Tuesday, March 22, 2016

ఫోటోలు కావివి....పైంటింగ్లు

రష్యా దేశానికి చెందిన Alexey Butyrsky అనే ప్రొఫెషనల్ కళాకారుడు రాత్రి పూట పట్టణ జీవితాలు ఎలా ఉంటాయో కళాత్మకమైన ఫోటోలు వేసి చూపించేడు.ఆ పైంటింగులలో రాత్రిపూట ప్రజల మానసిక స్థితి ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇతను వేసిన పైంటింగులను రష్యా, ఇంగ్లాండ్ మరియు అమెరికా దేశాల పైంటింగ్ ఎక్జిబిషన్లలో ప్రదర్శనకు ఉంచేరు.
Monday, March 21, 2016

తినదగిన పూలరేకులను బద్రపరచిన లాలిపాప్....ఫోటోలు

తినదగిన కొన్ని పూవులను కీటకాలబారి నుండి మరియు పర్యావరణ కాల్యుష్య వాతావరణం నుండి కాపాడటానికి ఇండోర్ తోటలలొ పెంచి, ఆ పూవులను పొందుపరచి వాటితో లాలిపాప్ ను తయారుచేసి అమ్ముతున్నారు ఒక పెద్ద కంపెనీ. లాలిపాప్ ఖరీదు కూడా చాలా ఎక్కువే అయినా అవి చూడటాని అందంగా ఉండటంతో పిల్లలు ఇష్టపడుతున్నారట. పిల్లలకు కావలసిన పోషక పధార్ధాలు ఉండే పువ్వలనే లాలిపాప్ లో వాడుతున్నాం కాబట్టి అవి ఆరోగ్యానికి కూడా మంచిదని ఆ లాలిపాప్ ను తయారుచేసి అమ్ముతున్న కంపెనీ చెబుతున్నది......నిజంగానే ఇదొక అద్భుత మార్కెటింగ్ టెక్నిక్!


Sunday, March 20, 2016

చివరి గౌరవం: ఒక ఏనుగు అంత్యక్రియలు...ఫోటోలు

శ్రీలంక దేశంలో, ఒక బౌద్ద ఆలయంలో సేవలు అందిస్తున్న 23 సంవత్సరాల వయసున్న ఏనుగు హేమంత్ 6 నెలలుగా ఆనారోగ్యంతో బాధపడి చనిపోయింది. అక్కడి ప్రజలు ఆ ఏనుగును ఎంత ప్రేమతో చూసేరో ఈ టపాలో మీరు చూడబోయే ఫోటోల మూలం తెలుసుకోవచ్చు. మామూలుగా ఏనుగులు 60-70 ఏళ్ళు బ్రతుకుతాయి. అతి చిన్న వయసులోనే ప్రాణాలు పోగొట్టుకున్న ఆ యువ ఏనుగుకు అక్కడి ప్రజలు, బౌద్ద మత అధికారులు పెద్ద ఎత్తున సాంప్రదాయక పద్దతితో అంత్యక్రియలు జరపటం ఒక విషేషమే.Saturday, March 19, 2016

యువరాజు పుట్టేడని 1,08,000 మొక్కలు నాటిన దేశ ప్రజలు....ఫోటోలు

ప్రపంచంలోనే పర్యావరణ అనుకూల మరియు కార్బన్- ప్రతికూల దేశం, బూటాన్. తమదేశ యువరాజు పుట్టేడని ఆ దేశ ప్రజలు ఎలా పండుగ చేసుకున్నారో తెలుసా? కొన్ని వేల చెట్లను నాటి సంతోషించేరు.

ఆ రోజు 1,08,000 మొక్కలు నాటేరు.

భూటాన్ దేశ రాజ్యాంగంలో తమ దేశంలోని 60 శాతం భూమి ఎల్లప్పుడూ అడవి ప్రాంతంగానే ఉండాలేనే నిబంధన ఉన్నది. కాని యువరాజు పుట్టిన రోజున ఆ దేశ ప్రజలు పర్యావరణ పరిరక్షణ నిబద్ధత ప్రేరేపిత కారణంగా అలా చేయలేదు. "అన్ని జీవిత రూపాలకు చెట్లే పోషక ఆహారము అందజేస్తున్నాయి. అదే ప్రాణులను ఆరోగ్యంగా, అందంగా, దీర్ఘాయువుగా ఉంచుతూ కరుణ, జాలి, దయాభావాలకు సూచనగా ఉంటున్నాయి" అని బౌద్ధమతం చెబుతున్నది.

భూటాన్ దేశం ప్రపంచ పత్రికల ముఖ్యాంశాలలో చోటుచేసుకోవటం ఇది మొదటిసారి కాదు. 2015లో, ఒక గంటలొ 50,000 మొక్కలు నాటి గిన్నీస్ రికార్డు స్రుష్టించింది. బూటాన్ దేశం చిన్న దేశం అయ్యుండచ్చు. కానీ ప్రపంచ వాతావరణానికి పర్యావరణ అనుకూల పరిస్థితులను ఏర్పరచడంలో పెద్ద దేశం.