Monday, December 15, 2014

నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రతికే ఉన్నారా...?

తమిళనాడులో ఉన్న మధురై నగరంలోని మద్రాసు హై కోర్ట్ భాగములో, సింగిల్ జడ్జ్ బెంచ్ ముందు భారతీయ సుభాష్ సేనా సంఘం నిర్వాహకులు , 35 సంవత్సరాల వయసు కలిగిన ఏ.అలగు మీనా ఒక పిటిషన్ ఉంచేరు.


కేంద్ర ప్రభుత్వం గనుక నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను యుద్ద ఖైదీగా చూడమని లేక ఆయనను బ్రిటీష్ ప్రభుత్వానికి అప్పగించమని హామీ ఈ కోర్టుకు సమర్పిస్తే నేతాజీ సుభాష్ చంద్రబోస్ ని ఈ కోర్టు ముందు హాజరు పరుస్తానని ఆ పిటీషన్లో తెలిపేరు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ బ్రతికుంటే ఆయనకు ఇప్పుడు 117 సంవత్సరాల వయసు ఉంటుంది. ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడా? అన్న ప్రశ్నను పిటిషన్ దారున్ని అడగకుండానే "హామీ ఇస్తారా?" అని అడుగుతూ కేంద్ర ప్రభుత్వానికి నోటీస్ పంపించి, ఈ పిటిషన్ మీద తదుపరి విచారణను జనవరి 2015 కు వాయిదా వేసేరు సింగిల్ జడ్జ్.


ఇదే కోర్టులో ఇంతకు మునుపు నేతాజీ సుభాష్ చంద్రబోస్ మరణం/కనిపించకపోవటం గురించిన వివరాలను భారత ప్రభుత్వం తమకు తెలుపాలని ఒక పి.ఐ.ఎల్ పిటిషన్ పెండింగ్ లో ఉన్నది. ఆ పిటిషన్ కు మద్దతుగా ఈ అఫిడవిట్ పిటిషన్ వేయబడింది.

3 comments:

  1. Really interesting. Please post further details without fail

    ReplyDelete
  2. 6-3-1952 నాటి ఆంధ్రప్రభ దినపత్రికలో వచ్చిన ఈ వార్త చూడండి.
    https://www.dropbox.com/s/dhs50a3rp5d48b2/netaji.JPG?dl=0

    ReplyDelete
  3. అలాంటి వ్యక్తుల గురించి ఖచ్చితంగా ఒక నిర్ధారణకు తప్పనిసరిగా రావాలి!
    లేని పక్షంలో భవిష్యత్తులో మరింత అయోమయానికి గురవడం జరగవచ్చు?

    ReplyDelete