Saturday, April 30, 2016

తీవ్ర నీటి కటకటతో తల్లడిల్లిపోతున్న లాథూర్....ఫోటోలు

మొత్త భారతదేశం తీవ్ర నీటి కటకటతో తల్లడిల్లిపోతోంది. కొన్నిదశాబ్దాలుగా ఎన్నడూ ఎదుర్కొనని దుర్భిక్ష పరిస్థితి నెలకొంది. ఫలితంగా ఎండలు మండిపోతున్నాయి. అసలే దాహార్తితో ఇక్కట్ల పాలవుతున్న జనం మండే ఎండలతో మరింత కష్టపడుతున్నారు.

మహారాష్ట్ర తీవ్ర నీటి సంక్షోభంతో కటకటలాడుతోంది. రైళ్లలో మంచినీరు సరఫరాచేయాల్సిన దుస్థితి ఏర్పడింది. లాథూర్ తదితర ప్రాంతాల్లో చుక్క నీరు దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు. కరవు విలయతాండవం చేస్తున్నది. మహారాష్ట్ర సర్కారు ప్రత్యేక రైళ్లలో నీటిని తరలించాల్సిన పరిస్థితి ఏర్పడింది. కారణం వరుసగా రెండేళ్ల పాటు వర్షాభావం, రుతుపవనాల వైఫల్యం. అంతే కాకుండా నీరు ఎక్కువగా ఉన్నప్పుడు ఇష్టారాజ్యంగా నీటిని వినియోగించుకోవడంతో భూగర్భ జలాలు అడుగంటి, ప్రస్తుతం కనీసం మంచినీళ్లకూ కరువు ఎదురైందని నిపుణులు చెబుతున్నారు.

విలక్షణమైన నక్షత్ర మండలాలు....ఫోటోలు

పున్నమి వెన్నెల్లో, ఆరుబయట నింగికేసి చూస్తే... మిణుకు మిణుకుమంటూ కోటానుకోట్ల నక్షత్రాలు! ఓహ్... ఎంత అందమైన దృశ్యమది! మరి... ఆ నక్షత్రాలన్నింటి చుట్టూ మన సూర్యుడికి మల్లే గ్రహాలున్నాయా? ఒకవేళ ఉంటే.. వాటిల్లో మన భూమిని పోలినవి ఎన్ని? చిక్కు ప్రశ్నలేగానీ... శాస్త్రవేత్తలు ఇప్పుడిప్పుడే వీటికి సమాధానాలు తెలుసుకుంటున్నారు.

ఈ విశాల విశ్వంలో మనిషి, భూమి ఒంటరేనా? అన్న ప్రశ్న, సందేహం ఈనాటివి కాదు. యుగాలుగా అటు తత్వవేత్తలను, ఇటీవలి కాలంలో శాస్త్రవేత్తలను ఆలోచనల్లోకి పడేసినవే. కాకపోతే సాంకేతిక పరిజ్ఞానం పెరుగుతున్న కొద్దీ అపోహలు తొలగిపోతున్నాయి. కొత్తకొత్త విషయాలు తెలుస్తున్నాయి. నిన్నమొన్నటివరకూ సౌరకుటుంబానికి ఆవల అసలు గ్రహాలే లేవన్న భావన నుంచి సుదూర ప్రాంతాల్లో, ఖగోళపు అంచుల్లోనూ గ్రహ వ్యవస్థలు ఉన్నట్లు రూఢి అవుతున్న కాలమిది.

నాలుగేళ్ల సమయంలో దాదాపు 1,50,000 నక్షత్రాలు, వాటి పరిసరాలను పరిశీలించడం ద్వారా కొన్ని వేల గ్రహాలను గుర్తించేరు.

గ్రహాలన్నింటిలో జీవం ఉంటుందా? ఊహూ అవకాశం లేదు..."జీవం ఉండేందుకు అవకాశము ఉన్నది" అనే రెండు జవాబులు చెబుతున్నారు. ఇది తెలుసుకోవాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుందో?... వేచి చూడాలి.

Messier 82
Sunflower Galaxy
MACS J0717
Messier 74
Baby Boom Galaxy
Milky Way Galaxy
I Zwicky 18
NGC 6744
M60 & NGC 4647 – The galaxy couple
Messier 81
Triangulum Galaxy
Pandora's Cluster

Thursday, April 28, 2016

టీ తాగటం భారతీయులకు ఎంతో ఇష్టం...ఫోటోలు


దిక్సూచి సేవలను అందించే IRNSS-1G ఉపగ్రహం నింగికెగిసింది....ఫోటోలు

నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ స్పేస్‌ సెంటర్‌ షార్‌ నుంచి గురువారం మధ్యాహ్నం 12.50గంటలకు పోలార్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌-సి 33 వాహక నౌక నింగిలోకి దూసుకెళ్లింది. ఈ వాహక నౌక భారత దిక్సూచి వ్యవస్థలో చివరి ఉపగ్రహాన్ని మోసుకెళ్లింది. ఐఆర్‌ఎన్‌ఎస్‌ఎస్‌-1జి ఉపగ్రహం బరువు 1,425 కిలోలు. ఈ ఉప గ్రహం భూతల, ఆకాశ, సాగర దిక్సూచి సేవలను అందిస్తుంది.

Wednesday, April 27, 2016

మనిషి మొహ రూపమంతో పుట్టిన మేక....ఫోటోలు

మలేషియా దేశంలొని ఒక గ్రామంలో ఒక మేక పిల్ల పుట్టింది. ఆ మేక మనిషి మొహ రూపమంతో పుట్టడంవలన ఆ ఊరి ప్రజలంతా భయబ్రాంతులకు గురైయ్యేరు. కొన్ని గంటలలోపే ఆ మేక పిల్ల చనిపోయింది.కొంత మంది ఆ మేక పిల్ల కళేబరాన్ని ఎంత డబ్బు అయినా ఇచ్చి కొనుక్కోవడానికి సిద్ద పడ్డారు. కానీ ఆ మెక పిల్లకు సొంతదారుడైన ఇబ్రహిం అనే రైతు ఆ మేక కళేబరాన్ని ఇతరులకు అమ్మటానికి అంగీకరించలేదు. ప్రభుత్వ వెటనరీ ఆసుపత్రికి పరిశోధనల నిమిత్తం ఇచ్చేసేడు.

ఆ మేకకు సంబంధించిన వివరాలను ఇంతవరకు బయటపెట్టలేదు.


ఎంబ్రాయిడరీ మరో స్థాయికి....ఫోటోలు