Tuesday, December 2, 2014

తాయ్లాండ్ దేశంలో ఉన్న బంగారు బుద్ద విగ్రహం....ఫోటో

తాయ్లాండ్ దేశంలో బ్యాంకాక్ నగరంలోని వాట్ ట్రైమిత్ అనే చోట ఉన్నది ఈ పూర్తి బంగారు విగ్రహం.

5.5. మెట్రిక్ టన్నుల బరువున్న ఈ విగ్రహం 3 మీటర్ల ఎత్తు ఉంటుంది. ఈ రోజు బంగారం ఉన్న ధరలో దీని విలువ 300 మిల్లియన్ డాలర్లు!

కొన్ని వందల సంవత్సరాల వరకు ఈ విగ్రహం పూర్తిగా బంగారమని ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఈ విగ్రహం ప్లాస్టర్ ఆఫ్ స్టుకో అనే ఒక సిమెంటు గారతో దాచబడింది. ఈ విగ్రహాన్ని పాడైపోయిన ఒక గుడిలో ఉంచేరు. 1930 లో ఈ విగ్రహాన్ని అక్కడి నుండి వేరు చోటుకు తీసుకు పోతున్నప్పుడు,ఆ సిమెంట్ గార కొంచంగా తొలగి బంగారం కనబడింది. అప్పుడు తెలిసింది అది పూర్తి బంగారు విగ్రహమని.


No comments:

Post a Comment