Thursday, January 1, 2015

ఆకాశ సైకిల్---తొక్కి నడిపే రోలర్ కోస్టర్.....ఫోటోలు

జపాన్ దేశములోని ఓకయామా నగరంలో తొక్కి నడిపే రోలర్ కోస్టర్ నిర్మించేరు. మామూలుగా రోలర్ కోస్టర్లో ఎక్కి కూర్చుని, వెనక్కు ఆనుకుని స్వారీ ఆనందిస్తాము. కానీ ఈ సైకిల్ రోలర్ కోస్టర్ ను ఎవరికి వారే తొక్కి నడిపి స్వారీ చేసుకుంటూ ఆనందించాలి. అయితే ఈ స్వారిలో చుట్టుకోనుండే మలుపులు, పైకి ఎక్కే, వేగంగా క్రిందకు దిగే మార్గాలు ఉండవు. అయినాకూడా ఈ ఆకాశ సైకిల్ రోలర్ కోస్టర్లో స్వారీ చేసే వారికి హృదయ వేగం మాత్రం ఎక్కువగానే ఉంటుంది. కారణం, ఈ రోలర్ కోస్టర్ అత్యంత ఎత్తులో ఉండటమే. అదేలాగా వెనుక కనబడే అద్భుతమైన సీమోట్ సుయ్ వంతెన దృశ్యము మరచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది.