Wednesday, December 17, 2014

2012 లో మనదేశము నుండి తరలించిన బ్లాక్ మనీ రూ.6 లక్షల కోట్లు..... న్యూస్

భారతదేశము నుండి 2012 లో రూ.6 లక్షల కోట్లు (Rs.6,000,000,000.000/-) విదేశాలకు చట్ట విరుద్దంగా తరలించబడిందట. దీనితో ఇంతవరకు మన దేశము నుండి చట్ట విరుద్దముగా తరలించబడ్డ బ్లాక్ మనీ విలువ మొత్తం రూ.28 లక్షల కోట్లు (Rs.28,000,000,000,000/-).

ఈ వివరాలను నిన్న అమెరికా దేశ రాజధాని వాషింగ్టన్ డి.సి లో ఉన్న గ్లోబల్ ఫినాన్షియల్ ఇంటెగ్రిటి (Global Financial Integrity) అనే సంస్థ తమ అధ్యయనం లో తెలిసినట్లు తెలియపరచింది.


ఇంత డబ్బుకు టాక్స్ కట్టలేదనేది పక్కన పెడితే, విదేశీ బ్యాంకులలో బద్రంగా దాచుకున్న ఈ డబ్బు అవినీతి మరియు క్రిమినల్ క్రియకలాపాలకు వాడబడుతున్నదని వారు తెలిపేరు. భారతదేశానికి బ్లాక్ మనీ ప్రధాన సమస్యగా ఉంటోంది. మోదీ ప్రభుత్వం విదేశాలలో దాచుకోబడ్డ మొత్త బ్లాక్ మనీని వంద రోజులలో బయటకు తీసుకు వస్తామని ఎన్నికల ముందు ప్రజలకు వాగ్దానం చేసింది. బ్లాక్ మనీ దాచుకున్న వారి గురించిన వివరాలను పరిశోధించడంలో ముందడుగు వెస్తున్నా మరింత గట్టి నిర్ణయాత్మక చర్యలు తీసుకోవలసిన అవసరం మోదీ ప్రభుత్వానికి ఎంతైన ఉన్నది.


బ్లాక్ మనీ గురించిన రాజకీయ గోలను ఆపి, కార్యంలోకి దిగాలి. ఎందుకంటే జాతీయ సంపద విదేశాలకు తరలించబడటాన్ని నియంత్రించకపోతే మన దేశం అభివ్రుద్ధి చెందదు. "పైన చెప్పబడిన డబ్బు మాత్రమే కాకుండా ఇంకా ఎంతో డబ్బు చిన్న మొత్తాలలో అవినీతిగా తరలించబడుతోంది. వాటిని లేక్కలకు తీసుకురాలేము" అని గ్లోబల్ ఫినాన్షియల్ ఇంటెగ్రిటి చీఫ్ ఆర్థికవేత్త దేవ్ కర్ తెలిపేరు.

విదేశాలలో దాచుకున్న బ్లాక్ మనీని తిరిగి దేశానికి తీసుకు వచ్చే ఏర్పాట్లకంటే, ఇక మీదట విదేశాలకు తరలించబోతున్న బ్లాక్ మనీని అడ్దుకోవటం చాలా ముఖ్యం. దీనికోసం మోదీ ప్రభుత్వం రాజకీయాలను దూరంగా ఉంచి జాతీయ సంపదను దక్కించుకోవడానికి ఒక భారతీయుడిగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. లేకపోతే పోను పోను మన సంపదను మనమే కోల్పోతాము.

No comments:

Post a Comment