Monday, December 22, 2014

మరో కోతి ప్ర్రాణం కాపాడిన డాక్టర్.కోతి.....వీడియో


ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ రైల్వేస్టేషన్ అది! ఆదివారం ఉదయం ఓ కోతి అక్కడి హైటెన్షన్ విద్యుత్(25వేల వాట్స్) తీగలపై నడుస్తూ షాక్‌కు గురై పట్టాల నడుమ పడిపోయింది. పక్కనే ప్లాట్‌ఫామ్‌పై తన పిల్లలతో కోతిచేష్టల్లో మునిగితేలుతున్న ఓ తల్లికోతి.. పరుగుపరుగున అక్కడికి వచ్చి వాలిపోయింది. దానివెంటే పిల్ల కోతులూ వచ్చాయి. రైలుపట్టాల మధ్య జీవచ్ఛవంలా పడి ఉన్న కోతిని బతికించేందుకు ఆ తల్లికోతి నానా యాతనలు పడింది. వైద్యుడిగా అవతారమెత్తింది. పట్టాల నడుమ ఉన్న తన మిత్రురాల్ని పైకి లేపేందుకు చెమటోడ్చింది. నోటితో బాధిత కోతిని అనేకసార్లు తడిమింది. ఎంతకూ మిత్రురాలు స్పందించకపోవడంతో తల్లికోతి కేకలు పెట్టింది.

అయినా ఫలితం కనిపించకపోవడంతో బాధిత కోతిని నోటితో గుంజుకొచ్చి మరీ పక్కనే ఉన్న నీటిలో ముంచింది. పైనుంచి నీళ్లుపోసింది. సుమారు 20 నిమిషాల తర్వాత బాధిత కోతి కదలడంతో తల్లికోతి కాస్త ఊపిరిపీల్చుకుంది. ఆ తర్వాత బాధిత కోతిని పక్కనే ఉన్న పోల్‌కు నిలబెట్టి సపర్యలు చేసింది. అనంతరం మిగతా కోతులతో పాటు బాధిత కోతి కూడా ఎప్పటిలాగే తమపనుల్లో నిమగ్నమయ్యాయి!! రైల్వే ప్లాట్‌ఫామ్‌పై ఈ సంఘటనను చూస్తున్నవారిలో ఓ వ్యక్తి వీడియో తీసి ఇంటర్నెట్‌లో పోస్ట్‌చేశాడు. ఈ వీడియో ఇప్పుడు ఓ హాట్ టాపిక్.

No comments:

Post a Comment