Friday, March 18, 2016

చిన్న గుర్రం....పెద్ద మందు...ఫోటోలు


అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని క్రావిస్ అనే పిల్లల ఆసుపత్రికి చికిత్స గుర్రం తీసుకు వెళ్ళేరు. ఆ చికిత్స గుర్రం అతి చిన్నది. ఆ గుర్రమును ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పిల్లల దగ్గరకు తీసుకు వెడితే, పిల్లలు ఉత్సాహ పడతారని, ఆ గుర్రం చేసే చిన్న చిన్న విన్యాసాలు పిల్లలను ఆనందపరుస్తుందని....ఆ ఆనందం పిల్లలలోని వ్యాధులను త్వరగా తగ్గించేందుకు ఉపయోగపడుతుందని అక్కడ శాస్త్రవేత్తలు అభిప్రాయడుతున్నారు.

"అతి దగ్గరగా గుర్రలను చూడటం, వాటిని ముట్టుకోవటం స్వతహా పిల్లలకు ఆనందం కలిగిస్తుంది. అది కొంతమేరకు పిల్లలలోని వ్యాధులను తగ్గించేందుకు సహాయపడుతుంది" ఒక పిల్లల మనోతత్వ వైద్య నిపుణుడు తెలిపేడు.









ఏది ఏమైనా.......కొత్త రకం చికిత్సా విధానాలను ప్రోత్సాహపరచడంలో వారికి వారే సాటి.

credit: http://in.reuters.com/news/picture/little-horse-big-medicine?articleId=INRTSASPN

No comments:

Post a Comment