Thursday, July 9, 2015

వీటిని కూడా తెలుసుకుందాం(1)

1....ఇతియోపియా దేశంలో సంవత్సరానికి 13 నెలలు.

2....మొట్టమొదటి ప్లాస్టిక్ వంతెన కట్టిన దేశం స్కాట్ లాండ్.


భారతదేశం:


3....చదరంగం, ఆల్ జీబ్రా లెక్కల పద్దతి: ఈ రెండూ భారతదేశంలోనే కనుగొనబడ్డాయి.

4....ఆపరేషన్ చేసే ముందు ఇచ్చే మత్తుమందు(Anesthesia)ను కనుగొన్నది కూడా భారతదేశమే.


పవిత్ర గంగ:


5....భారతదేశంలోని పవిత్రమైన గంగా నదిలో 114 నగరాలలోని కాలువ నీరు, పరిశ్రమలలోనుండి వెలువడే కలుషిత నీరు: మొత్తం రోజుకు 900 మిల్లియన్ లిటర్ల కలిషిత నీరు కలుస్తోందట. ఇంగ్లాండుకు చెందిన ఒక బృందము ఇంత కలుషిత నీరు గంగలో కలుస్తున్నా, గంగలో స్నానం చేసే నీరు పరిశుభ్రంగా ఉండటం చూసి ఆశ్చర్యపోయేరు.


పసిఫిక్ మహాసముద్రం లోతు:


6....హిమాలయా పర్వతాల ఎత్తు 6,850 మీటర్లు. పసిఫిక్ మహాసముద్రంలో హిమాలయా పర్వతాలను ఉంచినా, ఇంకా 2,000 మీటర్ల ఎత్తుకు నీరు ఉంటుంది.

Wednesday, July 8, 2015

సింహల గుంపు దగ్గర నుండి పిల్లను కాపుడుకున్న గేదె.....వీడియో


మూలవ్యాధి నివారణ దేవాలయం..... వివరణ మరియు ఫోటోలు

అసాధారణ దేవాలయాలు జపాన్ దేశములో చాలా ఉన్నాయి. అటువంటివాటిలో ఈ దేవాలయమూ ఒకటి.

ఒక దేవాలయం బాధాకరమైన వైద్య పరిస్థితిని నయం చేస్తుందా? మీ అంచనానే నా అంచనా.


నాకు తెలిసినదంతా పురాతన సంప్రదాయం ప్రకారం, మూలవ్యాధితో భాధ పడేవారు పక్కనున్న నదిలో శుభ్రంగా స్నానం చేసి, దేవాలయంలో ఉండే కోడి గుడ్డు ఆకారం గల విగ్రహం దగ్గర కోడి గుడ్డు నైవేద్యం పెట్టి ఆ కోడు గుడ్డును తిని వేనక్కి తిరిగి నిలబడి జపాన్ భాషలో ఒక మంత్రమును చదువుతూ ప్రార్ధన చేసుకోవాలి. అలా చేసుకున్న వారికి కొద్ది రోజులలోనే మూలవ్యాధి నుండి విముక్తి దొరుకుతుందట/దొరికిందట.మూలవ్యాధి లేని వారు కూడా ఆ దేవాలయానికి వెళ్ళి ప్రార్ధన చేసుకుంటే వారికి మూలవ్యాధి రాదట.


సంవత్సరానికి ఒకసారి వచ్చే కిసాయ్(Kisai) పండుగనాడు వేలకొలది ప్రజలు ఈ దేవాలయానికి వస్తారాట. శతాబ్దాల తరబడి చేసుకుంటున్న ఈ పండుగను 1988 లో నిలిపివేసేరు. తిరిగి 2011 లో ఈ పండుగ పునరుద్ధరించబడింది. కారణం, ఊహింపని విధంగా జపాన్ ప్రజలలో మూలవ్యాధితో భాధపడేవారి సంఖ్య పెరిగిందట.

Tuesday, July 7, 2015

9 అంకెకు ఉన్న ముఖ్యత్వం


1....చైనాలో 9 ని అదృష్ట అంకెగా భావిస్తారు.

2....ఆస్కార్ బిరుదు బొమ్మ బరువు 9 పౌండ్లు.

3....ఇరాన్-ఇరాక్ మధ్య జరిగిన యుద్దం 9 సంవత్సరాలు జరిగింది.

4....అంగారక గ్రహంలో సంవత్సరంలో 9 నెలలు పగలు.

5....సూర్య కిరణాలు భూమిని తాకటానికి 9 నిమిషాలు పడుతుంది.

6....యూనైటడ్ నేషన్స్(U.N)లో ఉన్న సుప్రీం కోర్టులోని జడ్జీల సంఖ్య 9.

7....పౌర్ణమి రోజున చంద్రుడు మామూలు కంటే 9 రెట్లు కాంతివంతముగా ఉంటాడు.

8....బౌద్ద మతంలో, మత సంబంధిత ఆచారాలు జరపడానికి 9 మతాధిపతులు ఉండాలి.

9....పిజ్జా టవర్లో 9 అంతస్తులు ఉన్నాయి.

ధైర్యమైన మేక...వీడియోజోక్స్

జోక్స్

1) డాక్టర్:..... నిద్ర పోవడానికి అవస్త పడుతున్నారని చెప్పేరు కదా.ఈ మాత్రలు వాడండి.

పేషంట్:..... రోజూ ఒక మాత్రే వేసుకోవాలా?

డాక్టర్:.... ఓక మాత్ర వేసుకుంటే నిద్ర వస్తుంది. ఎక్కువ వేసుకుంటే మోసుకెళ్ళటానికి నలుగురు వస్తారు.


*********************************************************************************

2) టి.టి.ఇ :.... ఏమిటిది? ప్లాట్ ఫారం టికెట్టుతో విజయవాడ వెడుతున్నావు.

ప్యాసింజర్:.... ఏం...విజయవాడలో ప్లాట్ ఫారం లేదా?


**********************************************************************************************

3) ఇల్లాలు భర్తతో:.... పనిచేసేటప్పుడు నడుము గిల్లకండి అని ఎన్ని సార్లు చెప్పాలి?

పనిమనిషి: .....బాగా బుద్ది వచ్చేటట్టు చెప్పండమ్మగారు. నేను చెప్పి, చెప్పి అలసిపోయేను
.