Wednesday, July 8, 2015

మూలవ్యాధి నివారణ దేవాలయం..... వివరణ మరియు ఫోటోలు

అసాధారణ దేవాలయాలు జపాన్ దేశములో చాలా ఉన్నాయి. అటువంటివాటిలో ఈ దేవాలయమూ ఒకటి.

ఒక దేవాలయం బాధాకరమైన వైద్య పరిస్థితిని నయం చేస్తుందా? మీ అంచనానే నా అంచనా.


నాకు తెలిసినదంతా పురాతన సంప్రదాయం ప్రకారం, మూలవ్యాధితో భాధ పడేవారు పక్కనున్న నదిలో శుభ్రంగా స్నానం చేసి, దేవాలయంలో ఉండే కోడి గుడ్డు ఆకారం గల విగ్రహం దగ్గర కోడి గుడ్డు నైవేద్యం పెట్టి ఆ కోడు గుడ్డును తిని వేనక్కి తిరిగి నిలబడి జపాన్ భాషలో ఒక మంత్రమును చదువుతూ ప్రార్ధన చేసుకోవాలి. అలా చేసుకున్న వారికి కొద్ది రోజులలోనే మూలవ్యాధి నుండి విముక్తి దొరుకుతుందట/దొరికిందట.



మూలవ్యాధి లేని వారు కూడా ఆ దేవాలయానికి వెళ్ళి ప్రార్ధన చేసుకుంటే వారికి మూలవ్యాధి రాదట.


సంవత్సరానికి ఒకసారి వచ్చే కిసాయ్(Kisai) పండుగనాడు వేలకొలది ప్రజలు ఈ దేవాలయానికి వస్తారాట. శతాబ్దాల తరబడి చేసుకుంటున్న ఈ పండుగను 1988 లో నిలిపివేసేరు. తిరిగి 2011 లో ఈ పండుగ పునరుద్ధరించబడింది. కారణం, ఊహింపని విధంగా జపాన్ ప్రజలలో మూలవ్యాధితో భాధపడేవారి సంఖ్య పెరిగిందట.

No comments:

Post a Comment