగ్ జీవరాశి ఉనికికే విలన్ గా మారింది. అందుకే భూమిని కాపాడుకుందాం. పర్యావరణాన్ని రక్షించుకుందాం అంటూ పర్యావరణవేత్తలు ఎర్త్ అవర్ కు శ్రీకారం చుట్టారు. మార్చి 29 2007లో ఆస్ట్రేలియాలో ప్రారంభమైన ఎర్త్ అవర్ ప్రపంచదేశాలకు విస్తరించింది. ఒక్క దేశంలో ప్రారంభమైన మంచిపని ఇప్పుడు 7000 నగరాలు, పట్టణాల్లో విస్తరించింది. డబ్లుడబ్లుఎఫ్ ఆధ్వర్యంలో ప్రపంచవ్యాప్తంగా ఇదే రోజున రాత్రి 8.30 నుంచి 9.30 వరకు పవర్ కట్ చేసి ఎర్త్ అవర్ ను పాటిస్తున్నారు.

ఎర్త్ అవర్ లో మనమూ భాగస్వాములం అవుదాం. కనీసం ఒక గంటపాటైనా కరెంట్ కట్ చేసి… కొన్ని లక్షల టన్నుల కాలుష్య కారకాలకు చెక్ పెడదాం.

నేపాల్ దేశంలో ఈ సంవత్సరం జరిగిన ఎర్త్ అవర్ కార్యక్రంలో 2015 న భూకంపంలో మరణించిన 9,000 మందికి నివాళులు అర్పించేరు. భూకంపాలకు కూడా గ్లోబల్ వార్మింగ్ కారణమని వారు నమ్ముతున్నారు.










No comments:

Post a Comment